ప్రకృతి విపత్తులన్నింటిలోకి భూకంపాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఏటా వందల సంఖ్యలో సంభవిస్తూ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒకేసారి భూమి కుంగిపోవడం వల్ల, ప్రజలు గుర్తించే లోపే తీవ్ర వినాశనం జరిగిపోతుంది. ఇవే భూకంపాలు జనాభా ఎక్కువగా ఉన్న చోట వస్తే ప్రాణ, ఆస్తి నష్టం అంచనాలకు అందని స్థాయిలో ఉంటుంది. అందుకు ఇప్పుడు మనం వెనిజులాలో చూస్తున్న అత్యంత ఘోరమైన దృశ్యాలే ప్రత్యక్ష నిదర్శనం. ఒకసారి భూకంపం సంభవించిందంటే ఆ ప్రాంతం, అక్కడి బాధితులు కోలుకోవడానికి ఏళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి సృష్టించే విలయాలలో దీనిని అత్యంత భయంకరమైనదిగా చెప్తారు.
అసలు భూకంపం ఎందుకు వస్తుందంటే… భూమి యొక్క క్రస్ట్‌లో (భూపటలం) అకస్మాత్తుగా విడుదలయ్యే ‘స్ట్రెయిన్ ఎనర్జీ’ (ఒత్తిడి శక్తి) దీనికి కారణం. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి ఉపరితలాన్ని కుదిపేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లను భూమిలోని రాతి పొరలు కొంతవరకు అణచి ఉంచుతాయి. కానీ, ఆ రాతి పొరల సామర్థ్యాన్ని మించి ఒత్తిడి పెరిగినప్పుడు, అది భూమిలోని బలహీన ప్రాంతాన్ని (ఫాల్ట్ లైన్స్) టార్గెట్ చేసి బద్దలవుతుంది. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే భూగర్భ ప్రదేశాన్ని ‘ఫోకస్’ లేదా ‘హైపోసెంటర్’ అంటారు. ఈ ఫోకస్‌కు సరిగ్గా సమాంతరంగా పైన ఉండే భూ ఉపరితల బిందువును ‘భూకంప కేంద్రం’ (ఎపిసెంటర్) అంటారు. ఫోకస్ స్థానం నుంచే తీవ్రమైన ప్రకంపనలు అలల వలె అన్ని దిశలా వ్యాపిస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తాయి.
ప్రస్తుతం వెనిజులా దేశంలో సంభవించిన ఘోర భూకంప విపత్తు ఈ శాస్త్రీయ నిజానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. పసిఫిక్, కరేబియన్ టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల వెనిజులా తీరప్రాంతంలో శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత భారీ ఒత్తిడి శక్తి ఒక్కసారిగా విడుదలైంది. దీని తీవ్రత ఎంత ఘోరంగా ఉందంటే, కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే 7.2 మరియు 7.5 తీవ్రతతో వరుసగా రెండు భారీ భూకంపాలు (భూకంప డబుల్స్) సంభవించాయి. భూమి అంతర్భాగంలో చాలా తక్కువ లోతులోనే (కేవలం 10 కిలోమీటర్ల లోతులో) ఈ ఫోకస్ ఏర్పడటం వల్ల, దాని నుండి వెలువడిన వినాశకర తరంగాలు అత్యంత వైల్డ్‌గా ఉపరితలానికి దూసుకొచ్చాయి. ఫలితంగా రాజధాని కారకాస్ సహా చుట్టుపక్కల నగరాలు పేకమేడల్లా వణికిపోయాయి.
వెనిజులాలో పరిస్థితి ఇంతలా దారుణంగా మారడానికి ప్రధాన కారణం జనాభా సాంద్రత మరియు అక్కడి భవన నిర్మాణాల బలహీనతే. కారకాస్ వంటి జనసమ్మర్థం ఉన్న నగరాల్లో భారీ అపార్ట్‌మెంట్లు, 22 అంతస్తుల ఎత్తైన భవనాలు సైతం ఈ భూకంప తరంగాల ధాటికి కుప్పకూలిపోయాయి. నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయం, ఆసుపత్రులు, విద్యుత్ లైన్లు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ఒకవైపు శిథిలాల కింద పడి లక్ష మందికి పైగా చనిపోయారని రిపోర్టులు చెబతున్నాయి. మరోవైపు వసతి కోల్పోయిన ప్రజలు ఆందోళనతో వీధుల్లోనే గడుపుతున్నారు. భూకంప కేంద్రం నుంచి నిరంతరం వస్తున్న బలమైన ఆఫ్టర్ షాక్స్ (ప్రతి ప్రకంపనలు) మరింత భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఈ విపత్తు వెనిజులా ఆర్థిక, సామాజిక వనరులను దెబ్బతీసి, ఆ దేశాన్ని కోలుకోలేని విషాదంలోకి నెట్టేసింది.










