ఫార్ములా ఈ కార్ రేస్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయినట్లు తెలిసిందే. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఏ1గా కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారా..? లేదా అనేది చాలా మందికి ఓ సందేహం వచ్చే ఉంటుంది. దీనిపై న్యాయ నిపుణులు ఏంటుంన్నారో ఓ లుక్ వేద్దాం పదండి.
2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది.
సాధారణంగా ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. సీఎస్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఏ1గా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
దీంతో ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఏపీలో సీఎం చంద్రబాబు అరెస్ట్ మాజీ సీఎంకు మైనస్ అయినట్లు.. కేటీఆర్ అరెస్ట్ కేసీఆర్‌కు ప్లేస్ పాయింట్‌గా నిలుస్తుందని కొందరు రాజకీయ నిపుణుల నుంచి వాదన వినిపిస్తోంది. దీన్నిబట్టి కూడా కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశాలు కూడా తక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది.