దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన కార్పొరేట్ సామ్రాజ్య యోధుడు అదానీ. మూడు దశాబ్దాల క్రితమే వ్యాపారాలు ప్రారంభించినా, పదేళ్ల కిందటి వరకు పెద్దగా ఉనికి లేని అదానీ గ్రూపు కంపెనీలు, ఉన్నపళంగా ఉన్నతస్థానాలను అందుకుంటున్నాయి. విమానాశ్రయాలు – నౌకాశ్రయాల నిర్వహణ, వంటనూనెలు, సిమెంటు, విద్యుత్తు… ఇలా ఎన్నో రంగాల్లో అదానీ గ్రూపు ఎంతో బాగా ఎదిగింది. అయితే కొన్ని నెలల క్రితం హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూపు అవకతవకలను బయటపెట్టినప్పటికీ భారత్‌లోని సెబి అవన్నీ నిరాధారమని తోసిపుచ్చింది.
నిర్దోషిగా అదానీని ప్రకటించింది. కాని ఇప్పుడు అమెరికాలో అదానీ గ్రూపు అవినీతి బాగోతం బయటపడడం సంచలనం కలిగిస్తోంది. దీంతో అదానీ కంపెనీపై వస్తన్న ఆరోపణలతో ఇటీవల వచ్చిన మూవీ లక్కీ భాస్కర్‌తో ఓ వర్గం ప్రజలు పోల్చుతున్నారు. దీంతో ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్‌లో అదానీ షేర్లు అమాంతం తగ్గిపోయాయి. ఇలా అదానీ షేర్లు పతనమవ్వడానీకి కారణం ఏంటి? అసలు అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలు ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అదానీ గ్రూప్ ప్రారంభించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో భాగంగా.. అధికారులకు భారీగా లంచాలు(265 మిలియన్ డాలర్లు) ఇవ్వడమే కాకుండా పాజెక్ట్ గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్టు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగు రిపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది.
దీనివల్ల అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 20 శాతం వరకు విలువ కోల్పోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.అందుకు అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన పెట్టుబడులు వినియోగించినట్లు కేసు నమోదవ్వడమే ముఖ్యమైన అంశం.
ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వె స్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో పేర్కొంది. ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్ కరెష్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎ ఫెసిఎపి) ఉల్లంఘన జరిగినట్టు అక్కడి ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే ఈ విధమైన ఉల్లంఘన అమెరికాలో రికాలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. తాజా ఆరో పణలు నిరూపితమైతే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. భారత్ అమెరికా మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది కాబట్టి భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనే అంశం కీలకం కానున్నది.
అదానీపై గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు ఆరో పణలు వచ్చాయి. స్టాక్ మార్కెట్ను మోసం చేసి, విదేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా తన డబ్బుతో తన షేర్లే కొని వాటి విలువను కృత్రిమంగా పెంచి అడ్డదారిలో కుబేరుడయ్యాడని హిండెన్బర్గ్ ఆరోపించింది. హిండెన్బర్గ్ బయటపెట్టిన ఈ కుంభకోణాన్ని స్టాక్ మార్కెట్ మదుపరులు నమ్మారు. ఆ నివేదిక వెలువడిన వెంటనే అదానీ గ్రూపు షేర్ల విలువ 19.2 లక్షల కోట్ల రూపాయల నుంచి 6.8 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆ మేరకు మదుపరులు భారీగా నష్టపోయారు. కానీ అదానీ గ్రూపు తప్పు చేయలేదని మార్కెట్ పర్యవేక్షక సంస్థ సెబి చేసిన నిర్ధారణను సుప్రీంకోర్టు ధ్రువపర్చడంతో అదానీ నిర్దోషిగా బయటపడ్డారు.
ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్ (ఎఫ్పిఐ), లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్మెంట్ (ఎల్డిఆర్) నిబంధనలను సెబి సవరించడమే కాదు, సడలించడంతో అదానీ గ్రూపు సంస్థ లకు కలిసివచ్చింది. ఈ అవకాశాలను ఉపయోగించుకుని అదానీ సంస్థ మోసాలకు పాల్పడిందనే అభిప్రాయం ఉందని, అందుచేత వాటిని రద్దు చేయాలని పిటిషనర్లు డిమాండ్ చేసినప్పటికీ సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విషయంలో సెబి అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టుకు గల అధికా రాలు పరిమితమని స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ సరళమైన ఆర్థిక విధానాల అమలులో భాగంగా ప్రభుత్వాలు కొందరు పారిశ్రామికవేత్తలకు, ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను కట్టబెట్టడం వలన ఒనగూరే అవినీతి కారణంగా ప్రజలే అధిక వ్యయం చెల్లించుకోవాల్సి వస్తున్నదని గమనించాలి.