Telugu Special Stories

గౌతమ బుద్ధుడి జననమే.. ‘బుద్ధపూర్ణిమ’

గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’, వైశాఖ పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుని జననం జరిగింది.. అంతేకాక బుద్ధుడు బోధిచెట్టు కింద జ్ఞానోదయాన్ని పొందింది కూడా ఇదే రోజున కావడంతో.. ఈ పర్వదినాన బుద్ధ పౌర్ణమి వేడుకలను జరుపుకోవడం విశేషం. 

బోధిచెట్టు కింద జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు గౌతమబుద్ధుడు నిర్యాణం చెందాడు.

వ్యాపించిన అన్ని దేశాల్లోనూ ఈరోజున బోధి వృక్షానికి, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 

ఒక చేతిలో వరదముద్ర, మరో చేతిలో భిక్షాపాత్రను ధరించడంలో అర్థం.. తాను సమస్త సమస్యల నుంచి మానవాళికి విముక్తి కలిగిస్తానని చెప్పడమే..

జీవితసవాళ్లను ఎదుర్కోవడంలో మనకు బోధపడే ఎన్నో శాశ్వత సత్యాలను ఆవిష్కరించిన గొప్ప అధ్యాత్మికవేత్త.. తథాగథుడు.. 

సందర్భంగా బుద్ధుడు(సిద్ధార్థుడు, గౌతముడు).. జనన వృత్తాంతం, బోధనల సారం గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

బుద్దుని జననం…

గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’, అది క్రీ.పూ. 563వ సంవత్సరం. మగధ సామ్రాజ్యపు రాజు శుద్దోధనుడు. ఆ రాజ్యానికి రాజధాని కపిలవస్తు నగరం. అతను శాక్య వంశస్తుడు. వీరి పూర్వీకులు ఇక్ష్వాకులని ప్రతీతి. రాజుకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. భార్య మాయాదేవి. చాలాకాలం వరకు వీరికి సంతానం కలుగలేదు. 

శాక్యులు, ప్రతి ఏటా ఆషాడ సప్తమి నుంచి ఏడురోజులపాటు వేసవి వీడ్కోలు పండుగలు జరుపుకునేవారు. అలా ఆ ఏటా పండుగ ఘనంగా జరిగింది. విందు అనంతరం అలసిపోయిన రాణి నిద్రకు ఉపక్రమించింది. అయితే తెల్లవారుజామున ఆమెకో విచిత్రమైన కల వచ్చిందట. ఆ కల్లో.. ఉన్నటుండి ఒక నక్షత్రం ఆమె ముందు వాలి, ఐరావతంలా మారిపోయి ఆమె పడుకున్న శయ్య చుట్టూ తిరిగి సూక్ష్మరూపం దాల్చి ఆమె కుడివైపున పొట్టలోంచి ఉదరంలోకి వెళ్ళిందట. నిద్ర మేల్కొన్న తర్వాత నిజంగానే ఎదో జరిగిన భావన కలగడంతో.. ఈ విషయం గురుంచి శుద్దోధనుడుకి తెలిపింది.

దీంతో అంతా విన్న రాజు వారిని సత్కరించి పంపించేస్తాడు. వారు వెళ్లిన తర్వాత తన చిరకాల కోరిక అయిన సంతానం కలుగుతున్నందున సంతోషంగా ఉన్నప్పటికీ, తన కుమారుడు సన్యాసి అవుతాడేమో అనే విచారమే ఆయనలో ఎక్కువైంది. ఈ సమస్యను ఎలా పరిషరించుకోవాలని ఆలోచించిస్తున్నాడు. 

ఈ క్రమంలోనే జ్యోతిష్కులు చెప్పినట్లుగా.. గర్భం దాలుస్తుంది. దీంతో ఆచారం ప్రకారం భార్యను పుట్టింటికి పంపిస్తాడు రాజు. 

ఆరోజు వైశాఖ పూర్ణిమ. మంగళవారం. కపిలవస్తుకు చేరేందుకు మరో ఇరవైమైళ్ల దూరం… ఇంతలో లుంబిని వనం చేరుకునేసరికి రాణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. కొంత సమయానికి ఒక 

బాలుడికి జన్మనిచ్చింది. అతనే బుద్ధ భగవానుడు.

రాజు తరపునవారు అటునుంచే కపిలవస్తు చేరుకున్నారు.

పుత్రుడు జన్మించిన సందర్భంగా అందరికి విందు ఏర్పాటు చేశాడు. అనంతరం ‘సిద్ధార్థుడు’ అని నామకరణం చేశారు. సిద్ధార్థుడు అంటే, ‘అన్ని అభీష్టములు నెరవేర్చేవాడని’ అర్థం.. 

మరికొంతమంది పండితుల వద్ద బాలుని జాతకం  చూపిస్తాడు. అది చూసిన వారు ఇలా పలికారు..

దీంతో సన్యాసి అవ్వడం నచ్చని తండ్రి.. ఒక నిర్ణయానికి వచ్చాడు. 

వీడ్ని వేదాంతం నీడ పడనీయకుండా సుఖాలలో ముంచెత్తుతాను. అప్పుడు ఇక సన్యాసి అవ్వలేడు అని భావిస్తాడు. కానీ ఇంతలోనే తల్లి మాయాదేవి, పురిటి నొప్పుల అనారోగ్యం వల్ల వారం రోజుల్లోనే కన్నుమూస్తుంది. 

ఇక బాలుడి సంరక్షణ కోసం ఆమె సోదరి గౌతమిని రెండో వివాహం చేసుకుంటాడు. ఆమె చేతుల్లో సిద్ధార్థుడు అల్లారుముద్దుగా పెరిగాడు. గౌతముడు మరో పేరు.

ఇంట్లోని పెద్దనాన్న కొడుకైన మహానాముడు, చిన్నతండ్రి కొడుకు ఆనందుడు, మేనత్త కొడుకు దేవదత్తునితో కలిసి ఒకేచోట పెరిగాడు. వీరంతా విశ్వామిత్రుడనే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు.

ఏకసంతాగ్రాహి అయిన గౌతముడు గణితంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచాడు. ఎనిమిదవ ఏట.. క్షత్రియ విద్యలైన కుస్తీ, ఖడ్గ విద్యలు నేర్చుకున్నాడు. భరధ్వజుడనే యోగి గురువు వద్ద యోగ విద్యను అభ్యసించాడు.

గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’, సిద్ధార్థుడు వయసు 15. పుత్రుడుకి వివాహం చేయాలని అనుకున్నాడు.

అష్టాంగ మార్గం..

*సరిగా, సమంగా ఆలోచించి, మంచి సంకల్పం చేయడం.

* సత్యమైన మాటలే పలకడం.

*పనులను సక్రమమైన మార్గంలో చేయడం.

*స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం.

*చెడుని విస్మరించి మంచిని పాటించడం.

*తెలుసుకున్న మంచి విషయాలను ఆచరించడం.

*మరణం అనివార్యమని గ్రహించి మంచి పనులు చేయడం.

*జనహితమైన జీవితంతో పునీతులు కావడం.

ప్రపంచంలో ప్రతిదీ కారణం నుంచి పుడుతుంది. కారణరహితంగా ఏదీ ఉండదు. ఎక్కడైతే దుఃఖం ఉందో, అక్కడ అందుకు గల కారణం ఉండి తీరుతుంది. అకారణంగా ఏదీ ఉండదు కదా! ఆ

ఆ కారణాన్ని తెలుసుకొని నిరోధించగలిగితే దుఃఖమనే దానికి ఆస్కారం ఉండదు.

దానిని అధిగమించడానికి బుద్ధుడు సూచించినదే ఈ అష్టాంగ మార్గం. 

*గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’, బుద్ధుని కాలంలో కులం, ప్రాంతం, జన్మలను బట్టి ఒక మనిషిని మరో మనిషి హీనంగా చూసే అత్యయిక పరిస్థితులు ఉండేవి. మనిషిని పశువు కన్నా దారుణంగా చూడ్డం.. గొడ్డు చాకిరీ చేయించుకొని, పనికి తగిన ఫలితం ఇవ్వలేని దోపిడీ విధానం ఆ కాలంలో యథేచ్ఛగా సాగేది. 

ఇది గమనించిన బుద్ధుడు.. ‘‘కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలలోనే కాదు.. సామాజిక, ఆర్థిక విషయాలలో కూడా నైతికత అవసరం’’ అని  పదేపదే చెప్పేవాడు. 

శ్రమను గౌరవించాలనీ, శ్రమకు తగిన ఫలితం అందాలనీ ఆయన చెప్పిన ప్రబోధాలు ఎన్నో ఉన్నాయి. 

ఇలా ‘శ్రమను గౌరవించాలి’ అని బుద్ధుడు చెప్పిన 2400 సంవత్సరాల తరువాత… శ్రమను ఆధారం చేసుకొనే తన తత్త్వాన్ని రూపొందించాడు కార్ల్‌మార్క్స్‌. అలా వచ్చిన గొప్ప గ్రంథమే ‘కాపిటల్‌’.

బుద్ధుడి బోధనల సారం…

మహా చైతన్యమూర్తి, విశిష్ట ఆధ్యాత్మిక వ్యక్తి.. బుద్ధుడి పేరు వెనుక గల ఆంతర్యం..

గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’, ‘బుధ’ అనేది పాలీ పదం.. అంటే, మేల్కొల్పడం, తెలుసుకోవడం, ఎరుక కలిగి ఉండటం అనే అర్థాలు వస్తాయి. ఆ శబ్ద వ్యుత్పత్తి నుంచి వచ్చిందే బుద్ధుడు అనే పేరు. అంటే, లోకుల దైనందిన బాధలకు పరిష్కారం కనుగొనేవరకు విశ్రమించని మహనీయుడని అర్థం. 

లోకంలో ఏదీ శాశ్వతం కాదు, మనతో అల్లుకునే బంధాలూ, మమకారాలను వదిలేసినప్పుడు సుఖం, శాంతి కలుగుతాయి. వాటిని వదలకపోవడం వల్లే వాటిని అంటిపెట్టుకొని ఉన్న దుఃఖం, బాధ పీడిస్తాయని అంటాడు. 

కష్టాలే కాదు, మన ఆనందాలూ శాశ్వతం కాదు. నిజానికవి మనలను మరింత బాధకి గురి చేస్తాయి.

ఎందుకనగా, నెరవేరిన కోరికలు ఆ సుఖానుభూతిని మళ్లీ మళ్లీ కావాలనేలా చేస్తాయి. ఇలా దక్కిన ఆనందాలను ఎక్కడ కోల్పోతామోననే అభద్రతభావం మనలో నిత్యం వెంటాడుతుంది. దీంతో మన సంకల్పాలు చాలాసార్లు గతి తప్పుతాయి. ఒకరిపై ఆధిపత్యం చెలాయించడం, షరతులు విధించడం, అభిప్రాయభేదాలు రావడం వంటివి మనలో వచ్చి చేరతాయి. 

అందుకే బాధలకు దారితీసే భ్రమలు, కోరికలు వంటి సంకుచిత స్వభావాలను దాటడమే ఔన్నత్యమని చెబుతుంది బౌద్ధం కూడా. 

ఆ సామర్థ్యాన్ని అలవరచుకున్నప్పుడే వీటన్నిటి నుంచి బయటపడతాం. అందుకోసమే సులువైన సాధనా మార్గాన్ని సూచించాడు బుద్ధుడు. 

‘శ్వాసను గమనించడం’. 

దీన్ని అలవాటు చేసుకుంటే చాలు. కష్టం, సుఖం.. ఏదీ శాశ్వతం కాదు, శ్వాసకు మల్లేనే వస్తూ పోతూ ఉంటాయని అంతరార్థం గుర్తించగలుగుతామని ప్రబోధించాడు. వేదనను అధిగమించే మహోత్కృష్ట విధానమిది. ఈ రకంగా బుద్ధుడు ‘ప్రతిదీ అశాశ్వతం’ అనే సూత్రాన్ని నొక్కి చెప్తున్నాడంటే అర్థం.. తాత్కాలిక కోరికల నుంచి బయటికొచ్చి జీవిత పరమార్థాన్ని గ్రహించాలనుకోవడమే!

బౌద్ధం.. ఆచరణీయం…

గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’సత్యం, శాంతి, దయ, జ్ఞాన ప్రసారం, నియమబద్ధ జీవనం, ధ్యానం వంటివి బౌద్ధధర్మంలోని ప్రధానాంశాలు. 

అలానే త్రిశరణాలను బుద్ధుడు ప్రతిపాదించాడు. 

శరణం అంటే ఆశ్రయించడం. బుద్ధం.. అంటే జ్ఞానం, దమ్మం, అంటే సంఘం.. ఈ మూడూ మనిషి జీవితంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 

బుద్ధంతోనే మనిషి మాయ నుంచి, ప్రాపంచిక భ్రమల నుంచి తనను తాను వేరు చేసుకోగలుగుతాడు. 

దమ్మసూత్రాలు పాటించి పరిపూర్ణ మానవుడవుతాడు. అలా చేయడమే జీవన సాఫల్యం అంటాడు.

భూత, భవిష్యత్తు కాలాల గురుంచి చింత వదలి, వర్తమానంలో జీవించమన్నదే బుద్ధుడి ప్రబోధ. 

ఇతారాంశాలు…

*గౌతముడు, యశోధరలకు ఓ కుమారుడు జన్మించాడు. పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ విద్య కూడా నేర్పించాడు.

*బుద్ధుడు తన 29వ ఏట.. కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేసిన తర్వాత, సన్యాసం నిరర్థకమని భావించి, అంతటితో వదిలేశాడు.

*తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాడు. ఆ క్రమంలోనే, ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ, జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికే ‘బుద్ధ గయ’ అనే పేరు.

*దాదాపు 45ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. 

*సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు.

*గౌతమబుద్ధుడిజననమే.. ‘బుద్ధపూర్ణిమ’, మరో వైశాఖ పౌర్ణమి నాడే, 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుదిశ్వాస విడిచాడు.

బుద్ధుని సూక్తులు…

*కాలాన్ని వృధా చేయడమంటే, నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.

*మన లోపల శత్రువు లేనంతవరకు, బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు.

*మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల వల్లే.

*ఒక దీపం వేలదీపాలను వెలిగించినట్లుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణనవ్వాలి.

*తమపై తాము విజయం సాధించినవారే అసలైన విజేతలవుతారు.

*నిజం మాట్లాడండి. కోపాన్ని దరిచేరనీయకండి. మీ దగ్గర ఉన్నంతలో సాయం చేయండి.

*ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు.

*మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి.

బుద్ధం శరణం గచ్ఛామి!!

Show More
Back to top button