Telugu Opinion SpecialsTelugu Politics

ఏపీలో కాంగ్రెస్ ఒక్క సీటుతోనైనా అసెంబ్లీకి వెళ్తుందా..?

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం, జనసేన కూడా ప్రాంతీయ పార్టీలుగా మారాయి. అదే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆంధ్రాలో నామమాత్రంగా మాత్రమే మిగిలాయి. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారం సాధించి, ఏపీలో కూడా తగిన ఓట్లు సాధిస్తామని అనుకున్నారు. కానీ, ఏపీలో సోనియా గాంధీని ఎవరూ నమ్మలేదు. కాంగ్రెస్ దీంతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతోపాటు తెలంగాణలో కేసీఆర్ చేతిలో ఓడిపోయింది. కానీ 2023లో కేసీఆర్‌‌‌‌ను ఓడించాలన్న ప్రజాకోరిక మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ను గెలిపించింది. 

2014, 2019లో  జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు వందలాది మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ ఏపీలో ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటుని గెలవలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర ప్రదేశ్‌ను రెండు ముక్కలగా చేయడమే. అయితే,  ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌‌‌‌కు నాయకత్వం వహిస్తున్న షర్మిలారెడ్డికి  కాంగ్రెస్  హైకమాండ్ మద్దతు ఉందని అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకు ఇద్దరికీ ఉపయోగకరం. షర్మిలా రెడ్డి ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమెకు రాజకీయాలలోని ప్రతి అంశం తెలుసు. అయితే, 2014 వరకు ఏపీలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది.

తర్వాత కాంగ్రెస్ ఓటు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలకు మళ్లింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌‌‌‌కు సారథ్యం వహిస్తున్నందున, సహజంగానే పాత కాంగ్రెస్ ఓటర్లు ఆమెకు మద్దతు ఇస్తారని, ఇది వైఎస్ఆర్ సీపీకి నష్టం అని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె కడప పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. షర్మిల ఇలా చేయడం‌, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు‌‌ సీఎం జగన్‌‌‌‌పై ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మొత్తం ఎన్నికలు పెద్ద పోటీగా మారనున్నాయి. షర్మిల వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌రెడ్డి కుమార్తె కావడంతో స్థానికంగా విభేదాలు రావచ్చంటున్నారు. 

షర్మిల గెలుపొందినా,  మెరుగైన ఫలితం సాధించినా అది కాంగ్రెస్‌‌‌‌కు ఎంతో మేలు చేస్తుంది. అయితే షర్మిల ఓడిపోతే మళ్లీ ఆమెకు కెరీర్-పరంగా ఛాలెంజ్ ఎదురుకావచ్చు. సీనియర్ నాయకులందరినీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు షర్మిల ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో ఆమె పాక్షికంగా విజయం సాధించింది. కానీ, కొందరు సీనియర్‌‌‌‌ మాజీ మంత్రులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించినా ప్రముఖ నాయకులు పోటీ చేయడానికి నిరాకరించారు. అయితే ఆమె విజయం సాధిస్తుందా లేదా అని సీనియర్  కాంగ్రెస్ నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

షర్మిలారెడ్డి కాంగ్రెస్‌‌‌‌కు గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తే ఆ క్రెడిట్ అంతా తమదే అంటారు. ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ ఓడిపోతే  షర్మిల దానికి కారణం అవుతారంటారు. మొత్తం మీద,  అసెంబ్లీకి సింగిల్ డిజిట్ శాసన సభ్యులను, పార్లమెంటుకు ఒకటి అరా సభ్యులను గెలిపించగలిగితే, ఏపీలో షర్మిలా రెడ్డి నాయకత్వానికి గట్టి పునాదులు పడినట్లుగానే భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్తుందా లేదా అనేది హట్ టాపిక్‌గా మారింది.

Show More
Back to top button