Telugu Special Stories

మరణం అనివార్యం.. మరణించే క్షణాల ముందు అనుభూతి ఎలా ఉంటుందంటే??

మరణం ఎప్పుడు, ఎవరికి, ఎక్కడ ఏ రూపంలో సంభవిస్తుందో చెప్పలేము. ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మరణం నుండి తప్పించుకోవడం అసాధ్యం. అయితే మనిషి చావు పుట్టుకల చక్రం నిరంతర ప్రక్రియ. పుట్టిన వారు మరణించక తప్పదు మరణించిన వారు జన్మించక తప్పదు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించాడు . కొద్ది రోజులు భూమిపై కాలయాపన చేయడానికి వచ్చిన అతిథులు మాత్రమే మనుషులు. ఆస్తులు అంతస్తులు భూములు భవనాలు కోట్లు ఖజానాలు ఎన్ని సంపాదించిన కడకు కాటికి పోవాల్సిందే. మరణం అనివార్యం అన్న సంగతి తెలిసిందే అయితే మరణించే ముందు మనిషికి ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయి అన్న విషయం ఒక సందిగ్ధత కానీ గరుడ పురాణంలో ఈ విషయం గురించి క్లుప్తంగా తెలియజేయబడింది. మనిషికి మరణ సమయంలో ఎదురయ్యే అనుభవాలు గరుడ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు.

ఒక వ్యక్తికి మరణ కాలం సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాల ద్వారా మరణం సంభవిస్తున్నది తెలిసిపోతుందని గరుడ పురాణంలో పేర్కొనబడింది. అయితే మరణ గడియల్లో జరిగే చివరి సంకేతాలు ఏంటో గరుడ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. మరణానికి ముందు కనిపించే కొన్ని సాధారణమైన సంకేతాలు లక్షణాలను సాంప్రదాయ వైద్యం, అనుభవాలు మరియు కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం, దైవ విద్యా ఆధారంగా కూడా వివరిస్తారు. వీటిలో కొన్ని సంకేతాలు వైద్య పరంగా కానీ సాధారణమైనవి. మరికొన్ని ఆధ్యాత్మికంగానూ లేదా సాంప్రదాయ జ్ఞానానికి చెందినదిగా ఉంటాయి. అయితే ఇవి అన్ని వాస్తవంగా ప్రతిసారి చూడబడవని గుర్తుంచుకోవాలి. వాస్తవానికి మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం. ఎవరు దాన్ని తప్పించలేరు, దానిని మార్చలేరు, మరణం నుండి తప్పించుకోలేరు. కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించబడి ఉన్నాయి.

ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు అంటే మరణ సమయానికి చేరుకున్నప్పుడు అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయంటే గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడడం ప్రారంభిస్తాడు. పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు. సనాతన హిందూ ధర్మం లో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది. దీనిని మహాపురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. అంతేకాదు మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూమత విశ్వాసం. అయితే గరుడ పురాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తారో వివరంగా వివరించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణం జీవిత చక్రంలో ఒక భాగం మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరు తప్పించుకోలేరు. అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని గరుడ పురాణం ద్వారా చెప్పబడింది. గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూమతంలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణాన్ని పాటించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూమత విశ్వాసం. ఎవరైనా మరణించే కొద్దిసేపటి ముందు వరకు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణంలో వివరించబడి ఉంది.

ఈ ప్రపంచంలో పుట్టిన వన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయం తెలిసిందే. మరి దీని ప్రకారం మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు. ఇంట్లో ఉన్నా కూడా మరణించే అవకాశం ఉంది. రోడ్డుపైన మన దారిన మనం జాగ్రత్తగా వెళుతున్నా కూడా ప్రమాదం మనల్ని వెంటాడవచ్చు. అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు పుణ్యం, పునర్జన్మ, ఆత్మ, పాపాలు, పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను కచ్చితంగా తెలుసుకుంటాడట. ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతని తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్లుగా చనిపోయిన వారు తన దగ్గరికి వస్తున్నట్లుగా అనుభవానికి గురవుతాడు.

గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ముక్కుముందు భాగాన్ని తన కళ్ళతో చూడలేకపోతే అతని మరణం దగ్గరలో ఉందని సంకేతం. దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేక పోతే అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అనడానికి సంకేతం. ఒక వ్యక్తి తన రెండు చెవులలో తన వేళ్ళు పెట్టుకుని ఏ శబ్దాన్ని వినలేకపోతే అది అతని మరణ సమీపంలో ఉందని సంకేతమట. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే అతను ఒక నెలలో చనిపోతాడని అర్థం. ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటకి వెళుతున్నప్పుడు కుక్క నాలుగు రోజులపాటు వారిని అనుసరిస్తే వారికి మరణం దగ్గరలోనే ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది. ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదు. ఆ వ్యక్తి మరణానికి చేరువయినట్టు గరుడ పురాణం ద్వారా చెప్పబడుతోంది.

గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటివృత్తాన్ని చూడడం ప్రారంభిస్తాడు. లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్ఛిన్నంగా కనిపిస్తాడు మరణానికి ముందు వ్యక్తి చంద్రుని గతంలో లాగా కచ్చితంగా చూడలేడు. మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది ఇది కూడా ఒక మరణ సంకేతం గా చెప్పవచ్చు. చేతి రేఖలు మారతాయి. కొన్ని రేఖలు మాయమవుతాయి. మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వలుకుతుంది. ముక్కు నోరు కాస్త గట్టిగా మారుతాయట. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టం అవుతుంది. ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడం చూస్తారు. మరికొందరు ఆ తలుపు నుంచి మాటలు రావడం చూస్తారు.

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడు అని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నించాలి. జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు. ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు. ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని అర్థం. అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుందట. మృత్యువు వచ్చినప్పుడు నీడ కూడా వెంట రాదని పెద్దలు తరచూ చెబుతుంటారు.

ఇది కేవలం మాట కాదు వాస్తవం. ఒక వ్యక్తికి చివరి క్షణాలు సమీపించినప్పుడు అతను నీటిలో, అద్దంలో, నెయ్యి, నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి. చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. ఆ వ్యక్తి తన జీవిత కాలంలో తాను పంచుకోని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు.

ఇదే గనక జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చేరువలో ఉన్న సమయంలో అతనికి యమదూతలు కనిపిస్తారట. మరణానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే యమదూతలు కనిపిస్తారని గరుడ పురాణంలో రాసి ఉంది. పితృదర్శనం ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది. ఇలా జరిగితే మరణ సమయం దగ్గర పడింది అనడానికి కూడా సంకేతంగా భావిస్తారు. ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పటిస్తారు మరణించిన వారి ఆత్మ 13 రోజులు పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడట మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో గరుడ పురాణాల్లో తెలియజేయబడింది మృత్యువుకి ముందే దైవ యోగం వల్ల రోగం వస్తుంది ఇంద్రియాలు వికలమైపోయి బలము ఓజస్సు వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్లు ఒకేసారి కొట్టినంత బాధా కలుగుతుంది.

Show More
Back to top button