Telugu News

క్రెడిట్ కార్డుపై ఉచిత బీమాలివే..

చేతిలో డబ్బు లేకపోయిన క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు జరపొచ్చు. అందుకే క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంతలా అంటే.. ఈ కార్డు ప్రయోజనాలు పొందడానికి కొందరు ఒకటికి మించి కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మనకు అండగా నిలిచే ఈ క్రెడిట్ కార్డు కేవలం మన అవసరాలను తీరడం మాత్రమే కాకుండా.. కొన్ని ఉచిత ఇన్సూరెన్స్లను కూడా అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

* కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్న టూర్ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్యూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. ప్రయాణం ఆలస్యమైనప్పుడు వసతి, భోజనం, రవాణా వంటి ఖర్చులకు సైతం కవరేజీ లభిస్తుంది. ప్రయాణ సమయంలో మన వస్తువులను ఎవరైనా దొంగిలించినా, డ్యామేజ్ జరిగినా బీమా కవరేజీ ఉంటుంది. విదేశాల్లో మనం అనారోగ్యానికి గురైనా, ఏదైనా ప్రమాదం జరిగినా.. వైద్య ఖర్చులకు కూడా బీమా కవరేజ్ వర్తిస్తుంది. 

* క్రెడిట్ కార్డు ద్వారా మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు అది నిర్దిష్ట వ్యవధిలోపు దొంగతనానికి గురైతే దానికి బీమా కవరేజీ లభిస్తుంది. పాడైన వస్తువుకు కూడా బీమా కవరేజ్ ఉంటుంది.

* కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై వారంటీని క్రెడిట్ కార్డు ఒకటి నుంచి రెండేళ్లపాటు పొడిగిస్తుంది. * క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్లు చేసిన కొన్ని వస్తువులను నిర్దిష్ట వ్యవధిలోపు తిరిగి ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది. 

* క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే ఆది డ్యామేజ్ అయినా, దొంగతనానికి గురైనా ఆ నష్టాన్ని బీమా కవర్. చేస్తుంది.

* క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా మోసం జరిగినప్పుడు వినియోగదారుడిపై భారం పడకుండా.. ఆ నగదును ఈ బీమా ద్వారా పొందవచ్చు. 

* క్రెడిట్ కార్డు హోల్డర్ మరణించినట్లయితే ఆ భారం కుటుంబసభ్యులపై పడుతుంది. అయితే, కార్డు హోల్డర్ పరిమితి మేరకే క్రెడిట్ వాడుకుంటే దాన్ని ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా తీర్దేయవచ్చు. 

* కొన్ని క్రెడిట్ కార్డులు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి. NOTE: మీరు క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో లేదో క్షుణ్ణంగా తెలుసుకొని తీసుకోండి.

Show More
Back to top button