CINEMATelugu Cinema

వరుణ్ తేజ్ ‘మట్కా’ రివ్యూ 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ లేటెస్ట్ మూవీ మట్కా ఈరోజు(నవంబర్ 14) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీ ఆడియన్స్‌ని ఆకట్టుకుందో.. లేదో తెలుసుకుందామా మరి.. 

ఈ మూవీ 1958 – 1982 మధ్య విశాఖ కేంద్రంగా జరిగే కథ. వరుణ్ తేజ్ బాల ఖైదిగా జైల్లో గడిపి యుక్తవయసు వచ్చాక జైల్లోంచి బయటపడిన వ్యక్తి. మొరటుతనం, చిన్నపాటి రౌడీయిజం అతను వృత్తిగా ఎంచుకుంటాడు. దానికి తగ్గట్టే అతను విశాఖలో కూలీ పనితో మొదలుపెట్టి గ్యాంబ్లింగ్ కింగ్ గా ఎదుగుతాడు. తను ఆడించే ఆటకి పెట్టిన పేరు “మట్కా”. దీనికి సంబంధించే ముందు జరిగేదే అసలు కథ.. ఇది తెలియాలంటే.. మూవీ చూడాల్సిందే.

ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే.. సినిమా మొత్తం రొటీన్‌గా ఉంటుంది. లవ్ ట్రాక్, యాక్షన్ సీన్స్ కొంత వరకు పర్వాలేదు అనిపిస్తాయి. ఇక మరోపక్క యాక్టింగ్ అపేస్తే బెటర్.. వరెస్ట్ మూవీ.. ఏం టార్చర్ రా బాబు అంటూ కొంతమంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాపై ఎక్కువగా యాంటీ ఫ్యాన్స్ రివ్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రేటింగ్:2/5

Show More
Back to top button