Telugu News

డీమార్ట్ సక్సెస్ మంత్ర..మిడిల్ క్లాస్..!

ఒకప్పుడు సూపర్ మార్కెట్ డబ్బున్నవాళ్ళు మాత్రమే వెళ్ళేదిగా ఉండేది. కానీ ఈ సూపర్ మార్కెట్ బిజినెస్ లోకి రిలయన్స్, బిగ్ బజార్ లాంటివి మొదలై.. సూపర్ మార్కెట్ ని మిడిల్ క్లాస్ వాళ్లు సైతం ఎఫర్ట్ చేసేలా డిజైన్ చేసుకొని మార్కెట్ లోకి వచ్చాయి. అలానే బాగా హిట్ అండ్ క్లిక్ కూడా అయ్యాయి. అలాంటి కోవలోకి చెందినదే డీమార్ట్… మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి డీమార్ట్ ఇప్పుడు అందరీ ఫెవరేట్ గా మారిపోయింది. కారణం అసలు ధర మీద ఆఫర్ ధర ఉండటమే.

ఇతర షాపుల్లో అయితే మనకు కావాల్సిన వస్తువు దొరక్కపోతే ఎలా అనే బాధే లేకుండా ఆల్ ఇన్ వన్ కేరాఫ్ గా డీమార్ట్ మారిపోయింది.. ఒకే చోట కావాల్సినవి, తక్కువ ధరల్లో వస్తుంటే.. ఎవ్వరూ మాత్రం కొనకుండా ఉంటారు.. నిజానికి ఇదే డీమార్ట్ సక్సెస్ కి మూల కారణం. అసలు డీమార్ట్ అంత తక్కువకి వస్తువుల్ని అమ్మి, ఫ్రాఫిట్ ను ఎలా పొందుతుంది.. 400 బ్రాంచ్ లకి పైగా విస్తరించిన డీమార్ట్ పెద్ద పెద్ద కంపెనీలకి ఏ మాత్రం తీసిపోకుండా.. మార్కెట్ లో నిలబడి ఎలా తన సత్తా చాటుకుంటోందనే విషయాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

నేపథ్యం

1954 మార్చి 15న, ఓ మార్వాడీ కుటుంబంలో రాజస్థాన్‌లోని బికనీర్‌లో పుట్టి, పెరిగారు రాధా కిషన్ దమాని.. ఈయన పుట్టుకతో ధనవంతుడు కాదు. ఆయన తండ్రి ముంబైలోని దలాల్ స్ట్రీట్ లో పనిచేసేవాడు. రాధాకిషన్ ముంబై యూనివర్సిటీలో కామర్స్ చదివేందుకు అక్కడ చేరాడు. కానీ చదువు మధ్యలోనే మానేసి, తండ్రి మొదలుపెట్టిన మెటల్ రోలర్స్ వ్యాపారంలో చేరాడు. కొన్నాళ్లకు తండ్రి ఆకస్మికంగా చనిపోవడంతో బిజినెస్ తో పాటు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ తో.. స్టాక్ బ్రోకర్ గా కెరీర్ మొదలు పెట్టాడు.1980లో ‘మిస్టర్ వైట్ అండ్ వైట్’ అనే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాడు. అది మొదలు సెంచరీ టెక్స్‌టైల్స్, ఇండియన్ సిమెంట్, విఎస్ టీ ఇండస్ట్రీస్, టీవీటుడే నెట్‌వర్క్, బ్లూడార్ట్, సుందరం ఫైనాన్స్, 3ఎం ఇండియాలతో పాటు జిల్లెట్, కోల్‌గేట్, నెస్ట్లె లాంటి మరెన్నో ప్రముఖ ఎంఎన్ సీ బిజినెస్ స్టాక్స్ లలో పెట్టుబడులు పెట్టాడు. 

ఈ పెట్టుబడి మార్గాలే ఆయన సంపదను డబుల్ చేశాయి.

అసలు డీమార్ట్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే..

1999లో దమానీ ‘అప్నా బజార్’ అనే ఒక కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ స్టోర్ ఫ్రాంచైజీని తీసుకోవాలనుకున్నాడు. దాని బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్న తర్వాత అందులోని లొసుగులు, లాభ నష్టాలను అంచనా వేసుకొని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కానీ స్టోర్ పెట్టాలనే తన ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. 

2001లో ఉన్నట్టుండి స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని విడిచిపెట్టి, రిటైల్ పరిశ్రమలోకి అడుగుమోపారు రాధాకిషన్. తరువాత 2002లో ముంబైలోని పోవైలో డీమార్ట్ అనే పేరుతో స్టోర్ మొదలు పెట్టాడు. మహారాష్ట్రలో కేవలం రెండు స్టోర్ లతో మొదలైంది ఆయన వ్యాపార ప్రయాణం.. అక్కడినుంచి ఎక్స్పాండ్ అవుతూ ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో మొత్తం 220 డీమార్ట్  స్టోర్స్, 225 డీమార్ట్ రెడీ స్టోర్స్ గా విస్తరించాయి. 

కేవలం ఈ 450 బ్రాంచెసే కదా ఇందులో ఏముంది అని అనిపించొచ్చు. కానీ ఈ 450 బ్రాంచెస్ జనరేట్ చేసే రెవెన్యూ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫైనాన్షియల్ అనాలసిస్ ప్రకారం, 2014-15 స్టాక్స్ ఒకసారి గమనిస్తే, ఆ టైంలో డీమార్ట్ రూ. 211 కోట్ల రెవెన్యూని జనరేట్ చేసింది. అప్పుడు మార్కెట్ లో బిగ్ బ్రాండ్స్ అయిన రిలయన్స్ రూ. 159 కోట్ల రెవెన్యూని జనరేట్ చేసింది. 2020కి వస్తే డీమార్ట్ రెవెన్యూ రూ. 1349 కోట్లుగా రికార్డ్ అయ్యింది. ఒక్కసారి ఆలోచించండి.. 8 సంవత్సరాలలో 450 బ్రాంచెస్ తో రూ. 211 కోట్ల దగ్గర నుంచి ప్రస్తుతం రోజుకి రూ. 1.6కోట్ల ఇన్ కమ్ కి రీచ్ అవ్వడమంటే మాటలా… ఇలా చేరుకోవడానికి ఏ స్థాయిలో బిజినెస్ వ్యూహాలను రచించి ఉంటారో.. ఎంతలా మానిటర్ చేసి ఉంటారో ఊహించండి..  2010నాటికి డీమార్ట్ 25 స్టోర్లతో హైపర్ మార్కెట్స్ చైన్ జాబితాలో చేరింది. 2017లో ఐపీవోకి వెళ్లింది. 2020లో డీమార్ట్ పెట్టిన తర్వాతే 16.5 బిలియన్ల మార్క్ కు చేరుకుంది. 

బిజినెస్ స్ట్రాటజీ..

డిమార్ట్.. అంటే ఏ ప్రొడక్ట్ అయిన తక్కువ రేట్ కి ఇవ్వడం. అది దీని పాలసీ. డీమార్ట్ లో కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టే మనం చాలా ఎక్స్ పెక్ట్ చేస్తాం. అందుకు తగ్గట్టే ఐటమ్స్.. ఉంటాయి. అందుకే ఈ స్టోర్ ను ఎక్కువసార్లు విజిట్ చేస్తాం.. అవసరం ఉన్నా లేకపోయినా.. ఏదోటి కొంటున్నాం..

నిజానికి చిన్నాచితకా హోల్ సేల్ షాపులతో పోల్చి చూస్తే అసలు ధరకు ఏ వస్తువును అమ్మినా ఫ్రాఫిట్స్ రావడం కష్టం. అలాంటిది తక్కువ రేట్ కి అమ్మి.. ఇంత ఎక్కువ ప్రాఫిట్స్ పొందడంలోనే మ్యాజిక్ దాగి ఉంది.

1990ల్లో ఇంకా డీమార్ట్ స్టార్ట్ చెయ్యకముందు రాధా కృష్ణ, తన తోటి ఇన్వెస్టర్స్ కలిసి వాల్ మార్ట్ స్టోర్స్ లలో తెగ తిరిగేవారట. అసలుకైతే వెళ్లేది షాపింగ్ కోసం కాదు. వాల్మార్ట్ లో వచ్చిన కస్టమర్లు ఏ ప్రొడక్ట్ ని ఎక్కువగా కొంటున్నారు. వేటి కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. ఇలా కస్టమర్ కోరుకునే వస్తువులు ఏంటి అనే దాన్ని బాగా పరిశీలించి, వాటిల్లో కొన్ని తన బిజినెస్ కు ఆపాదించాడు దమాని. వాల్మార్ట్  ఓనర్ శ్యామ్ ఒల్టాన్ సెట్ చేసిన రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ని కచ్చితంగా తను పెట్టబోయే డీమార్ట్ లో అప్లై చెయ్యాలని అనుకున్నాడు.

అందుకే డీమార్ట్ లో కేవలం ఒక్క కేటగిరి వస్తువులకే పరిమితం అవ్వకుండా క్లాత్స్, ఫుడ్స్, కిచెన్ అండ్ హౌస్ హోల్డ్స్ ఐటమ్స్ మీద అపరిమితమైన స్టాక్ ఉండేలా చూసుకున్నారు. దీంతో ఆ ఫలానా వస్తువు మీద ఏడాది మొత్తంమ్మీద డిమాండ్ ఉంటుంది. కాబట్టి కచ్చితంగా సేల్ అవుతాయి. డిస్కౌంట్ ఆఫర్ మీద వస్తువుల్ని కస్టమర్లకి ఇస్తారు. దీనివల్ల వీక్లీ, మంత్లీ రెగ్యులర్ గా విజిట్ చేయగల కస్టమర్ టు స్టోర్ కి మధ్య మంచి బాండ్ ఏర్పడుతుంది. రానురాను కస్టమర్లు పెరుగుతారు. సో ప్రాఫిట్ అనేది దానంతటా అదే పెరుగుతుంది.

జాగ్రత్తగా గమనిస్తే 

ఈ డీమార్ట్ స్టోర్స్ అన్నిటినీ మెట్రో స్టేషన్స్ కి దగ్గరలో ఉండేలా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే, ల్యాండ్ కాస్ట్ కొంచం మోడరేట్ గా ఉంటుంది. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ ప్లేస్ లలోనైనా ఉంటారు కాబట్టి వాళ్లను అట్రాక్ట్ చేయడం కోసమే ఈ పర్టిక్యులర్ స్పాట్ లలో డీ మార్ట్స్ ఉంటాయి. అంతేకాదు 5 మీటర్ల రేడియస్ తేడాతో ఇంకో డీమార్ట్ పెట్టిన ప్లాన్ కూడా బాగా కలిసి వచ్చింది. ఒకవేళ ఇక్కడ తీసుకోవాలి అనుకున్న డీమార్ట్ లో రష్ ఎక్కువగా ఉంటే, మరో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో డీమార్ట్ కి వెళ్తారు. 

చాలా మార్ట్స్ డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువుల స్టాక్ అయిపోగానే ‘ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ లను పెడుతుంటారు. కానీ.. డీమార్ట్ లో ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. ఎంత డిమాండ్ ఉన్న వస్తువులైనా ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. అందుకే డీమార్ట్ లకు వెళ్లే కస్టమర్స్ నిరాశతో తిరిగివెళ్లే పరిస్థితి ఎదురుకాదు. 

చాలా స్టోర్లలో వస్తువులను డిస్ ప్లే చేయడానికి ఎక్కువ ప్లేస్ ను కేటాయిస్తారు. కానీ డీమార్ట్ లో మాత్రం తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులు ఆకర్షణీయంగా కనపడేలా పెడతారు. ఎందుకంటే కస్టమర్ అవసరమనుకున్న వస్తువు ఎక్కడున్నా గుర్తుపడతాడు కాబట్టి. 

ప్రతి మధ్య తరగతి కుటుంబానికి షాపింగ్ స్పాట్ ఏది అంటే డీమార్ట్ అనేంతలా మారిపోయింది. వారాంతాల్లో సరదాగా షాపింగ్ చేసినట్లు.. ఇంట్లోకి ఏం కావాలో.. దొరికే ఏకైక ఫ్లాట్ ఫాంగా అందరూ మెచ్చే స్టోర్ గా మారింది.. మిగతా మార్ట్స్ తో పోలిస్తే.. చాలావరకు సరుకులు, హౌజ్ హోల్డ్స్ ఐటమ్స్, క్లాత్స్, ఇలా డీమార్ట్ లో తక్కువ ధరకే దొరుకుతాయి. అందుకే ఆదివారం వచ్చిందంటే.. ఈ మార్ట్ ల ముందు జనాలు క్యూ కడతారు. కొన్ని స్టోర్లలో అయితే బిల్లింగ్ కౌంటర్ల దగ్గర జనాలు ‘క్యూ’ కట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. తక్కువ ధరకు సరకులు అమ్ముతుంటే లాభాలు ఎలా? అదే అసలు రహస్యం.

డీమార్ట్ వస్థాపకుడు రాధాకిషన్ దమాని మాస్టర్ మైండ్ తో ఈ బిజినెస్ మోడల్ ను తయారుచేశాడు. ఇందులో జనాలతోపాటు స్టోర్ యజమానికి కూడా లాభమే. వ్యాపారాన్ని నిలబెట్టడానికి రాధాకిషన్ ఎన్నో కొత్త పద్ధతులు తీసుకొచ్చాడు. కస్టమర్ ని సాటిసిఫై చేయడమే ధ్యేయంగా, నిబద్ధతతో వ్యాపారాన్ని నడిపించాడు. రిటైల్ పరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ను తక్కువ ధరలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే డీమార్ట్ ఇండియాలోని అతిపెద్ద హైపర్ మార్కెట్ లలో ఒకటిగా ఎదిగింది. 

Show More
Back to top button