Telugu Cinema

కంగువా’ మూవీ రివ్యూ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కించిన చిత్రం .  భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ఈరోజు(నవంబర్ 14) విడుదలైంది. అయితే ఈ మూవీ అనుకున్న అంచనాలను చేరిందో లేదా అనేది పదండి రివ్యూపై ఓ లుక్ వేద్దాం.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 1070 – 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో సూర్య, కోల్ట్ యోగిబాబు బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని సూర్యని అదుపులోకి తీసుకుంటాడు. ఓ నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని  హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా  చూస్తాడు. అంతేకాదు సూర్యాను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. సూర్య కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ.

క‌థ‌ని ప్రస్తుతంతో ముడిపెట్టే క్ర‌మంలో మొదటి 20 నిమిషాలపాటూ సాగే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి త‌ప్ప‌, అవి ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌వు. కంగువా, పుల‌వ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు, ఆ  రెండు పాత్ర‌ల మ‌ధ్య పండిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌. అంతేకాదు సూర్య న‌ట‌న ఈ సినిమాకి హైలైట్‌‌గా నిలిస్తుంది. ఇక కొన్ని సీన్స ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా నడుస్తుంది. ఇది మూవీకి కొంత మైనస్‌గా చెప్పవచ్చు.

రేటింగ్: 2.75/5

Show More
Back to top button