CINEMATelugu Cinema

డబుల్ ఇస్మార్ట్ రివ్యూ.. ఎలా ఉందటే..

ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి సినిమా తర్వాత రామ్‌ పోతినేని, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. 

ఎలా ఉందంటే..

సంజ‌య్‌ద‌త్‌ విదేశాల్లో విలాసాల‌తో జీవిస్తూ చీక‌టి సామ్రాజ్యాన్ని న‌డుపుతుంటాడు. భార‌త‌దేశాన్ని ముక్క‌లు చేయాల‌నేది అత‌ని క‌ల. అత‌ని కోసం ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘రా’ వేట కొన‌సాగుతూ ఉంటుంది. ఇంత‌లో సంజ‌య్‌ద‌త్‌ మెద‌డులో క‌ణితి ఉంద‌ని, దాని ప్ర‌భావంతో కొన్ని నెల‌లు మాత్ర‌మే బ‌తికే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతారు. మ‌రో వందేళ్ల ప్ర‌ణాళిక‌ల‌తో బ‌తుకుతున్న సంజ‌య్‌ద‌త్‌ తాను చ‌నిపోకూడ‌ద‌ని, ఎలాగైనా బ‌త‌కాల‌నుకుంటాడు. అందుకు మార్గాల్ని అన్వేషించినప్పుడు మెద‌డులో చిప్ పెట్టుకుని హైద‌రాబాద్‌లో జీవిస్తున్న ఒకే ఒక్క‌డు ఇస్మార్ట్ శంక‌ర్ (రామ్‌) పేరు తెర‌పైకొస్తుంది. సంజ‌య్‌ద‌త్‌  మెమొరీస్ అన్నీ కాపీ చేసి, ఇస్మార్ట్ శంక‌ర్ మెద‌డులోని చిప్‌లో పేస్ట్ చేస్తారు.

అయితే తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. ఇక సినిమా ఎలా ఉందంటే.. జియాని గియాన్నెలి, శ్యామ్‌ కె.నాయుడు కెమెరా పని తీరు గ్రాండియర్‌గా ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. జునైద్‌ ఎడిటింగ్‌ మైనస్‌. నిర్మాతలుగా పూరి, ఛార్మి ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమాకు కావలసిన అన్ని గ్రాండ్‌గా అరేంజ్‌ చేశారు.

మణిశర్మ సంగీతం అందించిన పాటల్లో ‘స్టెప్పామార్‌’, ‘మార్‌ ముంతా చోడ్‌ చింతా’ పాటలు వినడానికి, చూడటానికి  కూడా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫస్ట్‌ ఆఫ్‌లో ఉన్నంత హైలో లేదు. నేపథ్య సంగీతంలో తన మార్క్‌ చూపించినా, ఆయన మ్యాజిక్‌ మిస్‌ అయిందనిపించింది. ఏది ఏమైనా భారీ అంచనాలు పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే.. కాస్త ఎంటర్‌టైన్‌ కావచ్చు. లేదంటే నిరాశే!

ప్లస్ పాయింట్స్: రామ్ ఇస్మార్ట్ న‌ట‌న

మైనస్ పాయింట్స్: ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌నం, సాగ‌దీత‌గా స‌న్నివేశాలు

Show More
Back to top button