HEALTH & LIFESTYLE

తెల్లజుట్టు సమస్యా.. అయితే ఇవి పాటించండి..!

వైట్ హెయిర్… ఆడవారిలో, మగవారిలో తరచుగా వేధిస్తున్న సమస్య.. చిన్న పిల్లల్లోనూ ఇది కామన్ అయిపోయింది. మన జుట్టు ఎక్కువశాతం నల్లగానే ఉంటుంది. కానీ తెల్లరంగులోకి మారడానికి ప్రధాన కారణం… వెంట్రుకకు రంగునిచ్చే.. మెలనిన్ ఉత్పత్తి కుదుళ్ళ నుంచి తగ్గిపోవడమే. 

మరో కారణం.. స్ట్రెస్.. అవును, ఆఫీస్ టెన్షన్ లు, చదువు ఒత్తిళ్ల వల్ల మనకు తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురవుతున్నాం.. ఈ ఒత్తిడి సైతం.. జుట్టు పోషణను అడ్డుకోవడానికి కారణమవుతుందనీ మీకు తెలుసా… ఇది చాలదని మార్కెట్లో దొరికే రకరకాల హై కెమికల్ షాంపూలు.. వాడటం వల్ల కుదుళ్ళలోని కణజాలం క్రమంగా దెబ్బతింటుంది. కాబట్టి మెలనిన్ దెబ్బతినకుండా, ఆపై తెల్ల జుట్టు కాస్త నల్లగా మారాలంటే ఇవి చేసి చూడండి…

ఆమ్లా పౌడర్.. ఒక గిన్నెలో ఒక కప్పు వరకు ఆమ్లా పౌడర్ ను వేసి, 500 మిల్లిలీటర్ల మేర కొబ్బరినూనెను అందులో వేసి, సన్నని మంట మీద ఓ ఇరవై నిమిషాలపాటు వేడి చేయాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. గాలి చొరబడని సీసాలో వడకట్టి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన ఆయిల్ ను   వారానికి రెండుసార్లు మసాజ్‌గా చేసుకుంటే చాలు.

బ్లాక్ టీ… బ్లాక్ టీ ఆకులను 2 గంటల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని నిమ్మరసంతో మిక్స్ చేసి.. అరగంటకు పైగా హెయిర్ మాస్క్ లా అప్లై చేయడం వల్ల రిజల్ట్ బావుంటుంది.

కరివేపాకు ఆకులు… గుప్పెడు కరివేపాకు ఆకులను తీసుకొని, 2 స్పూన్ల ఆమ్లా పౌడర్, 2 టీస్పూన్ల బ్రాహ్మీ పౌడర్‌తో కలిపి మిక్సీ పట్టాలి. దీన్ని హెయిర్ మాస్క్‌గా వారానికోసారి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి, తక్కువ గాఢత కలిగిన షాంపుతో కడిగేసుకోవాలి.

ఇండిగో, హెన్నా… ఇండిగో.. అమ్మమ్మల కాలం నుంచి వాడుతున్న బెస్ట్ న్యాచురల్ కలర్ ఇది. దీన్ని  హెన్నాతో కలిపి వాడటం వల్ల జుట్టు త్వరగా నల్లబడుతుంది.

కొబ్బరి నూనె… కొబ్బరినూనె, నిమ్మరసం మిశ్రమాన్ని రెగ్యులర్ గా పెట్టుకోవడం ఉత్తమం. ఇది డాండ్రఫ్ ను పోగొట్టడంలో సహాయపడుతుంది. కొంత కాలానికి జుట్టును సహజంగానే నల్లగా మారుస్తుంది.

Show More
Back to top button