Telugu News

టైటానిక్ షిఫ్ నిజంగామునిగిపోయిందా ? అసలు కారణాలేంటి.

అత్యంత విలాసవంతమైన భారీ నౌక అది. ఎంతో మందిని తమతమ గమ్యస్థానాలకు చేర్చేందుకు బయలుదేరింది. పడవలో… విందులు, వినోదాలతో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సరైన సమాచారం.. సరైన చోటుకి పంపినప్పటికీ.. అది చేరాల్సిన చోటుకి చేరుకోలేదు. అంతే ఒక్కసారిగా పడవలో అల్లకల్లోలం రేగింది. సముద్రంలో మునిగిపోయింది. ఎంతోమంది ప్రాణాలను మూటగట్టుకుని వెళ్లిపోయింది. అదే.. పేరుగాంచిన టైటానిక్ పడవ ప్రమాదం.. టైటానిక్ పడవ తన మొదటి ప్రయాణంలోనే విషాదం చోటుచేసుకుంది. 

మనిషి చేసిన అద్భుతాలలో టైటానిక్ ఒకటి. టైటానిక్ కి ది ఆన్ సింకబుల్ అనే ట్యాగ్ ఉంది కూడా. అంటే టైటానిక్ ఎన్నటికీ మునిగిపోదు అని. అలాంటి టైటానిక్ మొదటి రోజే ప్రమాదవశాత్తు మునిగిపోవడం విషాదకరం. ఈ ప్రమాదం చాలామందికి చాలా అనుమానాలను తలెత్తేలా చేసింది. కొంతమంది అయితే టైటానిక్ మునగలేదు, దాని బదులు వేరే షిప్ మునిగిందని, మరికొందరు ఈ టైటానిక్ విషయంలో ఏదో కుట్ర జరిగిందని రకరకాల అనుమానాలు లేవనెత్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఒక చిత్రం కూడా వచ్చింది. అసలుకైతే ఈ పడవ మునిగిపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

అది 1912 ఏప్రిల్‌ 15.. 2వేలకు పైగా ప్రయాణికులతో వెళ్తున్న టైటానిక్‌ షిప్‌ ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. ఓ భారీ మంచుగడ్డను ఢీ కొట్టింది. రెండుగా చీలి నార్త్‌ అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మంది మృత్యువాత పడ్డారు. టైటానిక్‌ షిఫ్ సముద్రంలో మునిగిపోయినా.. దాని గురించి ప్రజలు మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే మునిగిపోయిన తర్వాతే దానికి మరింత గుర్తింపు వచ్చింది. 1990లలో జేమ్స్‌ కామెరూన్‌ టైటానిక్‌ విషాదాంతం గురుంచి ఓ సినిమా తీయాలనుకున్నారు. కొన్నాళ్లకు 1997లో లియోనార్డో డెకాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ జంటగా ‘టైటానిక్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విషాదకరమైన ప్రేమకథగా ఆ సమయంలో ఎన్నో రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించడమేకాక సూపర్‌ హిట్‌గా నిలిచింది. దర్శకుడు జేమ్స్‌ లామెరూన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కథలో హీరో, హీరోయిన్ లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి, చివరికి ప్రమాదం ద్వారా  ఎలా విడిపోయారన్నది ఈ చిత్ర కథాంశం.

ఇక రియల్ స్టోరీలోకి వెళ్తే..

అది 1912 ఏప్రిల్ 14 (ఆదివారం) రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత.. సముద్రం నిశ్చలంగా ఉంది. ఇక్కడ చంద్రుడి జాడలేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. మంచుకొండల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్న ఆ షిప్ కెప్టెన్ స్మిత్ నౌకను దక్షిణం దిశగా మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆరోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు… టైటానిక్ వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సాయంత్రం మెసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు సైతం కంట్రోల్ రూమ్ కి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ (ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం)లో ప్రయాణిస్తోంది.

నౌక ముందు పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడెరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ లీ పెద్ద మంచు పర్వతాన్ని గుర్తించారు. ప్లీట్ కుడివైపు మంచు పర్వతముందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్లే గంటను మోగించాడు. నౌకాధికారి ముద్దోక్ నౌకను ఉన్నపళంగా ఎడమవైపు మళ్లించమని ఆదేశించాడు. ఇంజిన్ ఒక్కసారి ఆగిపోయి మళ్లీ తిరిగి ఆన్ అయ్యింది. అయినప్పటికీ నౌక పర్వతాన్ని ఢీ కొనడాన్ని మాత్రం నివారించలేకపోయారు. ఈ ఘటనలో నౌక కుడిభాగంవైపు 300 అడుగుల పొడవు మేర రాపిడికి గురై నిర్మాణంలో వాడిన చెట్ల(అతికించడానికి వేసే నట్లవంటి నిర్మాణాలు)ను పెకిలించి వేసింది.

షిప్ ముందు భాగం కూడా దెబ్బతినడంతో మెల్లగా పడవలోకి నీరు చేరడం మొదలైంది. 4 కంపార్ట్మెంట్ లు పూర్తిగా నీటితో నిండిపోయినా.. టైటానిక్ షిప్ ఇంకా తేలుతూనే ఉంది. 5వ కంపార్ట్మెంట్ లో కూడా నీరు చేరడంతో పైన ఉన్న కంపార్ట్మెంట్ లలో మొత్తం నీరు చేరడం మొదలైంది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపేయాల్సిందిగా చెప్పాడు. కానీ ఇంతలోనే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. చూస్తుండగానే 1517 మంది నీటిలో మునిగిపోయారు. హెరాల్డ్  బ్రైడ్ ప్రమాద విషయాన్ని దగ్గర్లో ఉన్న షిప్స్ కి కబురు పెట్టాడు. మౌంట్ టెంపుల్ ఫ్రాంక్ ఫ్రెడ్, ఒలింపిక్స్ షిప్స్ కు కూడా సమాచారం అందింది. కానీ ఏ నౌక దగ్గరలో లేకపోవడంతో ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రాలేకపోయారు. 

ఇలా టైటానిక్ ఓడ మునిగిపోయి ఎన్నేళ్లైనా, దానికి ఎదురైన ప్రమాదంపై ఎప్పుడూ ఏదో ఒక కొత్త సమాచారం వెలుగులోకి వస్తోంది. పెద్ద మంచుకొండను ఢీ కొట్టిన తరువాత టైటానిక్ మునిగిపోయిందని మనందరికీ తెలుసు. కానీ అసలు ప్రమాదానికి మంచుతోపాటు సోలార్ ఫ్లేక్స్(సౌర తుపానులు) కూడా కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. 

జేమ్స్ కామెరాన్ తీసిన టైటానిక్ సినిమాలో కూడా షిప్ మంచుకొండను ఢీకొట్టిన తరువాతే మునిగిపోయిందని చూపించారు. కానీ మునిగిపోవడానికి ఆస్కారం లేనట్టుగా రూపొందించిన ఈ ఓడకు జరిగిన ప్రమాదంపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యుడి ఉపరితలంపై ఏర్పడే సౌర తుపానులు భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయని మిలా జింకోవా వాదన.

సముద్రం వద్ద ఏర్పడిన భూ అయస్కాంత తుఫాను(జియో మ్యాగ్నటిక్ స్ర్టోమ్స్) లతో పాటు సోలార్ ఫ్లేర్స్ కారణంగా టైటానిక్ మునిగిపోయే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. 

ఒక ప్రముఖ ఆంగ్ల జర్నల్ ప్రకారం, 1912, ఏప్రిల్ 14న రాత్రి 11.40కి ఓడ మంచుకొండను ఢీకొట్టింది. ఆ సమయంలో ఓడలో ఉన్న నాలుగో అధికారి జోసెఫ్ బాక్స్హాల్ SOS పాయింట్ వద్దనే ఉన్నారు. ఆ సమయంలో నమోదైన అతడి లొకేషన్.. ఒరిజినల్ లొకేషన్ కు 13 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. టైటానిక్ మంచుకొండను ఢీ కొట్టిన తరువాత సహాయం కోసం అతడు SOSను పంపాడు. రెస్క్యూ షిప్ కార్పాథియా కూడా ఈ తప్పుడు లొకేషన్ ను అందుకుంది.

కానీ టైటానిక్ మునిగిపోయిన తరువాత సముద్రంలో పడిన లైఫ్బోట్ల గమనం ఆధారంగా కార్పాథియా నేరుగా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లగలిగింది. దీనిబట్టి చూస్తే అంతరిక్షంలో ఏర్పడిన సౌర తుపానుల కారణంగానే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని తప్పుడు లొకేషన్ నమోదైనట్టు తెలుస్తోంది. సౌర తుపానులు, వేడి గాలుల కారణంగా భూఅయస్కాంత క్షేత్రం ప్రభావితం అవుతుంది. దీని కారణంగానే కమ్యూనికేషన్ సిస్టమ్, మ్యాగ్నటిక్ కంపాస్ (దిక్సూచి), నావిగేషన్.. వంటివన్నీ మారిపోయి టైటానిక్ కు తప్పుడు మార్గాన్ని సూచించాయని అంటున్నారు. వీటి కారణంగానే ఓడమార్గం మార్చుకుని మంచుకొండను ఢీకొట్టిందని వివరిస్తున్నారు. 

1900ల సమయంలో నావిగేషన్ కు వాడే దిక్సూచి ప్రతి చిన్నపాటి మార్పులకు కూడా స్పందిస్తుందని ఆమె చెబుతున్నారు. కానీ ఈ తప్పుడు లొకేషన్ కారణంగానే ఎంతోమంది ప్రాణాలతో బయటపడ్డారు. మ్యాగ్నటిక్ ఫీల్డ్ కారణంగా దిక్సూచి చూపించిన తప్పుడు డైరెక్షన్ లోనే సాయం చేయడానికి బయలుదేరిన కార్పాథియా ఓడ శిథిలాల దగ్గరకు వచ్చింది. అప్పట్లో భౌగోళిక తుపానుల గురించి, దాని ప్రభావం గురించి ఇప్పుడు ఉన్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సమాచారం లేనందున ప్రమాదానికి సిగ్నల్, నావిగేషన్ మార్పులే ప్రధాన కారణాలని చెప్పలేకపోయారని జింకోవా వివరిస్తున్నారు.

మరొక వాదన…

ఆరోజు.. అక్కడ మునిగిపోయింది టైటానిక్ షిప్ కాదు.. ఒలింపిక్ షిప్ అని అంటే మీరు నమ్ముతారా..? అవును దాన్ని బేస్ చేసుకొని చాలా థియరీస్ వెలుగులోకి వచ్చాయి. మునిగింది టైటానిక్ కాదు ఒలింపిక్ అని చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. అస్సలు అది ఒలింపిక్ అనే కచ్చితమైన డౌట్ కూడా ఉంది. అసలు జనాలు డౌట్ పడటానికి కూడా కారణాలున్నాయి.

1911 సెప్టెంబరులో ఒలింపిక్ షిప్ కి ఒక సమస్య వచ్చింది. HMS హగ్స్ అనే షిప్ ని, ఒలంపిక్ ఢీ కొట్టడంతో దూరంగా ఉన్న ప్రదేశాలు అలాగే షిప్ ని నావిగేట్ చేసేందుకు అవసరమయ్యే ముఖ్య భాగాలు ఒలింపిక్ షిప్ లో దెబ్బతిన్నాయి. ఈ ఇన్సిడెంట్ యజమానులకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. ఒకపక్క ఒలింపిక్ షిప్ ని రిపేర్ చేయించాలి. దీనివల్ల టైటానిక్ ఫస్ట్ జర్నీ ని ఆపాలి. కానీ ఆ టైంలో వైట్ స్టార్ కంపెనీ దగ్గర లీగల్ బిల్స్ చెల్లించడానికి ఒలింపిక్ ని రిపేర్ చేయించడానికి సరిపడా డబ్బులు లేవు. దీంతో డబ్బులను ఎలాగైనా క్లెయిమ్ చేసుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. అదే టైటానిక్ ప్లేస్ లో ఒలింపిక్ ని పంపడం. ఆపై దానిని ముంచేసి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం. ఆ నౌకకి మొత్తం 4రు ఇంచార్జ్ లు..

ఈ నాలుగు కంపార్ట్ మెంట్ లకు జెబ్రస్ ఇస్మాయ్ (వైట్ స్టార్  లైన్ కంపెనీ చైర్మన్), లార్డ్ పిర్రీ, థామస్ ఆండ్రూస్ట్ (టైటానిక్ చీఫ్ డిజైనర్), జే.పి. మోర్గాన్ (వైట్ స్టార్ లైన్ టైటానిక్, ఒలింపిక్ ఓనర్) ఉన్నారు. ఈ నలుగురికి తప్ప ఇంక ఎవరికి ఈ షిప్ ను మారుస్తున్న సంగతి తెలియదు. ఈ రెండు షిప్ లను పక్కపక్కన పెడితే ఏది ఏ షిప్పో గుర్తించడం కష్టం. ఎందుకంటే రెండు అచ్చం ఒకేలా ఉంటాయి. వాటి నేమ్ ప్లేట్ చూస్తే తప్ప రెండు వేరు అని చెప్పలేం. ప్లాన్ ఎక్స్యూట్ అయ్యింది. ఒలింపిక్ షిప్ ని మొత్తం, టైటానిక్ షిప్ గా మార్చడానికి చాలా మంది లేబర్స్ రంగంలోకి దిగారు. ఫ్లోరింగ్ కార్పెట్స్ నుంచి ప్రతి ఒక్కటి మార్చేశారు. ఆ టైటానిక్ షిప్ ను బుక్ చేసుకున్న ప్యాసెంజర్స్ ని కూడా ఒలింపిక్ లో కి మార్చేశారు. ఎక్కడా కూడా ఏ చిన్న డౌట్ రాకుండా చేశారు. ఇలా అన్ని మార్చిన ఒకటి మాత్రం వదిలేశారు. అది ఏంటంటే, టైటానిక్ షిప్ ను తయారు చేసేటప్పుడు కేవలం 14 ఫ్లోర్ టూల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ టైటానిక్ ఫస్ట్ ట్రావెల్ చేసేటప్పుడు 16 ఉన్నాయి. ఈ ఒక్క ఏవిడెన్స్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. 

తర్వాత1935లో యూకేలో వైట్ షైన్ అనే హోటల్ లో విరిగిపోయిన స్టెయర్ కేసెస్ అన్నిటినీ ఒక చెక్క బాక్స్ లో పెట్టి హోటల్ కి పంపించారు. ఆ చెక్కపైన 401 నంబర్ వేసి ఉంది. కానీ ఆ నెంబర్ టైటానిక్ ది. టైటానికి ఆల్రెడీ మునిగిపోయిందిగా.. మరీదాని స్టెయర్ కేసెస్, చెక్క వస్తువులు ఇక్కడికి ఎలా వస్తాయి. 401 నంబర్ టైటానిక్ ని ఐర్లాండ్ లో తయారు చేస్తున్నప్పుడు ఇచ్చిన నెంబర్. ఆ హోటల్ కి వచ్చిన చెక్కలు, స్టెయర్ కేస్ లు ఒలింపిక్ వి అయితే 400 అని ఉండాలిగానీ 401 అని ఉంది, అంటే మునిగిపోయింది టైటానికా లేక ఒలింపికా.. క్లారిటీ లేదు. అంతేకాదు ఎప్పుడైన టైటానిక్ కి యాడ్ ఇవ్వాలి అంటే వాళ్ళు రియల్ టైటానిక్ ని వాడేవారు కాదు. కేవలం ఒలింపిక్ నే వాడేవారట. దానిలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కూడా మొత్తం ఒలింపిక్ దే వాడేవాళ్ళు. దీన్నిబట్టి ఒలింపిక్ ని టైటానిక్ అని ఇంతలా నమ్మించారు. ఇది కేవలం ఇన్సూరెన్స్ కోసమే జరిగిందని ఈ థీసిస్ ప్రకారం అర్ధమవుతుంది. కాబట్టి 1912లో మునిగిపోయింది టైటానిక్ కాదు ఒలింపిక్ అని ఈ కారాణాలను బట్టి చెప్పవచ్చు.

Show More
Back to top button