HEALTH & LIFESTYLE

మొటిమలు రావడానికి ఈ ఫుడ్ కారణం

ముఖ సౌందర్యాన్ని తగ్గించే వాటిలో మొటిమలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయి. మొటిమలు లేకుండా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే సమస్య మొటిమలు. మొటిమలతో పాటు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. సాధారణంగా మొటిమలు మానసిక ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, తీసుకొనే ఆహార పదార్థాలతోనే వస్తాయి. ఏ ఆహార పదార్థాలతో మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం.

జున్నులో ప్రొజెస్టెరాన్ సమృద్ధిగా ఉండుట వలన కొవ్వు ఉత్పత్తి గ్రంధులను అధిక మొత్తంలో పెంచుతుంది. దీనితో చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జున్ను తీసుకోవద్దు. బ్రెడ్‌లో గ్లూటెన్ ఉండటం వలన మొటిమలను కలిగిస్తుంది.

బంగాళదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బాగా వేయించిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం పూర్తిగా మానేయాలి. ఇవి చర్మంపై వాపును కలిగించటానికి కారణమవుతాయి. ఇవే మొటిమలకు కారణం.

Show More
Back to top button