
ప్రస్తుతం చిన్నవాళ్ల దగ్గర నుంచి యుక్త వయస్సు వారి వరకూ అందరూవాటిని నేను అది కావాలి, నేను ఇది చేయాలి అని కలలు కనేవారే. సాకారం చేసుకోవడం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటారు. అటువంటి వారిలో ఉత్తరాఖండ్ జిల్లా సితార్గంజ్కు చెందిన హిమాన్షు గుప్తా ఒకరు. సివిల్ సర్వెంట్ కావాలని కలలు కన్నాడు. పేదరికమనే ముళ్లబాటను దాటి.. IAS అనే పూల బాటపై నడుస్తున్నారు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతే. తండ్రి కూలీగా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు.
అయినా కనీస ఖర్చులు కూడా సరిపోక, కొడుకుతో టీ కొట్టు ప్రారంభించారు.
ఇటువంటి కష్టాలను ఈదుకుంటూ.. ఎటువంటి కోచింగ్ లేకుండా ఉన్నత శిఖరాలను అందుకున్నాడు.
తనను చదివించడం కోసం.. తన తండ్రి ఎల్లప్పుడు ఉద్యోగాల కోసం, వివిధ ప్రదేశాలలో తిరిగేవాడని, దీంతో పెద్దగా తన తండ్రి ప్రేమను పొందలేక పోయానని తెలిపారు. విద్య కోసం ప్రతీరోజూ 70 కి.మీ ప్రయాణించేవారట. అతను ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి అతని బ్యాచ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
అంతేకాకుండా విదేశాలలో పీహెచ్‌డీని అభ్యసించే అవకాశం వచ్చినా, వద్దనుకుని భారతదేశంలోనే ఉండి సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకున్నారు.
కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వ కళాశాలలో రీసెర్చ్ స్కాలర్‌గా పని చేశారు.
దాని వల్ల డబ్బు సంపాదించమే కాకుండా సివిల్ సర్వీస్‌కు సిద్ధం కావడానికి బాగా ఉపయోగపడిందని తెలిపారు.
అంతేకాదు చదువుకునేటప్పుడు కళాశాల ఫీజు కోసం ట్యూషన్లు, చెప్పుకుంటూ ఇంకా బ్లాగులు కూడా రాసేవాడట.
తను ఎటువంటి కోచింగ్ లేకుండా.. యూట్యూబ్ నుంచి, ఇంటర్నెట్లో దొరికిన సమాచారంతో మూడుసార్లు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రయత్నించాడు.
అయితే మొదటి ప్రయత్నంలో IRSకి మాత్రమే ఎంపికయ్యారు. కానీ దానితో తృప్తిపడక..
అనుకున్నది సాధించడం కోసం, ప్రిపరేషన్ కొనసాగించి 2019 UPSC పరీక్షలో IPS అయ్యాడు.
కానీ IAS అవ్వాలన్నా తన ఆశతో మూడోసారి పరీక్ష రాసి, ఆల్ ఇండియా 27th ర్యాంక్ పొంది, తాను కలలుగన్న IAS ఉద్యోగం పొంది..
ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.