CINEMATelugu Cinema

ప్రారంభం మర్చిపోతే పొందిన విజయానికి సార్థకత ఉండదని తెలిపే చిత్రం.. స్వయంకృషి సినిమా..

నిమిది యేండ్ల చిన్నా, ప్రారంభం ఇంట్లో పని చేసే పిల్లవాడిని నిందించాడు. ఆ పిల్లవాడు ఒళ్లంతా దెబ్బలతో పాలిష్ చేశాడు, ఏడిపించాడు. కారణం ఆ పిల్లవాడు తన షూస్ సరిగ్గా పాలిష్ చేయలేదు, అందుకు అది శిక్ష. ఈ విషయం చిన్నాను పెంచుతున్న తండ్రి సాంబయ్య పాత్రధారి చిరంజీవికి తెలిసింది. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే చిన్నాని పిలిచి పని పిల్లవాడి ముందే చిన్నాతో బూట్లు పాలిష్ చేయించాడు. అంతే కాదు సాయంత్రం బడి అయిపోయాక తీసుకెళ్లి చెట్టు కింద గుడ్డపరిచి దారిన పోయే ప్రతీ ఒక్కరికీ పాలిష్ చేసే శిక్ష విధించాడు. చిరంజీవి గారు నటించిన స్వయంకృషి చిత్రంలోని సన్నివేశం ఇది.

ప్రారంభం మర్చిపోతే గమనం శిథిలం అవుతుంది. చెట్టు అరవై అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది, కానీ దాని వేర్లు భూమిలోకి ఉన్నాయన్న ఇంకిత జ్ఞానాన్ని అది కలిగి ఉంటుంది. మబ్బు ఆకాశాన్ని చుంబిస్తూ ఉంటుంది, కానీ దాని గర్భంలో ఉన్న నీటి గమ్యం మాత్రం నేలకే అన్న ఎరుకతో ఉంటుంది.  వందల ఎకరాల పంట అయినా మొలకతోనే మొదలవుతుంది అని రైతుకు తెలుసు. ఎంత అగాథానికి చేరుకున్నా తిరిగి తిరిగి ఓడ్డుకే చేరాలని జాలరికి తెలుసు. మడుగులేని కుంట నిలవలేదు. మొదలు గట్టిగా లేని దారం చివర గాలిపటాన్ని ఎగురవేయలేదు. పొంగు పొంగే తప్ప పాలు కాదు. ఇలాంటి సత్యాలు మర్చిపోతే జీవితం అర్థం ఉండదు, ఇవి పాటించక పోతే జీవనానికి గమనం ఉండదు.

ఎల్లపుడూ వాణిజ్య చిత్రాలతో, బ్రేక్ డాన్సులతో కమర్షియల్ చట్రంలో బిగిసుకు పోతున్నామని అనుకున్నప్పుడు, దాంట్లోంచి బయటకు వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో, వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తున్నా కూడా, ఒక నిజమైన కళాకారునిగా నిరూపించుకునే అవకాశం రావట్లేదనుకునే సమయంలో, ఒక చిక్కని సమస్య నుంచి ఒక ఉత్తమ దర్శకుడి కలయికలో “కష్టేఫలి” అన్న చక్కని సందేశాన్ని తెలియచెప్పిన చిత్రం “స్వయంకృషి”. చిరంజీవి గారి నుంచి చక్కటి నటనని రాబెట్టుకున్నారు దర్శకులు విశ్వనాథ్ గారు.

ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకునేలా చేసిన “స్వయంకృషి” సినిమా ఘనత మొత్తం కూడా “పూర్ణోదయ సంస్థ” మరియు దర్శకులు కె.విశ్వనాధ్ గార్లకు చెందుతుంది. కళాత్మక విలువలున్న వాణిజ్య సినిమా “స్వయంకృషి” అని సినిమా గురించి చెబుతారు చిరంజీవి గారు. తన ప్రగతికి దోహదమైన మూలాన్ని, దారిని మర్చిపోనంతకాలం ఏ మనిషి జీవితం సుఖమయం అవుతుంది, ఆదర్శప్రాయం అవుతుంది. డబ్బుకు, ప్రేమాభిమానాలకు, భావోద్వేగాలకు మధ్య సున్నితంగా అల్లిన ఆదర్శమైన కథ “స్వయంకృషి”. చిరంజీవి సినీ జీవితంలో ఒక అద్భుతమైన చిత్రంగా చిత్రాన్ని పేర్కొనవచ్చు.

గతంలో సినిమాలు ఎక్కువ శాతం ఏదైనా ఒక సామాజిక అంశాన్ని తీసుకుని దాని చుట్టూ ఒక హృద్యమైన కథను జోడించి ప్రజలకు తెలియచెప్పేవారు. గత సినిమాలలో సామాజిక విలువలను స్పృశించే విధంగా కథలు అల్లుకునేవారు. రాను రాను చిత్ర పరిశ్రమ అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది. పూర్తి వాణిజ్య చిత్రాలను తెరకెక్కించడం అలవాటు చేసుకున్నారు. వాటిలో సమాజానికి ఉపయోగపడే అంశాలు అంతగా ఉండడం లేదు. 1987 లో వచ్చిన స్వయంకృషి సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించగా, జోడిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు నటించారు.

  చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    కె. విశ్వనాథ్

నిర్మాణం     :    ఏడిద నాగేశ్వరరావు, ఏడిద రాజా 

కథ              :    కె. విశ్వనాథ్

చిత్రానువాదం    :   కె.విశ్వనాధ్

తారాగణం   :    చిరంజీవి, విజయశాంతి, సుమలత, మాస్టర్ అర్జున్, సర్వదమన్ బెనర్జీ, జె.వి.సోమయాజులు, బ్రహ్మానందం, పి.ఎల్.నారాయణ

సంగీతం    :   రమేష్ నాయుడు

సంభాషణలు   :   జంధ్యాల 

నేపథ్య గానం    :   ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ

గీతరచన      :     వేటూరి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి..

ఛాయాగ్రహణం   :  లోక్ సింగ్

కూర్పు   :   జి. జి. కృష్ణారావు

నిర్మాణ సంస్థ  :    పూర్ణోదయా మూవీ క్రియెషన్స్

విడుదల తేదీ   :    3 సెప్టెంబర్ 1987

భాష        :      తెలుగు

చిత్ర కథ (సంక్షిప్తంగా)…

సాంబయ్య అనే వ్యక్తి చెప్పులు కుట్టి తన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. శారద అనే అమ్మాయిని చదివిస్తూంటాడు. తాను ఏ రోజుకైనా శారదను పెళ్ళాడాలన్నదే సాంబయ్య అభిలాష. కానీ శారద తాను చదువుకొనే చోటే ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. దాంతో చేసేది లేక సాంబయ్య వారి పెళ్ళికి అంగీకారం తెలుపుతాడు. తన చెల్లెలు అంటే విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు ఉన్న సాంబయ్య చనిపోయిన తన చెల్లెలు కొడుకు చిన్నా ఆలనాపాలనా బాధ్యత చూసుకుంటూ ఉంటాడు. సాంబయ్య అంటే ప్రాణమిచ్చే గంగ కూడా సాంబయ్యే తన లోకమని తలుస్తుంది.

చిన్నాను గంగ కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటుంది. సాంబయ్య జీవితంలో గంగ ప్రవేశించిన తరువాత అతని దశ తిరిగిపోతుంది. ఒక్కోమెట్టు ఎక్కుతూ చెప్పుల దుకాణం నడిపే స్థాయికి చేరుకుంటాడు. బాగా ధనవంతుడవుతాడు. ఆ సమయంలో సాంబయ్య చెల్లెలు భర్త గోవింద్ జైలు నుండి వస్తాడు. తన కొడుకును తనతో పంపమంటాడు. అందుకు సాంబయ్య అంగీకరించడు. సాంబయ్య దగ్గరే తన కొడుకు ఉండాలంటే కొన్ని షరతులు ఉన్నాయని చెబుతాడు గోవింద్.

తన కొడుకు చిన్నాను తీసుకు వెళ్ళి తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తాడు. దాంతో సాంబయ్య, గోవింద్ ను నిలదీస్తాడు. అతనికి కావలసింది డబ్బే అని భావించిన, సాంబయ్య తన యావదాస్తినీ చిన్నా పేరున రాస్తాడు. చివరకు మేనమామ సాంబయ్యకు తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటాడు చిన్నా. తండ్రిని ఎదిరిస్తాడు. సాంబయ్య చివరకు తన చెప్పులుకుట్టే వృత్తిలోనే సాగాలనుకుంటాడు. సాంబయ్య చెంతనే చిన్నా కూడా వచ్చి, తానూ చెప్పులు కుట్టే పనికి పూనుకోవడంతో కథ సమాప్తమవుతుంది.

తారాగణం…

సాంబయ్య…        చిరంజీవి

గంగ…                 విజయశాంతి

శారద…              సుమలత

చిన్న….             మాస్టర్ అర్జున్

గోవింద్….         చరణ్‌రాజ్

భాస్కర….       సర్వదమన్ బెనర్జీ

జె.వి. సోమయాజులు…

బ్రహ్మానందం…

పి.ఎల్. నారాయణ…

ఎస్.కె. మిశ్రో….

గంగ తండ్రి….      ఎం. వి. ఎస్. హరనాథ రావు

చంద్రమౌళి….

స్వయంకృషి చిత్ర నిర్మాణానికి బీజం…

స్వాతిముత్యం తర్వాత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కలయికకు శ్రీకారం జరిగింది. తొలి రోజుల్లో “తాయారమ్మ బంగారాయ్య” లో ఒక చిన్న ప్రతికూల పాత్రలో నటించి, ఆ తర్వాత అలా చూస్తుండగానే మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గారితో సినిమా చేయాలన్నది “పూర్ణదయా” సంకల్పం. అలాగే చిరంజీవి గారు కూడా “పూర్ణదయా” తో కలిసి చేయాలి అంటుండేవారు. ఆ సందర్భం కలిసి వచ్చిన తరుణంలో కే.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పూర్ణోదయ బ్యానర్ లో చిరంజీవి గారు చేసే సినిమా తన సినిమాలా ఉండాలా లేక పూర్ణోదయ సినిమాలా ఉండాలా అనే కథా చర్చలో స్టార్ ఇమేజ్ కి, కళాత్మక విలువలకి మధ్య జరిగే సృజనాత్మక సంఘర్షణ నుండి పుట్టిన కథ నే “స్వయంకృషి” అనే సినిమా.

అయితే ఇలాంటి కలయికలో సినిమా చేస్తున్నప్పుడు తన స్టార్ ఇమేజ్ త్యాగం చేయడానికి చిరంజీవి గారు ఏమాత్రం వెనకాడక పోవడంతో సాంబయ్య అనే చెప్పులు కుట్టుకునే వాడి పాత్ర కల సాకారం అయ్యింది. నిజానికి “స్వయంకృషి” సమయంలో చిరంజీవి గారు ఒక ఫైర్ బ్రాండ్ లాగా స్టార్ లాగా వెలుగుతున్నారు. అలాంటి సమయంలో సాంబయ్య అనే డీ గ్లామర్ పాత్ర చేయడం చిరంజీవి గారికి సాహసమే. చేయించడం దర్శక, నిర్మాతలకు సాహసమే. అలాగే కథానాయకి విజయశాంతి కూడా అందమైన పాత్రలతో కథానాయకిగా ఉన్నత స్థానంలో ఉన్నారు. అలా టాప్ పొజిషన్ లో ఉన్న హీరో, హీరోయిన్లు ఇద్దరు ఆ పాత్రలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో “స్వయంకృషి” అనే ఒక గొప్ప ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాన్ని పూర్ణోదయ వారు అందించగలిగారు.

చిరంజీవి గారి నటన…

చిరంజీవికి గారికి ఈ సినిమా గర్వమైన సినిమాగా మారడానికి కారణం చిరంజీవి గారు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా “స్వయంకృషి”తో పైకి రావడం. తమ తల్లిదండ్రులు చేస్తున్న వృత్తి గానీ, తాము చేస్తున్న వృత్తి గురించి గానీ చెప్పుకోవడానికి నామోషీ పడే ఒక తరం యువతీ యువకులకు స్వయంకృషి సినిమా ఒక గట్టి సందేశం ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఏ పని చేయడానికి అయితే చిన్నా అసహ్యించుకున్నాడో ఆ పాలిష్ చేసే చిరంజీవి పైకి వచ్చాడు. చెప్పులు కుట్టి పైకి వచ్చాడు. చెట్టు క్రింద నుంచి పైకి వచ్చాడు.

వాళ్ళ నాలుగు మేడలు, ఎనిమిది సోఫాలు ఉండడానికే. కాకపోతే అతనికి ప్రారంభం అతనికి తెలుసు. ఆ మొదలు అంటే అతనికి గౌరవం, ఆ మొదలు అంటే అతడికి గమ్యం. పెట్టే వృత్తిని గౌరవించని వాడు నాకు అమ్మని గౌరవించని వాడితో సమానం. మరి అలాంటి ఇంట్లో పుట్టిన చిన్నాకు మాలిష్ అంటే అసహ్యం. నేను అందరితో పాటు బడికి బస్సులో వెళ్ళను, కారులో వెళ్తాను అని చిన్నా అంటే ఎలా ఉపేక్షించడం. అందుకే చిన్నా పట్ల చిరంజీవి అంత కఠినంగా వ్యవహరించాడు. కానీ అందుకు తాను పెంచిన చిన్నానే బదులు తీర్చుకోవాల్సిన అంత పెద్ద శిక్షను పొందాడు.

ఈ సినిమాకు చిరంజీవి గారు ఎంత బలమో, విజయశాంతి గారు కూడా అంతే బలం. తాను పోషించిన “గంగ” పాత్ర అద్భుతంగా రక్తి కట్టించింది. “అట్టా సూడమాకయ్యా” అనే ఆమె ఊతపదం ఈ చిత్రానికే పాపులర్. ఈ సినిమాకు మొదటిసారి కే.విశ్వనాథ్ గారు, రమేష్ నాయుడు గారు కలిసి పనిచేసిన పాటలన్నీ విజయవంతం అయ్యాయి. “పారాహుషార్”, “సిగ్గు పూబంతి”, “చిన్ని చిన్ని కోరికలడగా”, “హలో హలో డార్లింగ్” ఈ పాటలన్నీ ఆకట్టుకుని తెలుగువారి మనసులకు హత్తుకుపోయాయి. స్వయంకృషి ఇచ్చిన ప్రేరణతో చాలామంది తమ దుకాణాలకు “స్వయంకృషి” అని పేరు పెట్టుకున్నారు.

దర్శకులు విశ్వనాథ్ గారు…

కె. విశ్వనాథ్ గారు “దాదాసాహెబ్ ఫాల్కే” పురస్కారంతో పాటు ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు. “స్వాతి ముత్యం”, “శంకరాభరణం”, “సూత్రధారులు”, “స్వయం కృషి” వంటి వైవిధ్య కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాను చిరంజీవి మరియు విజయశాంతిలు ప్రధాన పాత్రలుగా చిత్రీకరించిన చిత్రం “స్వయం కృషి”. మనం ఎంతెత్తుకు ఎదిగినా మన మూలాల్ని మర్చిపోకూడదని చూపించారు స్వయం కృషితో. అప్పటి వరకు కళాత్మక చిత్రాలను తెరకెక్కించిన విశ్వనాథ్ గారు తొలిసారి సందేశాత్మక చిత్రం తీశారు. స్వయంకృషి సినిమా గురించి చెప్పాలంటే ఒక శ్రామికుడిని తలెత్తుకుని తిరిగేలా చేసింది.

ఇందులో చిరంజీవి గారు ఒక చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించిన తీరు అమోఘం మరియు అద్భుతం. తన పాత్రలో బాగా ఒదిగిపోయారు. ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఒక సామాన్యమైన చదువు కూడా రాని వ్యక్తి స్వయంకృషిని నమ్ముకుని ఏ విధంగా జీవితంలో విజయం సాధించాడు ప్రారంభం అని చాలా అద్భుతంగా తెలియచేశారు ఈ చిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి సినిమాలలో మానవీయ సంబంధాలు,  మానవతా అనుబంధాలు మరియు సమాజానికి ఉపయోగపడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో ఉద్వేగపూరిత సన్నివేశాలలో చిరంజీవి గారి నటన ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించింది.

నిర్మాత ఏడిద నాగేశ్వరావు…

“పూర్ణోదయ” పేరు వినగానే ఒక “శంకరాభరణం”, “సాగర సంగమం”,  “సీతాకోకచిలుక”, “సితార”, “స్వాతిముత్యం”, “స్వయంకృషి”, “ఆపద్బాంధవుడు” లాంటి కళాత్మక చిత్రాలు గుర్తొస్తాయి. కళాత్మక చిత్రాలను కూడా ఆర్థికంగా విజయవంతం చేయొచ్చు అని సినీరంగంలో సాహసాలు చేసి చూపించిన నిర్మాత “ఏడిద నాగేశ్వరరావు” గారు. తాను 30 ఏళ్లలో పూర్ణోదయ బ్యానర్ పై నిర్మించింది పట్టుమని పది చిత్రాలు.

కానీ విలువలతో కూడిన చిత్రాలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా గొప్పదనం చాటి అవార్డుల పంట పండించాయి.

తాను ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. కానీ తీసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా గా మారింది.

విలువల కోసం బ్రతకడం చాలా కష్టం. సాధారణంగా కష్టాలు ఎదురైతే వాటి కారణమైన వాటిని పక్కన పెట్టాలని చూస్తారు.

కానీ అలాంటి సమయంలోనే బెంబేలెత్తకుండా ధైర్యాన్ని కూడగట్టుకుంటే ప్రారంభం విజయపథంలో నడవొచ్చు.

అనే జీవిత సత్యాన్ని తన అనుభవాల ద్వారా నేర్చుకున్నారు ఏడిద నాగేశ్వరావు గారు.

విరివిగా సినిమాలు తీసే అవకాశం ఉన్న రోజుల్లో కూడా రాసి కన్నా వాసికే ప్రాధాన్యతనిచ్చి ఆపద్భాంధవుడు (1992) తర్వాత సినిమా నిర్మాణం.

అనేది భారంగా మారుతోందని, నిర్మాతలకు విలువలు ఉండట్లేదు అనే సత్యాన్ని గ్రహించి సినిమాలు తీయడం మానుకున్నారు.

విడుదల, స్పందన…

చిరంజీవి గారు 1986 లో “కొండవీటి దొంగ”, “రాక్షసుడు” వంటి వాణిజ్య విజయాలు అందుకున్నారు.

అయితే ఆ సంవత్సరమే కె విశ్వనాథ్ గారు తీసిన “స్వాతిముత్యం” సినిమా విడుదలయ్యింది.

చిరంజీవి గారు ఆ సినిమా చూశాక తనలోని నటుడిని సంతృప్తి పరచేది ఇటువంటి సినిమాలేనని అనిపించింది. “స్వాతిముత్యం” సినిమా చేయలేకపోయానని కే.విశ్వనాథ్ గారి వద్ద బాధపడ్డారు. ప్రారంభం ఫలితంగా వారి కలయికలో “పూర్ణోదయ” నిర్మాణంలో “స్వయంకృషి” మొదలైంది.

ఇది దర్శక, నిర్మాతలకు ఎంతో సాహసపూరితమైన నిర్ణయం.

1987 సెప్టెంబర్ లో స్వయంకృషి విడుదలయ్యే లోపు అదే సంవత్సరంలో జూలైలో “పసివాడి ప్రాణం” విడుదల అయ్యింది. ఆ సినిమా చిరంజీవి గారిని సుప్రీం హీరోని చేసింది.

ఎంత ఇమేజ్ ఉన్నా, హీరో మామూలు బట్టల్లో చెట్టు క్రింద కూర్చొని చెప్పులు కుట్టుకునే వారిలా కనిపిస్తే ప్రేక్షకులు తెరలు చించేయరా? సినిమాను తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రారంభం నిజానికి ఇలాంటి సంఘటనే జరిగింది.

అది కూడా 1987 లోనే మార్చి నెలలో చిరంజీవి, భారతి రాజా గార్ల కలయికలో వచ్చిన ఆరాధన సినిమా.

ఆ సినిమాలో చిరంజీవి గారు బెస్తపాలెం లో ప్రారంభం ఆకతాయిలా ఆర్ట్ ఫిలిం హీరోలా కనిపించారు. దాంతో ప్రేక్షకులు అతి దారుణంగా తిరస్కరించారు.

మరి అలాంటిది చెప్పులు కుట్టేవాడిగా చూస్తారా? కానీ చూసేశారు. కారణం ఆ కథలోని “ఆత్మ” ప్రతి మనిషికి తాను నడిచి వచ్చిన దారి గుర్తుంటుంది.

దాని పట్ల గౌరవం ఉంటుంది. కొందరు వ్యక్తులు దానిని మరచిపోయి ప్రవర్తిస్తుంటే వారికి బుద్ధి చెప్పాలని ఉంటుంది.

అలాంటి బుద్ధి చెప్పే సినిమా కాబట్టే “స్వయంకృషి” జనానికి నచ్చింది. 03 సెప్టెంబర్ 1987 నాడు విడుదల అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.

విశేషాలు…

★ స్వయం కృషి విడుదలై 36 ఏళ్లు పూర్తయ్యాయి. చిరంజీవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు .

★ విజయశాంతి మహిళా ప్రధాన పాత్రలో నటించగా, చరణ్ రాజ్ ప్రధాన విలన్‌గా నటించారు, అతను అప్పటి గొప్ప విలన్‌లలో ఒకడు.

★ స్వయంకృషి చిత్రం విడుదలైన తొలిరోజు మోస్తరు ఆదరణతో ప్రారంభమై, తరువాత ఆనోటా ఈనోటా వ్యాపించి అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

★ సాంకేతికంగా, కెమెరా వర్క్‌తో పాటు, సంగీతం పరంగా కూడా ఈ సినిమా బాగుంది. అరుదైన కథల్లో “స్వయం కృషి” కూడా ఒకటి,. ఇందులో హీరో సాంబయ్య పాత్ర ఈ సినిమాకే పెద్ద హైలైట్‌.

★ చిరంజీవి మరియు విజయశాంతిల కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర తనదైన రీతిలో నచ్చుతుంది. దీనికి కొంత సమయం పట్టింది, కానీ స్వయంకృషి ప్రజల హృదయాల్లోకి ప్రవేశించి, కల్ట్ ఫిల్మ్ హోదాను సంపాదించి అక్కడే ఉండిపోయింది.

★ ఈ సినిమాకు రమేష్ నాయుడు గారు తొలిసారిగా కె. విశ్వనాథ్ గారికి సంగీతం సమకూర్చగా, తమ గానంతో ఎస్ పి బాలసుబ్రమణ్యం, జానకి మరియు శైలజ లు పాటలకు ప్రాణం పోశారు.

★ స్వయంకృషి చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా , ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది..

★ స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి డబ్ చేయబడింది మరియు మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రస్తావన విభాగంలో ప్రదర్శించబడింది.

★ చిరంజీవి గారు తన నటనకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో పాటు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా గెలుచుకున్నారు.

★ స్వయంకృషి చిత్రంలో తన నటనకు విజయశాంతి గారు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

Show More
Back to top button