Telugu News

అప్పుల్లో కూరుకుపోయారా? ఇలా బయటపడండి

అత్యవసర పరిస్థితుల్లో తప్పక అప్పు చేయాల్సి వస్తుంది. పెళ్లి, వ్యాపారం, ఇంటి కొనుగోలు, వాహన కొనుగోలు, ఆస్పత్రి ఖర్చులు వంటి అవసరాలు అప్పు చేయడానికి కారణమవుతాయి. అయితే ఇలా అప్పు తీసుకున్నవారిలో కొందరు సకాలంలో వడ్డీ చెల్లించలేకపోతారు. దీంతో అప్పుల కుప్ప పెరిగిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్ది ఈ కుప్ప మరికాస్త పెరుగుతుంది. ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తుంటారు. ఇలా అప్పుల ఊబిలో కూరకుపోయి, దాని గురించే ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవారు ఎందరో. ఉన్నారు. అయితే అప్పులు పెరిగిపోయినప్పుడు ఏవిధంగా వాటి నుంచి బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిస్థితిని విశ్లేషించండి

అప్పు ఎలా తీర్చాలి? అనే భయమే అసలు సమస్య. అలా భయపడితే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పు తీర్చడం పెద్ద కష్టమేమి కాదు. మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకొని, మీ ఖర్చులను తగ్గించుకొని వడ్డీ చెల్లిస్తే అప్పు భారం తగ్గుతుంది. అప్పు తీర్చడానికి ఏయే మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తే.. మీ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాటితో మీ రుణభారాన్ని తగ్గించుకోవచ్చు.

అప్పు తీర్చడానికి రుణం అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం మూర్ఖత్వమే. కానీ, సరైన ప్రణాళిక ఉంటే మీ అప్పును రుణం ద్వారా కూడా తీర్చేయవచ్చు. అవును! మీరు ఒకరి దగ్గర ఎక్కువ వడ్డీతో రుణం తీసుకుంటే.. దాన్ని తీర్చడానికి బ్యాంకులో వ్యక్తిగత రుణాన్ని పొందండి. దాంతో అప్పు తీర్చేయండి. బ్యాంకులో తీసుకున్న రుణానికి కాలపరిమితి ఎక్కువగా నిర్ణయించుకుంటే.. మీరు చెల్లించాల్సిన EMI తగ్గుతుంది. 

రుణం తీర్చడమే ముఖ్యం

మీరు ఒకరికి అప్పు ఉన్నారంటే.. ఆ రుణం చెల్లించడమే మీ ప్రథను ఆర్ధిక బాధ్యత అవుతుంది. కాబట్టి అప్పు తీర్చడానికి మీ జీవన వ్యయాన్ని తగ్గించుకోవాలి. కావాలంటే మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను అమ్మి అప్పు తీర్చండి. రుణం చెల్లించడం ఆలస్యం చేస్తే.. మీపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది.

సరైన పద్ధతిలో 

కొందరు ఒకటికి మించి అప్పులు చేస్తుంటారు. అలాంటివారు ముందుగా ఏదైనా ఒక రుణాన్ని పూర్తిగా చెల్లించండి. ఇలా చేస్తే సగం ఆర్థిక భారం తగ్గిపోతుంది. అధిక వడ్డీ ఉన్న రుణాన్ని ముందుగా చెల్లిస్తే.. మీపై వడ్డీ భారం తగ్గుతుంది. 

వేగవంతమైన చెల్లింపులు

మీ దగ్గర డబ్బు మిగిలే దానితో వడ్డీ చెల్లించండి. బోనస్ రూపంలో వచ్చిన డబ్బునూ రుణాలకే కేటాయించండి. ఇలా చేస్తూ పోతే వడ్డీ భారం తగ్గుతుంది. మీరిలా వేగవంతమైన చెల్లింపులు చేయడం ద్వారా అప్పుల భారం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 

కారణం తెలిస్తే.. మళ్లీ ఆ తప్పు చేయరు

అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందోనని కారణం తెలుసుకుంటే.. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Show More
Back to top button