ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ ఏడాది జనవరి 22న జరగనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర, ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి వాటిలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాణాలను అనుసరించి అయోధ్య కోసలరాజ్య రాజధాని, సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి. ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైంది.
అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది. 1980లలో విశ్వహిందూ పరిషత్, బీజేపి ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తర్వాత పురావాస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు. 164 ఏళ్లుగా నలుగుతున్న, వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కేసు జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేసు కొట్టేసి రామమందిర నిర్మాణం చేపట్టాలని 2019 నవంబర్ 12న తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం 2021 జనవరిలో మందిర నిర్మాణం మొదలు పెట్టింది.
ప్రత్యేకతలు
* ఈ ఆలయానికి ఎన్ని విపత్తులు వచ్చినా ఏళ్లపాటు తట్టుకుని నిలబడేలా డిజైన్ చేశారు.
* తుపానులు వచ్చిన 2500 ఏళ్లపాటు తట్టుకుని ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశారు.
* 3,200 కోట్లు (సుమారు $400 మిలియన్లు) వరకు ఖర్చు అయినట్లు నివేదికలు చెప్తున్నాయి.
* ఆలయ నిర్మాణంలో కాంక్రీటు కానీ, ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. దీంతో మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా. అంతేకాదు ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామ నామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట.
* భారీ భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉండేలా స్తంభాలు, సూపర్ స్ట్రక్చర్‌ను రూపొందించారు.
* ప్రపంచంలో మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం అవతరించింది. ప్రస్తుతం అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉంది.
విశిష్టతలు
అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 57,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. మొత్తం మూడు అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. కాగా, ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. అంతేకాకుండా దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగరిక శైలిలో నిర్మిచారట. ముఖ్యమైన ఆలయ గర్భ గుడిని అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారట. అలాగే ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుంది. ఆలయం లోపల తక్కువ భవనాలు ఉంటాయని, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, ప్రార్థన మందిరం వంటి ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఇక ప్రధాన గర్భగుడిలో లార్డ్ శ్రీ రామ్ (శ్రీ రామ్ లల్లా సర్కార్ యొక్క దేవుడు) యొక్క బాల రూపం, మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది.
- మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా): 2026
- ఆలయం వెడల్పు: 235 అడుగులు
- ప్రవేశ ద్వారాలు: 12
- గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు: 51 అంగుళాలు
- భక్తులకు దర్శనం ఇచ్చే దూరం: 35 అడుగులు
- ఒకే సమయంలో ఎంతమంది కాంప్లెక్స్‌లో ఉండొచ్చు: 10 లక్షల మంది వరకు
- ప్రధాన ఆలయం విస్తీర్ణం: 2.77 ఎకరాలు
- నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు
- ఆలయం పొడవు: 360 అడుగులు