CINEMATelugu Cinema

‘తంగలాన్’ మూవీ రివ్యూ..

అపరిచితుడు’, ‘ఐ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విక్రమ్.. డైరెక్ట‌ర్ పా రంజిత్ క‌ల‌యిక‌లో తీసిన తంగ‌లాన్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. 

విక్రమ్, పార్వతి తిరువొతు దంపతులు తమకు ఉన్న కొద్దిపాటి భూమిని వ్యవసాయంగా సాగు చేసుకుంటూ పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే పంట చేతికి వచ్చిన సమయంలో ఎవరో ఆ పంటను తగలబెడతారు. దీంతో పన్నులు కట్టలేదని ఊరి జమీందారు పంట పొలం స్వాధీనం చేసుకుని, కుటుంబం అంతటినీ వెట్టి చాకిరీ చేయాలని ఆదేశిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో క్లెమెంట్ దొర వస్తాడు.

బంగారు గనులు తవ్వడానికి తనతో వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెబుతాడు. విక్రమ్’కు తరచూ కల వస్తుంది. అందులో అతని తాతను ఆరతి (మాళవికా మోహనన్) వెంటాడుతూ ఉంటుంది. ఆమె ఎవరు? బ్రిటీషర్లతో కలిసి బంగారం తవ్వడానికి వెళ్లిన తంగలాన్, అతని సమూహానికి ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అరణ్య (విక్రమ్) ఎవరు? అనేదే సినిమా.. 

తంగలాన్‌గా విక్రమ్ తప్ప ఎవరూ ఊహించలేం! ఈ పాత్రలో విక్రమ్ అదరగొట్టేశాడు. టెక్నికల్‌గా చూసుకుంటే ‘తంగలాన్’ బ్రిలియంట్ మూవీ. ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్స్ ప్రాణం పెట్టేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ తన సంగీతంతో సినిమాని బాగానే ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే కొన్ని కేటగిరి ప్రజలకు ఈ మూవీ నచ్చకపోవచ్చు.

డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ‘తంగలాన్’ మంచి ఆప్షన్. కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆకట్టకుంటాయి. VFX కూడా కూడా చాలా బాగుటుంది. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే కష్టం కనిపించింది. కానీ చాలా సాగదీత అయిపోయింది.

ప్లస్ పాయింట్స్ : ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ,  విక్ర‌మ్ యాక్టింగ్‌, ఫస్టాఫ్ గూస్‌బంప్స్, స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ : కొన్ని సీన్లు బోర్ అనిపించడం.

Show More
Back to top button