Telugu News

పొదుపు ఖాతా రకాలు ఉపయోగాలు

బ్యాంకులు మన డబ్బును సురక్షితంగా ఉంచడానికి వివిధ రకాల ఖాతాలను అందిస్తాయి. అందులో ఎక్కువమంది తెరిచేది పొడుపు ఖాతానే. అయితే ఆ పొదుపు ఖాతాలో కూడా అనేక రకాలు ఉంటాయి. ప్రతి రకానికి ప్రత్యేకతలు, ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. సాధారణ పొదుపు ఖాతా దేశంలోని దాదాపు అన్ని రకాల బ్యాంకులు ఎక్కువగా సాధారణ పొదుపు ఖాతాలనే ఇస్తుంటాయి. ఇందులో మెయింటెన్ చేయాల్సిన మినిమం బ్యాలెన్స్ కాస్త తక్కువగా ఉంటుంది. ఖాతాలో ఎక్కువ డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఖాతాలోని డబ్బును సులభంగా విత్అ చేసుకోవచ్చు. రోజువారీ ఖర్చులకు, అత్యవసర నిధి కోసం ఈ ఖాతాను ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. కేవైసీ నిబంధనల ప్రకారం వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలను ఇచ్చి బ్యాంకులో ఈ సాధారణ పొదుపు ఖాతాను తెరవొచ్చు. ఈ అకౌంట్లో డబ్బు నిల్వ చేసినందుకు కాస్త వడ్డీ కూడా లభిస్తుంది. అయితే ఈ రకం ఖాతాల విత్ డ్రాలపై దైలీ లిమిట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.

2. ఫ్యామిలీ పొదుపు ఖాతా వ్యక్తిగత పొదుపు ఖాతా మాదిరిగానే కుటుంబం మొత్తానికి కూడా ఒకే పొదుపు ఖాతాను తెరవొచ్చు, కుటుంబ సభ్యులందరూ ఈ ఖాతాను ఆపరేట్ చేసే వీలు ఉంటుంది. ఈ అకౌంట్ పై బ్యాంకు నిబంధనలు సైతం సాధారణ పొదుపు ఖాతా మాదిరిగానే ఉంటాయి. ఇందులోనూ కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి, అలాగే వడ్డీ కూడా లభిస్తుంది. 

3. శాలరీ సేవింగ్స్ అకౌంట్ ఉద్యోగాలు చేస్తున్నందరికీ ఈ తరహా పొదుపు ఖాతాల గురించి తెలిసే ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు తమ ఉద్యోగుల కోసం ఈ శాలరీ సేవింగ్స్ అకౌంట్లను తెరుస్తాయి. ఉద్యోగుల శాలరీని ఈ అకౌంట్లలో జమ చేస్తాయి. అయితే వీటిల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఈ ఖాతా ఉంటే కొన్ని బ్యాంకులు రీటైల్ లోన్ ప్రాసెసింగ్ ఫీజులు విధించవు. లాకర్ రెంటల్పై డిస్కౌంట్లు ఇస్తాయి.

4. చిల్డ్రన్ సేవింగ్స్ అకౌంట్ 18 ఏళ్ల లోపు వయసు ఉన్నవారి కోసం ఈ తరహా పొదపు ఖాతాను తెరవొచ్చు. దీన్నే మైనర్ సేవింగ్స్ అకౌంట్ అని కూడా అంటారు. ఈ ఖాతా తెరవడం వల్ల పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే పొదుపు చేయడం కూడా చిన్నప్పటి నుంచే అలవాటు అవుతుంది.

5. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లు.. ఇవి సాధారణ పొదుపు ఖాతాల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే, ఇందులో కనీస మొత్తం నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఖాతాలోని డబ్బు విత్అ చేసుకోవాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కువ సార్లు లావాదేవీలు జరపలేం. ఎక్కువ డబ్బు కూడా అమచేయలేం. చాలా తక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్లు నిర్వహించేవారికి ఈ ఖాతాలు బాగా ఉపయోగపడతాయి. 

6. మహిళల సేవింగ్స్ అకౌంట్స్ సాధారణంగా మహిళలు పోపుల డబ్బాల్లో, బియ్యం సంచుల్లో డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు. అలాంటివారికి ఈ ఖాతా బాగా ఉపయోగపడుతుంది. దాచుకున్న డబ్బుకు కాస్త వడ్డీ కూడా లభిస్తుంది. అయితే మహిళల సేవింగ్స్ ఖాతాలకు కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి. నిర్దిష్ట కొనుగోళ్లపై రాయితీలు అందుతాయి. తక్కువ వడ్డీకే లోన్లు లభిస్తాయి. కొన్ని బ్యాంకులు డీమ్యాటి ఖాతాపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవు. ఇవే కాకుండా కొన్ని బ్యాంకులు మహిళల కోసం సరికొత్త ఫీచర్లను కూడా అందిస్తుంటాయి.

Show More
Back to top button