CINEMATelugu Cinema

టాలీవుడ్‌కు ఏమైంది…! వేణుస్వామి చెప్పింది నిజమైందా..?

తరచుగా సినీ, రాజకీయ సెలబ్రిటీల జాతకాల పై కామెంట్స్ చేసే వేణుస్వామి 2024-25లో టాలీవుడ్ పరిశ్రమ ఎప్పుడూ లేని విధంగా సంక్షోభంలో పడుతుందని గతంలో వ్యాఖ్యలు చేశారు. దానిలో భాగంగానే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో జరిగిన ఘటనలతో టాలీవుడ్ నటులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కొందరు సినీ ప్రియులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కాగా ఈ ఏడాది టాలీవుడ్ నటుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వారిలో మొదటి వ్యక్తి లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్. ఓ మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ జానీ మాస్టర్‌పై కేసు పెట్టడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో కొంతకాలం విచారణ నిమిత్తం జైల్లో ఉండి కండీషనల్ బెయిల్‌తో బయటకు వచ్చారు.

ఇకపోతే ఎన్ కన్వెన్షన్ అంశం, సమంత-చైతూ విడాకుల విషయంలో నాగ్ ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలన వార్తగా నిలిచాయి. అయితే, ఈ వార్తల హీట్ చల్లారగానే మరో టాలీవుడ్ నటనా కుటుంబమైన మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు. ఈ గొడవల్లో మీడియాకు సంబంధించిన ఓ వ్యక్తిపై దాడిచేడంతో.. ఆ గొడవలు మరింత ముదిరాయి. దీంతో మంచు వారి ఫ్యామిలీ గౌరవం.. మంచులా కరిగిందంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్. 

ఇది ఇలా ఉండగా తాజాగా మరో అంశంతో సినీ ఇండస్ట్రీపై.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఒక్కసారిగా షాక్ అయ్యేడట్టు ఓ వార్త వచ్చింది. అదే అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప 2 ప్రీమియ‌ర్ రోజు సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఓ అభిమాని మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ 14న అల్ల అర్జున్‌ను పోలీసులు అర్టుస్ట్ చేశారు. ఇలా వరుస ఘటనలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపరుస్తున్నాయి. దీంతో ఎంతోమంది జీవితాలను వారి సినిమాలతో మార్చే సినిమా వారు ఇలా ఏదోరకంగా జైలుపాలు కావడం సినీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తుంది.

Show More
Back to top button