TRAVEL

షిల్లాంగ్ టూర్ ప్లాన్ చేద్దామా..!

షిల్లాంగ్.. ఇది దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతం చూడడానికి ఎంతో సుందరంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు రమణీయంగా ఉంటాయి. అవి మాటల్లో వర్ణించలేము. ఈ ప్రాంతాన్ని చూసుంటే.. ఇక్కడికి ఒకసారి వెళ్తే మళ్లీ తిరిగి వెళ్లాలనే ఆలోచన కూడా రాదని ఇప్పటికే వెళ్లిన పర్యాటకులు చెబుతున్నారు. ఖాసీ, గారో కొండల మధ్య ఉన్న ఈ అందమైన హిల్ స్టేషన్ వద్ద మెరిసే జలపాతాలు, పచ్చని పచ్చదనం, నీలిరంగు సరస్సులు, విభిన్న సంస్కృతులను కలిగి ఉంటుంది. షిల్లాంగ్ అందం కారణంగా దీనిని ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’ అని పిలుస్తారు. అలాంటి ప్రదేశానికి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏం ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


హైదరాబాద్, విజయవాడ నుంచి షిల్లాంగ్ వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రైలు మార్గం.. మరొకటి వచ్చేసి విమాన ప్రయాణం. మీరు విజయవాడ నుంచి నేరుగా షిల్లాంగ్ వెళ్లవచ్చు లేదా ముందుగా గౌహతి చేరుకుని అక్కడి నుంచి బస్సులో వెళ్లవచ్చు. కావాలనుకుంటే సొంత వాహనంలో కూడా వెళ్లవచ్చు. మీ బడ్జెట్‌ని బట్టి మీరు రవాణాను ఎంచుకోండి. రైలు ప్రయాణానికి దాదాపు 40 నుంచి 44 గంటల సమయం పడుతుంది. విమానం అయితే 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. అదే సొంత వాహనం అయితే 29 గంటల్లో చేరుకోవచ్చు. బస్‌స్టాప్ చేరుకున్న తర్వాత షిల్లాంగ్‌లో నివసించడానికి హోటల్ బుక్ చేసుకోండి. ఈ టూర్‌ పూర్తి చేయడానికి కనీసం 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది.

* షిల్లాంగ్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు

* లేడీ హైదరీ పార్క్
* ఫాన్ నోంగ్లాట్ పార్క్
* ఉమియం సరస్సు
* ఎలిఫెంట్ ఫాల్
* షిల్లాంగ్ శిఖరం
* వార్డ్ సరస్సు
* లైత్లాం లోయ

షిల్లాంగ్ బడ్జెట్
మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ఖర్చు అవుతుంది.
విమానం – రూ.8,500 నుంచి 25,000
రైలు  – రూ.1,100 నుంచి 4,500
సొంత వాహనం – రూ.19,000 నుంచి 30,000
హోటల్ ధర రోజుకు రూ.1,200 నుంచి 1,800
భోజనం ఖర్చు రోజుకు రూ.300 నుంచి 500
ఇతర ఖర్చులు రోజుకు రూ.500 నుంచి రూ.1000
దీని ప్రకారం మీ టూర్ ప్లాన్ చేసుకోండి.

Show More
Back to top button