కొరటాల శివ, జూ.ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం ఈరోజు (సెప్టెంబర్ 27) ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. శ్రీదేవి కుమార్తైన జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమైన సినిమా.. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సాధించిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచానాలను పొందగలిగిందా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కథ..
అడవిలోని ఓ కొండ ప్రాంతం.. ఎర్ర సముద్రం తీరంలో దేవర (జూనియర్ ఎన్టీఆర్) భైరా (సైఫ్ ఆలీ ఖాన్) తన స్నేహితులు (శ్రీకాంత్, చాకో) కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ వారి జీవనాన్ని గడిపేవారు. అయితే వారి జీవితాల్లో ఎదుగుదల లేకపోవడం చూసి మురగ (మురశీ శర్మ) వారికి బాగా డబ్బు వచ్చేలా పని ఇస్తాడు. అయితే, సముద్రంలో అధికారులకు దొరకకుండా సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తుంటుంది. మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ల కూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను చంపడానికి భైర ఓ ప్రణాళిక వేస్తాడు. అయితే, సముద్రంపై వేటకు వెళ్లకూడదనే ఆంక్షల్ని దేవర ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను భైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకొన్నాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకొన్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి ఎందుకు వెళ్లాడు? అనేదే దేవర సినిమా కథ.
* ప్లస్ పాయింట్స్ : ఎన్టీఆర్. చాలా సెటిల్డ్ గా చేశారు. సినిమా అంతా తన భుజాన మోశారు. కథా నేపథ్యం, ఫస్ట్ హాఫ్, యాక్షన్, మ్యూజిక్, డ్యాన్సులు, స్క్రీన్ ప్లే రేసిగా ఉంటుంది.
* మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ మెరుపులు తగ్గడం వర, తంగం వీక్ ట్రాక్, రెండు పార్టులుగా చేయడం వల్ల కొంత సాగదీశారనిపిస్తుంది.
రేటింగ్ : 3/5
గమనిక: ఈ రివ్యూ ప్రేక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది కేవలం ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!