CINEMATelugu Featured News

పీడిత ప్రజల ఒక కొత్త వెలుగు ‘పవర్‌ స్టార్‌

వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని, పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, ప్రతి వ్యక్తి తన అనుభవాల నుంచి తనకు నచ్చిన జీవన విధానం నిర్ణయించుకోవాలన్న మహాత్మా జ్యోతిబాఫూలే బాటను పవన్‌ కల్యాన్‌ నిజ జీవితంలోనూ.. సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ అనుసరించారు. అందుకే నలుగురు నడిచిన దారిలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అదే పవన్‌ను రాజకీయాల్లోనూ ‘పవర్‌’ స్టార్‌ చేసింది. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఆ పేరు వింటే ఒక వైబ్రేషన్‌. అది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా.. సినిమాల్లోకి రాకముందు చిరంజీవి తమ్మడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొణిదల కల్యాణ్‌ ఆ తర్వాత తన పవర్‌ ఏమిటో చూపి పవన్‌ కల్యాణ్‌గా మారారు. ఆ అభిమానం ఎక్కడి దాకా వెళ్లిందంటే.. సినిమా ఫంక్షన్లలో చిరంజీవి ఫ్యామిలీ ఈవెంట్లలోనే కాదు వేరే హీరోల ఫంక్షన్లలనూ ఆయన పేరు రాగానే పెద్ద ఉరుము ఉరిమినట్టు ఉంటుంది అభిమానుల నుంచి వచ్చే అరుపులు. 

అత్తారింటికి దారేది మూవీ డైలాగ్‌ మాదిరి సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవన్‌. అందుకే సమయం వచ్చినప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించినా కొన్నిసార్లు సంయమనం కూడా పాటించారు. పవన్‌ కల్యాణ్‌ అనేవ్యక్తి పూనుకోకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించేది కాదు అంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఏకైక అజెండాతో కూటమి ఏర్పాటులో అంతా తానై కీలకంగా వ్యవహరించారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి తన పార్టీనే అధికారంలోకి రావాలని లేదా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుని కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించాలని అనుకుంటారు. కానీ తన రాజకీయ భవిష్యత్తు కంటే ఏపీ ప్రజల భవితే ముఖ్యమనుకుని త్యాగానికి ముందు తానే సిద్ధపడ్డారు 21 సీట్లలోనే తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. దీనిపై సొంతపార్టీ నేతల నుంచి, అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. అప్పటి అధికారపార్టీ నేతల విమర్శల సంగతి తెలిసిందే. ఈ మాత్రం దానికి పోటీ చేయడం ఎందుకు అని ట్రోల్స్‌ చేశారు. సెటైర్లు వేశారు. అయినా పట్టించుకోలేదు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లలోనూ తన పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు ఓడిపోలేదు. పవన్‌ స్టామినా అంటే ఏమిటి అన్నది ఫలితాల తర్వాతే తెలిసింది. 

2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోయారు. రాజకీయాలకు స్వస్తి పలికి సినిమాలు చేస్తే కూర్చున్న చోటే కోట్ల రూపాయల సంపాదన వచ్చే అవకాశం ఉన్నది. ఆయన కాలీషీట్స్‌ కోసం క్యూ కట్టేవారు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమాకు సైన్‌ చేస్తే కలెక్షన్ల సునామీ నిర్మాతల పంట పండిస్తుంది. తన ఆర్థిక అవసరాల కోసం కొన్ని సినిమాలు అంగీకరించారు. అయితే సినిమాలు తన వృత్తి అంటూనే.. తన లక్ష్య సాధనపైనే దృష్టి సారించారు. ఓటమి నేర్పిన పాఠాల నుంచే గెలుపునకు బాటలు వేశారు… కొద్ది రోజుల్లోనే దాని నుంచి తేరుకుని మళ్లీ పోరాటం ప్రారంభించారు. కామన్‌ మ్యాన్‌ ఆలోచనలకు తగ్గట్లుగా నడుచుకుంటానన్న జనసేనాని జనం నాడి పట్టుకోవడంవలో సక్సెస్‌ అయ్యారు. పిఠాపురంలో పార్టీలకు అతీతంగా పవన్‌ గెలుపును కోరుకున్నారు అంటే ఆయన కమిట్‌మెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గెలుపు.. ఏపీకి ప్రగతికి మలుపు అన్నది ఇటీవల బడ్జెట్‌ సందర్భంగా రాజధాని అభివృద్ధికి కేంద్రం రూ. 15000 కోట్లు ప్రకటించింది. దీనివెనుక బీజేపీ కూటమి ధర్మం పాటించినా ప్రధాని అన్నట్లు పవన్‌ అంటే సునామీ. కూటమి ఏర్పాటులో కర్త, కర్మ, క్రియా అంతా తానై నడిపించిన ఆయన విజ్ఞప్తినే నరేంద్రమోడీకి పరిగణనలోకి తీసుకున్నారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులు కేటాయించారు. 

రాజకీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా వవన్‌ ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. భవిష్యత్తు ముఖచిత్రాన్ని ముందే అంచనా వేసిన పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లారు. ఒకవైపు పార్టీ క్రియాశీల సభ్యత్వం పెంచుకోవడం, పార్టీ శిక్షణ కార్యక్రమాలు, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేశారు. దీంతో ప్రజల నుంచి పవన్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.  ఆయన అభిమానులు, యువతీయువకులు అండగా నిలిచారు.  ప్రభుత్వాన్నిమార్చాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అప్పడే డిసైడ్‌ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లోనే ఇప్పటం సభలో పవన్‌ కీలక ప్రకటన చేశారు. దానికి కొనసాగింపుగానే చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయనను పరామర్శించి అక్కడే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

రాజకీయాల్లో టైమింగ్‌ అన్నది ఎంత ముఖ్యమో పవన్‌ ఆ ప్రకటన ద్వారా  చూపెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ  చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజాగ్రహాన్ని చూసిన పవన్‌ ప్రజలు ఏం కోరుకుంటున్నారో పక్కాగా అంచనా వేశారు. జన నాడి పట్టుకున్న జనసేనాని నిర్ణయం ఫలితాల నాడు అందరికీ కనిపించింది.

గెలిచిన తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో  పవన్‌కు డిప్యూటీ సీఎంగా సముచిత స్థానం కల్పించారు. తనను నిలబెట్టిన ఆయనకు గౌరవించుకున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయితో అరంగేట్రం చేసిన తనను డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకొచ్చిన జనాలను తిరిగి ఏదైనా చేయాలన్న సంకల్పం జనసేనానిలో నిత్యం ఉంటుంది. అందుకే తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకుని  తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని తర్వాత ప్రజాసేవకే తన ప్రథమ ప్రాధాన్యం అన్నట్లు నిత్యం ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారి విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ఆయన పనితీరుకు ముగ్ధులైన ప్రధాని మోడీ పవన్‌ అంటే సునామీ అన్నారు.  

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం అనేది మాస్టర్ కీ అన్న డాక్టర్‌ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలను పవన్‌ రాజకీయ జీవితంలో అనుసరించి విజయవంతమయ్యి ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు

Show More
Back to top button