GREAT PERSONALITIESTelugu Featured NewsTelugu Special Stories

‘ముఖ్యమంత్రి’గా అసాధారణ శకం: చంద్రబాబు నాయుడు..!

సాధారణ పల్లెటూరులో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి..
స్థానిక ప్రజాప్రతినిధిగా రాజకీయ ఓనమాలు దిద్ది.. 
ఎమ్మెల్యేగా.. పలు శాఖలకు మంత్రిగా పౌరసేవలు అందించి..
హైదరాబాద్ వంటి ప్రముఖ సిటీలో.. ఐటీకి జీవం పోసి.. ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధినేతగా.. 

దేశ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పోషించిన పాత్ర దేశ చరిత్రలో ముఖ్య అధ్యాయంగా లిఖించవచ్చు. 
రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ముగ్గురు ప్రధానులు, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపికలోనూ చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం!
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజానాయకులలో అల్టిమేట్ లీడర్ గా నిలిచారు.

తెలుగుదేశం పార్టీ అధినేతగా..

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..
  • తెలుగువారి ప్రతిభను నలుమూలల చాటుతూ..
  • నవ్యాంధ్ర అభివృద్ధి రథసారథిగా..
  • సంక్షేమాన్ని, మంచి పాలనను రెండు చేతులా ప్రజలకు అందించగల దిగ్గజ నేతగా.. 
  • ఉత్తమ ఆర్థిక, విద్యా సంస్కరణలతో దేశానికే దిశా నిర్దేశం చేసిన దార్శనిక నేత.. ఐదు దశాబ్దాలుగా తెలుగునేల ఉన్నతికి కృషి చేస్తున్న మహర్షి..

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు (ఏప్రిల్ 20) సందర్భంగా… ఆయన రాజకీయ విశేషాలపై ఒక రౌండప్ వేసేద్దాం..

నేపథ్యం..

1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో శ్రీ ఖర్జూరనాయుడు, శ్రీమతి అమ్మణ్ణమ్మలకు చంద్రబాబు నాయుడు జన్మించారు. పక్క ఊరు కాకినాడ శేషాపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం, చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తయ్యింది. 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. ఉత్తీర్ణత పొందారు. 1974లో ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎం.ఏ. ఎకనామిక్స్) చేశారు.

అనంతరం.. 1977లో పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియామకం చెందారు.

1978 ఫిబ్రవరి 25న చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ప్రత్యర్థి పట్టాభిరామ చౌదరిపై 2,494 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి.. ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు.

1980 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తుశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

*1981 సెప్టెంబర్ 10న మద్రాసులో ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరితో చంద్రబాబు వివాహం జరిగింది.

1983 జనవరి 23న ఎన్టీరామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రెండు వారాలకు చంద్రబాబు దంపతులకు నారా లోకేష్ జన్మించాడు.

రాజకీయ విశేషాలు..

*1984 మే 27న తెలుగుదేశం పార్టీలో చేరారు.

*1984లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కర్షక పరిషత్ చైర్మన్ గా నియామకం పొందారు.

*1985లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

*1985 మార్చి 5న మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా, తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు.

*1989 డిసెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

Special Story On Nara Chandrababu Naidu Birthday
Special Story On Nara Chandrababu Naidu Birthday

*1992లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్థాపన జరిగింది.

*1994 డిసెంబర్ 12న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తరువాత… ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర రెవెన్యూ, పునరావాస, ఆర్థిక, ప్రణాళిక, చిన్న మొత్తాల పొదుపు, లాటరీల శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

*1995 ఆగస్టు 23న కుట్రదారుల నుంచి తెలుగుదేశం పార్టీని ఒకరకంగా కాపాడిన మేధావి.

సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నవంబర్ 1 నుంచి ‘ప్రజల వద్దకు పాలన’ను ప్రారంభించారు.

*1996 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ (యునైటెడ్ ఫ్రంట్) చైర్ పర్సన్ గా చంద్రబాబు ఎన్నికయ్యారు.

1996 జూన్ 1న హెచ్ డి దేవెగౌడను ప్రధాని చేయడంలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేశారు.

1996లో విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్ అంశం.

*1997 జనవరి 1న శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, మైక్రో లెవెల్ ప్లానింగ్ అనేవి లక్ష్యాలుగా ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

1997 మార్చి 13న బీసీ కమిషన్ ఏర్పాటు.. 

స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన.

1997 మార్చిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ తో మొదటిసారిగా చంద్రబాబు భేటీ అయ్యారు.

1997 ఏప్రిల్ 21న దేశ ప్రధానిగా ఇంద్ర కుమార్ గుజ్రాల్ ఎన్నిక అయ్యేందుకు చంద్రబాబు ముఖ్యభూమిక పోషించారు.

1997 జులై 25న దేశాధ్యక్షునిగా కె.ఆర్. నారాయణన్ ప్రమాణ స్వీకారం చేయగా.. దేశానికి తొలి దళిత అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు ముఖ్యపాత్ర వహించడం జరిగింది.

1997లో విజన్ – 2020 డాక్యూమెంట్ తయారీకి 14 టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేశారు.

*1998 మార్చి 19న చంద్రబాబు జాతీయ కన్వీనర్ గా ఎన్.డి.ఏ ఏర్పాటు. దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పేయి ఎన్నికయ్యారు.

1998 మార్చి 24 – దేశానికి తొలి దళిత స్పీకర్ ను ప్రతిపాదించారు. 

1998లో 12వ లోక్ సభ స్పీకర్ గా, 1999లో రెండోసారి కూడా 13వ లోక్ సభ స్పీకర్ గా బాలయోగి ఎన్నికయ్యారు.

1998 సెప్టెంబర్‌ 10న ‘పచ్చదనం-పరిశుభ్రత’ కార్యక్రమం ప్రారంభం జరిగింది.

1998 నవంబర్ 22న ప్రధాని వాజ్ పేయి చేతుల మీదుగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ప్రారంభోత్సవం జరిగింది.

*1998-99లో డ్వాక్రా పథకం కింద రూ. 2.93 లక్షల స్వయం సహాయక సంఘాల ఏర్పాటు.

*1999 జనవరి 26న రైతుబజార్ల ప్రారంభోత్సవం

విజన్ – 2020 పేరిట డాక్యుమెంట్ ను విడుదల చేసిన చంద్రబాబు.

1999 ఫిబ్రవరి 28న హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన బిల్ గేట్స్.

జులై 9న నిరుపేద మహిళలకు ‘దీపం’ పథకం ప్రారంభం. 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం అనేది ఒక చరిత్ర.

1999లో హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు. ప్రపంచానికి కరోనా టీకాను అందించిన భారత్ బయోటెక్ సంస్థ ఇక్కడిదే అని గర్వంగా చెప్పవచ్చు.

1999 అక్టోబర్ 25న చంద్రబాబు అధ్యక్షతన స్వర్ణాంధ్రప్రదేశ్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.

1999 అక్టోబర్ లో భారత పార్లమెంటు ఎన్నికల్లో సైతం తెలుగుదేశం విజయబావుటా ఎగురవేసింది.  

1999 నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా, తొలి దళిత స్పీకర్ గా కావలి ప్రతిభా భారతి ఎంపికైంది.

1999 డిసెంబర్ – చంద్రబాబుకు ‘సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్ 1999’ అవార్డు

*2000 జనవరి 9న ఇండియా టుడే తదితర సంస్థల పోలింగ్ లో 11,016 ఓట్లతో ‘ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం’గా చంద్రబాబు నాయుడు ఎంపిక

2000 జనవరి 26 – సిటిజెన్ చార్టర్ ఆఫ్ HMWSSB ఏర్పాటు. 

2000 ఏప్రిల్ లో జల సంరక్షణ కోసం ‘నీరు-మీరు’ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది.

*2001 మార్చి 23 జస్టిస్ కె.పున్నయ్య నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటైంది.

2001 – ప్రజలకు e-పరిపాలన అందించేందుకు 160 సేవలతో 200 e-సేవా కేంద్రాల ఏర్పాటు. 

(1999లో కేవలం 6 సేవలు)

2001 జులై 1 – విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు

*2001 డిసెంబర్ 2న ప్రధాని వాజ్ పేయి చేతుల మీదుగా హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ప్రారంభమవుతుంది.

*2002 జులై 25న భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం బాధ్యతల స్వీకరణ. అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించి అటు ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని ఇటు కలాంను ఇద్దర్ని ఒప్పించి మెప్పించిన చంద్రబాబు.

2002 డిసెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ లో 32వ జాతీయ క్రీడల నిర్వహణ జరిగింది.

*2003 జూన్ 26న ప్రజాస్వామ్యంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ- పరిపాలన అంశాలపై ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించారు.

2003 ఆగస్టు 9న భారత ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చేతుల మీదుగా ఎం.ఎం.టి.ఎస్. హైదరాబాద్ – మొదటి దశ జాతికి అంకితమిచ్చారు.

2003 – శంషాబాద్ విమాశ్రయ నిర్మాణం కోసం ‘హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ’కి 5,495 ఎకరాల భూమి కేటాయింపు జరిగింది.

2003 అక్టోబర్ 1న తిరుపతిలో అలిపిరి వద్ద చంద్రబాబు పై హత్యాయత్నం జరిగింది.

2003 అక్టోబర్ 24న ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఆఫ్రో- ఆసియన్ గేమ్స్ నిర్వహణ.

*2004 మే 11న ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ..

ప్రజల్లో ఉంటూ..

*2008 ఫిబ్రవరి 27న యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా న్యూ ఢిల్లీలో జాతీయ నాయకులతో కలిసి కిసాన్ ర్యాలీలో పాల్గొన్నారు.

2010 జులైలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంపై చంద్రబాబు నిరసన.. ఇందుకు అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు. తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు.

*2010 డిసెంబర్ 20న అన్నదాత కోసం 8 రోజుల నిరాహార దీక్ష. అరెస్టు చేసి బలవంతంగా నిమ్స్ కు తరలించిన పోలీసులు.

*2011 డిసెంబర్ 17న జిల్లాల్లో రైతు పోరుబాట యాత్ర

*2012 అక్టోబర్ 2న అనంతపురం, హిందూపురం నుంచి చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ప్రారంభం. 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు నాటి ఉమ్మడి రాష్ట్రంలో 16 జిల్లాలు, 86 అసెంబ్లీ నియోజకవర్గాలు, 162 మండలాలు, 28 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు, 1289 గ్రామాల గుండా 2,817 కిలోమీటర్ల మేర నడిచారు.

*2013 ఏప్రిల్ 27న విశాఖలో పాదయాత్ర ముగింపు.

2013 జూన్ 24న ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న 190 మంది తెలుగువారికి సహాయం కోసం ప్రత్యేక విమానం… హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కాల్ సెంటర్‌ ఏర్పాటు

2013 సెప్టెంబర్ 1న విభజన ప్రకటన సందర్భంగా గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని పొందుగల నుంచి బస్సులో ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ మొదటిదశ ప్రారంభమైంది.

“2013 అక్టోబర్ 7న అసంబద్ధ రాష్ట్ర విభజన తగదంటూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు.

2013 నవంబర్ 21న రెండో విడత ‘ఆత్మగౌరవ యాత్ర’ ప్రారంభించారు.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా..

2014 జూన్‌ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఐదు ఫైళ్లపై 5 సంతకాలు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు.

2014 సెప్టెంబరు 3న రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ శాసనసభ తీర్మానం చేశారు.

2014 అక్టోబర్ 2న రూ.200 నుంచి రూ.1000కి ఐదు రెట్లు పెరిగిన పింఛను పంపిణీ ప్రారంభం.

2014 డిసెంబర్ 10న చారిత్రక రైతు రుణమాఫీ పథకం అమలు చేశారు.

2014 డిసెంబరు 23న ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ.

*2015 మార్చి 30న దేశంలో మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు ‘పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు’కు శంకుస్థాపన చేశారు.

2015 మే డే – అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా పథకం ప్రకటించారు.

2015 అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

2016 మార్చి 29న పట్టిసీమ ఎత్తిపోతల ప్రారంభం కాగం. ఏడాదిలో పూర్తి కావడం ఒక రికార్డు!

2016 ఏప్రిల్‌ 25న వెలగపూడి సచివాలయం ప్రారంభం

2016 జూన్‌ 6న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభమైంది.

2016 అక్టోబర్ 12న ఏపీ సచివాలయం నుంచి పని ప్రారంభం. డ్వాక్రా రుణమాఫీపై తొలి సంతకం చేశారు.

2017 మార్చి 2న వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు.

2017 మేలో చంద్రబాబుకు “ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు” లభించింది.

*2018 ఫిబ్రవరి 2న కియా ఇన్‌స్టలేషన్ వర్క్‌కు శంకుస్థాపన జరిగింది.

*2018 సెప్టెంబర్ 12న చరిత్రాత్మక పోలవరం గ్యాలరీ వాక్ జరిగింది.

*2019 జనవరిలో 54 లక్షల మందికి పింఛను రూ.1000 నుంచి రూ.2000లకు పెంపు

*2019 జనవరి 7న మొత్తం 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను 24 గంటల్లో పూర్తి చేసి రెండు గిన్నిస్‌ బుక్ ఆఫ్ రికార్డులను నమోదు చేసిన పోలవరం ప్రాజెక్టు.

*2019 జనవరి 29న కియా కార్ల పరిశ్రమ వారి ‘ట్రయల్ ప్రొడక్షన్’ కార్యక్రమం జరిగింది.

2019 ఫిబ్రవరి 3న హైకోర్టు ఐకానిక్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన. 

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ (ప్రస్తుత హైకోర్టు) ప్రారంభోత్సవం జరిగింది.

2019 ఫిబ్రవరి 11న ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రానికి వ్యతిరేకంగా ‘ధర్మ పోరాట దీక్ష చేయడం జరిగింది.

కొన్ని వారాల్లోనే మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది.. ఆ తరువాత ఒకదాని వెంట మరొకటి సాఫ్ట్వేర్ దిగ్గజాలన్నీ హైదరాబాద్ కు క్యూ కట్టాయి. 

అది మొదలు వైకాపా కోరలు పీకి..

కూటమిగా జట్టు కట్టి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చే క్రమంలో ఆంధ్ర పౌరుల భవితను మరింత సుగమం చేసేలా చర్యలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో వేగం..

కచ్చితత్వం.. 2.0 వెర్షన్ తరహా సేవలతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు.

విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఐటీ జ్ఞానిగా అభివర్ణించబడే చంద్రబాబు నాయుడు, ఈ-గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేశారు.

ఎలక్ట్రానిక్స్ & మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను ప్రోత్సహించి విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక, పాలనా వంటి రంగాల్లో సాంకేతికతను అందిపుచ్చుకున్నారు.

ఈ క్రమంలో ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని ఆయన ఆకర్షించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో… 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24వ తేదీని ‘నాయుడు డే’గా ప్రకటించారంటే అతిశయోక్తి కాదు. 

ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబును ‘ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం’గానూ పేర్కొంది. ఎకనమిక్ టైం వార్తా సంస్థ ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’… టైమ్ ఆసియా సంస్థ “సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్”.. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాస పత్రిక ‘ప్రాఫిట్’ చంద్రబాబును ‘హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లో ఒకర’ ని వర్ణించింది. 

ఎన్టీఆర్ తెలుగుజాతికి ప్రపంచ ఖ్యాతినీ తీసుకువస్తే, చంద్రబాబునాయుడు తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలా చాటారు.

ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆయన రెండు చేతులా ప్రజలకు అందించారు. విద్యుత్, ఆర్థిక, విద్యా సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరుగులు పెడతాయి. సంపద సృష్టి అన్న దాన్ని పాలనలో ప్రవేశపెట్టిన మేధావి చంద్రబాబునాయుడు..

నేడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్… గా మారారు.

Show More
Back to top button