Telugu News

కైలాష్ మానస సరోవర్ గురించి ఈ విషయాలు తెలుసా?

కైలాస మానస సరోవరం హిందూమతం, బౌద్ధమతం, జైనమతంలో పవిత్రమైన సరస్సుగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఇక్కడ నుండే విష్ణువు పాద పద్మాల నుండి ఉద్భవించిన గంగా నది, కైలాస పర్వత శిఖరంపై  వేగంతో చేరుకుంది. కైలాస పర్వతం శివుని నివాసంగా పరిగణించబడుతుంది. కైలాస పర్వతంపై ఆది దంపతులైన శివ పార్వతులు నివసిస్తున్నారని పురాణ గాథ.  హిందూ మతంతో పాటు జైనమతం, టిబెటన్లలో కూడా కైలాస పర్వతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. మరో కథనం ప్రకారం మానస సరోవరం సరస్సు బ్రహ్మదేవుడు సృష్టించాడట.

బ్రహ్మ మానస పుత్రులైన సనక, సందన, సనత్ కుమార, సనత్ సుజాత్ లు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారు. వారి తపస్సు 12 సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ చుట్టుపక్కల తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడి జల వనరులన్నీ ఎండిపోయాయి. 12 సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో వారికి శివపార్వతులు సాక్షాత్కరించారు. అయితే వారిని ఆరాధించడానికి ఆ మునులకు చుట్టుపక్కల ఎక్కడ నీరు అన్నది కనిపించలేదు. దాంతో వారంతా నీటి కోసం తమ తండ్రి అయిన బ్రహ్మ దేవుని ప్రార్థించారు.

వారి ప్రార్థనతో బ్రహ్మదేవుడు వారి సంకల్పంతో ఒక సరస్సు సృష్టించారు. అలా సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో నుండి బ్రహ్మాండమైన ఓ శివలింగం ఉద్భవించింది. అలా ఏర్పడింది మానస సరోవరం. ఆ సరోవరం మధ్యలో ఒక చెట్టు ఉండేదట. ఆ చెట్టు మీద మగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు “జం” అనే శబ్దం వస్తూ ఉండేదట. దాంతో ఆ సరోవరం చుట్టుపక్కల  ప్రాంతాలను జంబులింగ ప్రాంతాలు అని పిలవడం మొదట పెట్టారని చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మన భరత వర్షంలోనే ఉండేదని అందుకే మన దేశానికి జంబుద్వీపం అనే పేరు ఏర్పడిందని కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ మానస సరోవరానికి సంబంధించి ప్రతి మతంలోనూ ఒక కథనం చెబుతారు.

జైనమత కథనం ప్రకారం..

జైన తీర్థం కరుడైన వృషభ దేవుడు ఈ సరోవరం పరిసరాలలోని నిర్యాణం చెందాడని చెబుతారు.   ప్రపంచ దేశాల నుంచి ప్రతి సంవత్సరం వేల మంది యాత్రికులు పర్యాటకులు కైలాస మానస సరోవర సందర్శనకు వస్తూ ఉంటారు.

రావణాసురుడు సృష్టించిన రాక్షస సరస్సు…

ఈ మానససరోవరానికి పడమట దిక్కున రాక్షస తాల్ ఉంటుంది. అంటే ఇది ఉప్పునిటి సరస్సు. ఏ ఈ రాక్షస సరస్సు రావణాసురుడు సృష్టించిన సరస్సు. శివుని ఆత్మలింగాన్ని పొందడం కోసం రావణాసురుడు ఇక్కడే తన పది తలలను ఖండించుకొని తపస్సు చేశాడని ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ప్రసాదించాడని పురాణ కథనాల్లో చెప్పబడింది. ఆ ప్రదేశాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ ప్రదేశమే ఈ రాక్షస తాల్. ఇలా ఎన్నో ఆసాధారమైన అద్భుతాలకు నిలయ మైన మానససరోవరాన్ని చూడాలని ఎవరికి అనిపించదు చెప్పండి.

కైలాస మానస సరోవర యాత్ర చేయడం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. అంత కష్టమైన యాత్ర ఇది. కష్టం అంటే మామూలు కష్టం కాదు. అన్ని కష్టాలకు పరాకాష్ట. ఊపిరి కూడా తీసుకోవడం కష్టమైన యాత్ర. సముద్ర మట్టానికి వేలా అడుగుల ఎత్తు, ఆక్సిజన్ అంతంత మాత్రం, అసలు వేడి అంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం. కనీస సౌకర్యాలు కూడా లేని స్థలం. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు  ప్రయాణం చేయాలి. పర్వతాన్ని ఒకసారి చుట్టి రావడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆక్సిజన్ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో ఎక్కడ ఎలా జారి మంచులో కూరుకుపోతామో తెలియని పరిస్థితిలో ఆ కొండల మీద నాలుగు రోజులపాటు నడవడం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు.

అందుకే ఈ యాత్ర చేయాలంటే ఆరోగ్యంతో పాటు మానసిక ధైర్యం కూడా పుష్కలంగా ఉండాలి. ఈ యాత్ర చేయాలంటే ముందుగా ఫిట్నెస్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాల ఆరోగ్యం సరిగా ఉంటేనే కైలాస మానస సరోవర యాత్రకు అనుమతిస్తారు. ఈ యాత్ర చేయాలంటే భారత ప్రభుత్వ అనుమతితో చేయాల్సి ఉంటుంది. దాదాపు లక్షన్నర పైన ఫీజు కట్టాల్సి ఉంటుంది.  సుమారుగా రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వెళితే వారికి కట్టాల్సింది రెండు లక్షల వరకు ఉంటుంది. ఇక ఆపైన ఖర్చులు ఉంటాయి.  పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఉంటుంది. 

ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే…

సరోవర యాత్ర చేయడానికి సుమారు 18 రోజులు పడుతుంది. భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఈ కైలాస యాత్ర జరుగుతుంది. పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. పాస్పోర్ట్ ఫోటోలు ఇతర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. జూన్లో జరిగే యాత్రకు మార్చిలోనే గడువు వస్తుంది. ఇలా దరఖాస్తు చేసుకోవడానికి జూన్లో జరిగే యాత్రకు మార్చిలోనే గడువు ముగుస్తుంది. కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.  కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్ర నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహించే అన్ని శారీరక వైద్య పరీక్షలు నెగ్గాలి. అంగవైకల్యం, గుండెజబ్బులు, మధుమేహం లాంటి వ్యాధులు ఉన్నవారిని అనుమతించరు. మానస సరోవరం వరకు వెళ్లడమే అత్యంత కష్టమైన యాత్ర అనుకుంటే అక్కడ నుంచి కైలాస పర్వత యాత్ర చేయడం మరింత కష్టమైన సాహసం.

4000 మీటర్ల ఎత్తులో శ్వాస అందడం కష్టంగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పులాంటివి రావచ్చు. డాక్టర్ సలహాతో మందులు దగ్గర ఉంచుకోవాలి. తప్పనిసరి పగలు తేలికైన  దుస్తులు రాత్రి వేళల్లో నూలు దుస్తులు ధరించాలి. ప్రధమ చికిత్సకు అవసరమైన మందులు బ్యాండేజ్ లు లాంటివి అన్ని దగ్గర ఉంచుకోవాలి. యాత్రకు అవసరమైన మందులు దుస్తులు అన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక వైద్య పరీక్షల్లో నెగ్గిన వారికి ఢిల్లీ నుంచి యాత్ర మొదలవుతుంది.

పగటిపూట ప్రయాణం రాత్రిపూట విశ్రాంతి పద్ధతిలో యాత్ర కొనసాగుతుంది. మూడో రోజు డార్జిళ్లకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి 25 కిలోల నుంచి లగాజి తీసుకు వెళ్లడానికి అనుమతి లేదు. ముందు జరగబోయే ప్రయాణాలలో గుర్రాలను కావాలనుకుంటే ఇక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగో రోజు ప్రయాణం మొదలై నారాయణ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత మూడు రోజులపాటు ట్రేకింగ్ చేసిన యాత్రికులు గుంజి అనే గ్రామానికి చేరుకుంటారు. పచ్చడి ప్రకృతి అందాలు, పరుగులు తొక్కుతున్న నదులు, పర్వతాలను ముద్దాడుతున్నట్టు కనిపించే మేఘాల మధ్య ఎంతో ఆహ్లాద భరీతంగా సాగుతుంది యాత్ర. మధ్యలో ఎదురయ్యే గ్రామాలలో స్థానికులు యాత్రికులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉంటారు.

మంచు తో కప్పబడిన పర్వతాలు ఇక్కడ అతి మనోహరంగా కనిపిస్తాయి. రెండు రాత్రులు గుంజిలోనే గడపాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజు పోలీస్ అధికారులు యాత్రికులకు మల్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అన్ని విధాల శారీరకంగా ఉన్నారని తేలిన వారికి ముందుకు వెళ్లడానికి అనుమతి ఇస్తారు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్న వెనక్కి పంపించేస్తారు. గుంజి నుంచి ప్రయాణం మధ్యలో వ్యాస మహర్షి గుహ కూడా కనిపిస్తుంది. నవిడాకు చేరుకున్నాక ఓం పర్వతం కనిపిస్తుంది అయితే ఎప్పుడు మేఘాలు మూసుకుని ఉండే ఈ పర్వతంపై ఓం ఆకారాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నవిడాకు నుంచి డిబేట్ సరిహద్దు ప్రాంతమైన లిప్టెక్ వరకు మరుసటి రోజు యాత్ర కొనసాగుతుంది. మంచు మీద నడుస్తూ ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. దాటిన తర్వాత తెట్లాకోర్టుకు బస్సులో ప్రయాణం సాగుతుంది. ఆ తరువాత అక్కడ ముందు రాక్షస తాల్ సరస్సు..

అక్కడి నుంచి కైలాస పర్వతం కనబడడం మొదలవుతుంది. అంబరాన్ని చూపించే కొండల మధ్య మహా శివలింగం కొలువైనట్టు కనిపించే ఆ దృశ్యం చూడగానే యాత్రికులు అంతవరకు పడ్డ అలసట మాయమై ఆలౌకిక ఆనందాన్ని పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్త ముందుకు వెళ్ళగానే అతి మనోహరమైన మానస సరోవరం దర్శనమిస్తుంది. యాత్రికులు పవిత్రమైన మానస సరోవరంలో స్నానం ఆచరిస్తారు. ఇలా ప్రభుత్వం ద్వారా యాత్రకు చేరుకోవాలంటే 12 రోజులు పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ యాత్ర చేయలేని వారి కోసం రైల్వే సంస్థలు నేపాల్ రాజధాని ఖాట్మండు మీదుగా సాగే మానస సరోవర్ యాత్రను ఐదు రోజుల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర అంతా విమానాల ద్వారా సాగుతుంది. వాతావరణం అనుకూలించకపోతే ఈ యాత్రకు మధ్యలోనే అడ్డంకులు ఏర్పడవచ్చు.  ముందుగా మానస సరోవరం  తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. 

మానససరోవరం కైలాస పర్వతం కలిసి ఉన్నట్లు కనిపిస్తే అదో అద్భుతమైన దృశ్యం. ఆ తర్వాత నుంచి కైలాస పరిక్రమణ కార్యక్రమం మొదలవుతుంది. కైలాసనాధుని పర్వతాన్ని చుట్టు రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. మొత్తం యాత్రలో అత్యంత కష్టమైన ప్రయాణం ఇదే. మానస సరోవరం నుంచి కైలాసగిరి కి ప్రారంభమై ప్రాంతం శివాంగు. అక్కడ నుంచి కైలాస పర్వత కార్యక్రమాల ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతాల నుంచి భక్తులు పర్వతారం అధిరోహించవలసి ఉంటుంది. కష్టమైన దారిలో జాగ్రత్తగా నడుస్తూ కైలాసగిరి అందాలను చూస్తూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు శివ భక్తులు. మధ్యలో బ్రహ్మపుత్రా నదిని దాటాల్సి ఉంటుంది.

ఆ తర్వాత డేరా బుక్ కైలాస శిఖరం నుంచి కనిపిస్తుంది.  సముద్ర మట్టానికి దాదాపు 20,000 అడుగుల ఎత్తులో ఉండడం కారణంగా ఒకసారిగా ఆక్సిజన్ అందదు. శివ నామస్మరణ చేస్తూ ఆ శివయ్య పైనే భారం వేసి ముందుకు కదులుతారు. ఆ శివ నామస్మరణ భక్తులకు కావలసిన శక్తిని అందిస్తుంది. మధ్యలో గౌరీకుండ్ కనిపిస్తుంది. ఈ కొలనులోనే పార్వతి దేవి స్నానం చేస్తుందట.  ఆ తర్వాత రోజు అక్కడ నుంచి ప్రయాణించడంతో కైలాస పరిక్రమణ కార్యక్రమం ముగుస్తుంది. ఇంత శ్రమ పడలేని వారు మానససరోవరం దగ్గర ఆగిపోయి అక్కడ నుంచి కైలాస పర్వతానికి ఆ పర్వతం మీద ఉన్న కైలాస నాధుడికి  ఒక నమస్కారం చేసుకుంటారు. మానస సరోవర సమీపంలో కైలాసగిరిని ప్రదక్షణ మార్గంలో చేరుకోవాలి తప్ప అడ్డదారులేని ఉండవు.

అది క్లిష్టమైన ఈ యాత్రను పరిక్రమంగా చెబుతారు. ఇప్పటివరకు కైలాస పర్వతంలోకి ప్రవేశించిన వారే లేరట. అది అంత సులువైన పని కాదు అందుకే అఘోరాలు లాంటివారికి తప్ప సామాన్యులకు సాధ్యం కాదనే చెప్తారు. అయితే ఇప్పుడు యాత్ర కొంత సులువు అయింది. భారత నుంచి వెళ్లే భక్తులు త్వరగా చేరుకోవడం కోసం కొత్త మార్గాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉత్తరకాండలోని డార్జిళ్ల నుంచి చైనా సరిహద్దు కు రహదారిని ఏర్పాటు చేసింది. దాదాపు 90 కిలోమీటర్ల కొత్త మార్గాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి  ప్రారంభించారు. కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో కైలాస మానస సరోవర యాత్ర సమయం శ్రమ కూడా తగ్గుతుంది. ఈ యాత్రలో చెప్పుకోవాల్సిన అద్భుతాలు మాటలతో చెప్పలేని ప్రకృతి చిత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

Show More
Back to top button