
పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
హిందూ పురాణాల ప్రకారం, జ్యోతిర్లింగాలు 12. అవి ఉన్న ఈ 12 ప్రదేశాలు తన భక్తులకు వరాలను ప్రసాదించడానికి శివుడు అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. ఈ జ్యోతిర్లింగాల ప్రాముఖ్యతను మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మొదటి జ్యోతిర్లింగం అయిన సోమనాథ్ దేవాలయం గుజరాత్ (సౌరాష్ట్ర) ప్రావిన్స్‌లోని కతియావార్ ప్రాంతంలోని ప్రభాస ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశంలో యదువంశానికి ముగింపు పలికిన తర్వాత శ్రీకృష్ణుడు మోక్షాన్ని పొందాడని పెద్దలు చెబుతారు. వెరావల్‌లోని సోమనాథ్ ఆలయం ప్రపంచంలోని అత్యంత సుప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటిది. ఈ ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాస కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
వాటిలో ఒకటి చంద్రుని (సోమ) దేవుని కథ.
ఒకసారి శాపం కారణంగా చంద్రుడు తన మెరుపును కోల్పోయాడు. శాపవిముక్తి కోసం, చంద్రుడు ఇక్కడ స్నానం చేసి తన తేజస్సును తిరిగి పొందాడు. అప్పటినుంచి, ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని సోమనాథ్ అని పిలుస్తారు.. అంటే ‘చంద్రుని దేవుడు’.. 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా ఉన్నాయి.
అంతేకాకుండా అమ్మవారి 51 శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రదేశంలో సతీ దేవి హృదయం పడిందిట. ఇక్కడ అమ్మవారిని జయదుర్గగా భావించి పూజలు జరుపుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఝార్ఖండ్ లోని వైద్యనాథ్ గా పిలిచే సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చేరుకోవడానికి రైలు, బస్సు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
మహారాష్ట్రలోని ప్రజలు వైద్యనాథ లింగాన్ని వైజ్నాథ్ లింగం అని పిలుస్తారు. వైద్యనాథుని జ్యోతి తుది ఝార్ఖండ్ లో వ్యాపించగా, కొన ఈ ప్రదేశంలో వ్యాపించిందని చరిత్రకారులు చెబుతున్నాయి. పురాణకాలం నాటి సతీ సావిత్రి, మార్కండేయుడు, సత్యవతీ మొదలైన మహాభక్తుల జీవనయానం అనేది ఈ క్షేత్రంతో ముడిపడి ఉందని పురాణాలూ అభివర్ణిస్తున్నాయి. ఈ వైద్యనాథ ఆలయాన్ని తురకులు ధ్వంసం చేయగా రాణి అహల్యాబాయి పునఃనిర్మించారు. ప్రధాన దైవమైన శ్రీ వైద్యనాథేశ్వరుని దర్శించిన తర్వాత ఉప ఆలయాల్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను మనం చూడొచ్చు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల రూపాలను దర్శించడం వల్ల జ్యోతిర్లింగాల దివ్య దర్శన ఫలితం కలుగుతుంది.