HEALTH & LIFESTYLE

లేత కొబ్బరి నీళ్లు VS ముదురు కొబ్బరి నీళ్లు

శరీరం లవణాలను కోల్పోయినప్పుడు తక్షణ శక్తి కోసం కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి బొండంలో పొటాషియం, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. కొబ్బరి నీళ్లల్లో కాల్షియం ఎముకల్ని బలంగా చేస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే ఇందులోని ఎలక్ట్రోలైట్స్ శరీరానికి అందుతాయి. కొబ్బరి నీళ్లు మిమ్మల్ని హైడ్రేడ్‌గా ఉంచడానికి సహాయ పడతాయని న్యూట్రీషియన్స్ అంటున్నారు. కొబ్బరి నీళ్లు రక్తంలో షుగర్ లెవల్స్‌ని క్రమబద్ధీకరిస్తాయి.

ఒక అధ్యాయనం ప్రకారం కొబ్బరి నీళ్లల్లో అమైనో యాసిడ్స్ ఉంటాయని తేలింది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి కిడ్నీలో రాళ్లను నివారిస్తాయి. షుగర్ బాధితులు లేత కొబ్బరి బొండం కాకుండా ముదిరిన కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం. ఎందుకంటే లేత కొబ్బరి బోండం నీళ్లల్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి కొబ్బరి నీళ్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

గుండె జబ్బులు రాకుండా కొబ్బరి నీళ్లలో ఉన్న పోషకాలు కాపాడుతాయి. శరీరంలో ప్రోటీన్ పెరుగుదలకు దోహదపడే సైటోకిన్స్ కొబ్బరి నీళ్ల ద్వారా అందుతాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధిక మొత్తంలో ఉండటంతో మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. 

250 మిల్లీ లీటర్ల కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు

కాలరీస్ – 96 

కార్బోహైడ్రేట్స్ – 21.76 గ్రాములు

సోడియం – 254 మిల్లీ గ్రాములు

ప్రోటీన్ – 1.73గ్రాములు

పొటాషియం – 601 మిల్లీ గ్రాములు

కాల్షియం – 58 మిల్లీ గ్రాములు

మిటమిన్-C – 5.8 మిల్లీ గ్రాములు

షుగర్ – 19.12 గ్రాములు

డైటరీ ఫైబరీ – 2.5 గ్రాములు

Show More
Back to top button