Telugu Special Stories

ఫిబ్రవరి 28 జాతీయ వ్యాస దినోత్సవం

చిన్నప్పుడు దాదాపు అందరం స్కూల్ లో వ్యాసరచన పోటిలో పాల్గొని ఉంటాం, అవే కాకుండా చిత్రలేఖనం, ముగ్గులు,జనరల్ నాలెడ్జి పోటీలలో మనమంతా పాల్గొని ఉంటాం, ఉండే ఉంటారు కదా, మరి మిగిలియా వాటి విషయం ఎలా ఉన్న వ్యాసం గురించి తెలుసుకోవాలి కదా , అసలు వ్యాసం అంటే ఏమిటి? అదెక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? అసలు వ్యాసం రాయడం వలన కలిగే లాభాలు ఏమిటి? వ్యాసం ఎలా రాయాలి? ఎలా మొదలు పెట్టాలి అనేది మనం వివరంగా తెలుసుకుందాం.

వ్యాసం రాయడానికి ముందుగా అంశాన్ని తెలుసుకోవాలి, అంశం ఏమిటి అనేది చూసుకుంటే దానికి తగినట్లు వ్యాసరచన సాగాలి. ముందుగా వ్యాసం రాయడానికి అనువైన కాగితాన్ని తీసుకోవాలి, వ్యాసం అనేది పోటీ లో ఒక పేజి మాత్రమే ఉంటుంది, మనం సొంతంగా రాయాలి అనుకుంటే ఎన్ని పేజీలైనా రాయవచ్చు.

వ్యాసంలో పైన అంశం పేరు రాశాక , కింద పరిచయం రాసి మనం దేని గురించి రాస్తున్నాం అనేది రాయాలి, తర్వాత ప్రారంభం రాసి అందులో మనం చెప్పాలనుకున్నది పాయింట్ లలో చెప్పాక, ఇక చివరగా ముగింపు రాయాలి. ముగింపు మరి పెద్దగా ఉండకుండా క్లుప్తంగా రాస్తే చాలు. ఇవి ఒక వ్యాసం రాయడానికి ఉండాల్సిన లక్షణాలు.

ఇక వ్యాసం రాయడం అనేది ఎలా పుట్టింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ వ్యాస దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ‘వ్యాసాలు’ అని పిలువబడే మొట్టమొదటి రచనల రచయిత మిచెల్ డి మోంటైగ్నే జన్మదినాన్ని మనం జాతీయ వ్యాస దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక వ్యాస రచన అనేది మనలోని ఆలోచనలు పెంపోదిస్తుంది.అలాగే అభివృద్ధి జరిగేలా అంటే ఆలోచనా పరిధి దాటి మనల్ని ఆలోచించేలా చేస్తుంది.అలాగే ఒకర్ని విమర్శించడం,విమర్శనాత్మక ధోరణి మనకు అలవడేలా చేస్తుంది.మన లోని నైపుణ్యాన్ని పెంచేలా చేస్తుంది.మన ఆలోచనల స్పష్టతను అంటే ఒక విషయం పై అవగాహనను పెంపొందేలా చేస్తుంది, ఏ విషయాన్నీ అయినా విశ్లేషించి రాసేలా చేస్తుంది. అలాగే ఎక్కడ ఏ పదాలు వాడాలో, మన పదజాలాన్ని ఉపయోగించాలో తెలిసేలా రచనలో సహాయ పడుతుంది. 

వ్యాసం రాయడం వల్ల ఆ అంశాన్ని గురించి రాయడానికి ఎన్నో రకాల విషయాలను అనేశించడానికి . వాదించే తత్వాన్ని, అలాగే కమ్యునికేట్ చేయడానికి ఉపయోగ పడుతుంది.

ముందు చెప్పినట్టుగా వ్యాసం సాధారణంగా పరిచయం,ప్రారంభం, ముగింపు అనే మూడు భాగాలూ కలిగి ఉంటుంది.

ఇప్పుడు మనం జరుపుకోబోయే జాతీయ వ్యాస దినోత్సవం విద్యార్ధులకు కానీ రచయితలకు తమ అంతర్గత భావాలను తెలియచేయడానికి ఈ వ్యాసాలు చాలా బాగా ఉపయోగపడతాయి.దాంతో పాటు మరెన్నో కొత్త అంశాలను వ్యాసంగా రాయడానికి ఉపయోగపడుతుంది.

అలాగే వ్యాసం ఆంక్షలు లేనిదీ,ఇంతే రాయాలి అనే రూల్ లేదు.కాబట్టి మనం వ్యాసాన్ని ఎంతైనా అంటే పరిధి లేకుండా రాయొచ్చు అన్నమాట. వ్యాసం మన మెదడును ఉత్తేజపరిచి,కొత్త పదాల అన్వేషణ కోసం వెతికేలా చేస్తుంది.

అందరికన్నా కోత్తగా రాయాలి అనే కఠినమైన పదాలు వెతికేలా చేస్తుంది, అలాగే ఒక పదానికి ఎన్ని అర్ధాలు, పర్యాయ పదాలు, నానార్ధాలు ఉన్నాయో కూడా తెలిసేలా చేస్తుంది. తెలుసుకునేలా చీస్తుంది వ్యాసం, ఒక వ్యాసం మొదలు పెట్టినప్పుడు రచయిత అనుకున్న అంశమే కాకుండా ఆ వ్యాసం ఒకదాంట్లో నుండి మరొక దాన్లోకి వెళ్ళేలా చేస్తుంది, అక్కడే రచయిత తనకు తానే ఆశ్చర్యపోయేలా చేసే ప్రయత్నం చేస్తుంది వ్యాసం.

అంటే వ్యాసం రాయడం వలన మన శరీరం లోని పంచేంద్రియాలు పని చేస్తాయి, అలాగే ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన,ఆసక్తి పెరుగుతుంది.

పేపర్లో సంపాదకీయం లాంటివి చూడండి,అవి రోజుకొక అంశం పై రాసే విధంగా ఉంటుంది. అలాగే వ్యాసం ఏ అంశం పైన అయినా రాయవచ్చు,ఏదైనా అంశాన్ని తీసుకుని దానిని నేను ఏ విధంగా రాయగలను ఎలా రాస్తే ప్రజలకు నచ్చుతుంది అనే విషయాన్నీ పరిగణలోకి తీసుకుని రాయొచ్చు.

వ్యాసం రాయడం వల్ల మన ఆలోచనా పరిధి పెద్దగా అవుతుంది, మన మెదడు మరిన్ని ఆలోచనలు చేస్తూ ఉత్తేజితం అవుతుంది, ఒక మెదడే కుండా కాగితం పై కలాన్ని పెట్టి రాయడం వల్ల శరీరానికి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. మరి ఈ వ్యాసాన్ని ఎవరు కనిపెట్టారు అనేది తెలుసుకోవాలి గా ఇప్పుడు తెలుసుకుందాం.

Michel de Montaigne ఎవరు?

ఫ్రెంచ్ పునరుజ్జీవనోద్యమానికి చెందిన అత్యంత ముఖ్యమైన తత్వవేత్తలలో ఒకరైన మిచెల్ డి మోంటైగ్నే, వ్యాసాలను సాహిత్య శైలిగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. అతను విలియం షేక్స్పియర్, ఫ్రాన్సిస్ బేకన్, వోల్టైర్, వర్జీనియా వూల్ఫ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు ఎడ్వర్డ్ డార్విన్ వంటి అనేక మంది రచయితల రచనలను ప్రభావితం చేశాడు. డి మోంటైగ్నే “ఎస్సైస్” పేరుతో అనేక రకాల అంశాలపై చిన్న,ఆత్మాశ్రయ వ్యాసాలను పెద్ద సంఖ్యలో ప్రచురించారు.

చరిత్ర

నేషనల్ ఎస్సేడేని 2020లో లండన్‌లోని రైటింగ్ అసిస్టెన్స్ కంపెనీ వన్ ఫ్రీలాన్స్ లిమిటెడ్ స్థాపించింది. విద్యార్థులు వ్రాత అడ్డంకిని అధిగమించడంలో సహాయపడటం మరియు చివరకు వారి విద్యా జీవితంలోని అన్ని దశలలో వ్యాస రచనతో భాగం అవడం ఆయన లక్ష్యం. “వ్యాసం” అనే పదం ఫ్రెంచ్ ఇన్ఫినిటీవ్ ఎస్సేయర్ నుండి తీసుకోబడింది.

ప్రయత్నించడానికి లేదా ప్రయత్నం చేయడానికి 1580లో, ఫ్రెంచ్ రచయిత మిచెల్ డి మోంటైగ్నే తన మొదటి ప్రచురణకు ఎస్సైస్ అనే పేరు పెట్టినప్పుడు ఈ పదాన్ని ఉపయోగించాడు.

ప్రాముఖ్యత

వ్యాసరచన అనేది పరిమితులు లేకుండా రాయడానికి ,రాయడం వల్ల కలిగే ఆనందాన్ని ఆస్వాదించడానికి వ్యాసరచన చాలా ఉపయోగపడుతుంది.అంటే మనలో ఉన్న రచయిత లేదా సృజనాత్మకంగా ఆలోచించడం అనేది నేర్పేది కేవలం వ్యాసరచన మాత్రమే.

చాలామందికి రాయడం అంటే చాలా ఇష్టం కానీ ఎలా రాయాలో, ఎక్కా రాయాలో ఎంత రాయాలో అనేది తెలియదు, కాబట్టి వారు అంటే కొత్తగా రచనలు చేసేవారు వ్యాసంతో మొదలు పెట్టి, తర్వాత రచనల వైపు వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం నిజానికి ఇదే మంచిది కూడా. వ్యాసాన్ని ఎన్ని పేజీలైనా రాయొచ్చు, ఎంతగా అయినా రాయొచ్చు, అదే కథలు, కథానికలు, నాటికలు లాంటివి ఒక నాలుగైదు పేజీల్లో ముగిసిపోతాయి, ఇక నవలలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. కానీ వ్యాస రచన అనేది పరిమితులు లేనిదీ, అలాగే ఏ అంశంపైనైనా ఎంతైనా రాసే అవకాశం ఉండేది కేవల వ్యాస రచన మాత్రమే.

దీని వలన భాషా నైపుణ్యం, పదాల అర్ధాలు,ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది అనేది తెలియడానికి వ్యాస రచన ఉపయోగ పడుతుంది, వ్యాసాలు రాయడం అందరికి సాధ్యం కాదు. భాషా నైపుణ్యం, భాష పై పట్టు, అంశం పై అవగాహన ఉంటేనే వ్యాసరచన చేయగలం.

చిన్నప్పుడు బళ్ళో ఉపాధ్యాయులు ఇచ్చిన అంశాలకు రాయడం కాకుండా మీరొక కొత్త అంశాన్ని తీసుకోని రాయడం మొదలు పెట్టడం వలన మనసు, శరీరం అన్ని ఉత్తేజితం అవడం జరుగుతుంది. అలాగే ఆలోచనా కూడా పెరుగుతుంది, ఒక విషయాన్నీ ఒకే విధంగా కాకుండా నాలుగు కోణాల నుండి ఆలోచించే విధానం అలవడుతుంది.

అలాగే విశ్లేషణ, విశ్లేషణాత్మక నైపుణ్యాలను సులభంగా చేస్తుంది.ఒక విషయం నేనెలా ఆలోచిస్తాను, మరొకరు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది మనకు తెలుస్తుంది, ఓ మాకు రాయడం ఆసక్తి ఉంది. కానీ అంశం దొరకడం లేదు అంటున్నారా,అయితే ఒక పని చేయండి,మీ రోజువారీ దినచర్యను,లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల జరిగే విషయాలను రాయండి.దీని వలన మీకు మీ చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది, అలాగే ఈ జాతీయ వ్యాస దినోత్సవాన్ని కొత్త వ్యాసంతో మొదలు పెట్టి జాతీయ వ్యాస దినోత్సవాన్ని జరుపుకునేలా అందరికి తెలిసేలా చేయండి.

ఏం రాయాలి అంటే మీరు చూసినా సినిమా,రాజకీయం, లేదా హాస్యం,మీకు ఎలా రాయడం ఇష్టం, మీకు ఏ రచయిత ఇష్టం, ఎందుకు ఇష్టం లాంటివి , సంప్రదాయం గురించి,ఆలోచనలు ఎలా పంచుకోవాలి అనే దాని పై కూడా మీరు వ్యాసాన్ని రాయవచ్చు.  

జాతీయ వ్యాస దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?

దినీకి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.ముందుగా చెప్పినట్టు వ్యాసం అంటే మీకు ఇష్టం ఉండగలగాలి.ఏ విషయాన్నీ అయినా విశ్లేషనాత్మకంగా, విమర్శనాత్మకంగా రాయగలిగే ఆసక్తి ఉండగలగాలి.అప్పుడే మీకు రాయాలనే తపన,మీ శక్తి అనేవి తెలుస్తాయి, మీరు రాసే వ్యాసాల వలన కొన్ని జీవితాలు బాగుపడవచ్చు,చాలా మందికి రాయడం అంటే  చాలా ఇష్టం. కాకపోతే ఎలా మొదలు పెట్టాలి అనేది తెలియదని ముందే చెప్పినట్టు,వ్యాస రచన అనేది ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనేదానికి లెక్కలేదు. కాబట్టి అంశం మనిష్టం, రాత అనేది మనిష్టం, వ్యాసం అంటే ఎంతైనా రాయచ్చు, మొత్తానికి వ్యాసాల వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం,శారీరకంగా కూడా మన శరీర భాగాలూ, మెదడు ఉత్తేజితం అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉపయోగాలు

1.వ్యాసరచన వలన మను కొత్త పదాలు తెలుస్తాయి.

2.విషయ పరిజ్ఞానం తెలుస్తుంది.

3.కొత్త పదజాలం ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది.

4. కొత్త పదాలకు నానార్ధాలు, పర్యాయ పదాలు,కఠినమైన పదాలకు అర్దాలు వెతకాలనే ఆసక్తి పెరుగుతుంది.

5.కొత్త అంశంపై రాయాలనే తపన, ఆశ ఆలోచించేలా చేస్తుంది.

6. మెదడుకు పదును పెరిగేలా చేస్తుంది.

7.శరీరానికి ఎక్సర్సైజ్ అవుతుంది.

8. ఇన్నేళ్ళుగా కాగితం పై కలం పెట్టని వారు పెట్టడం వలన సృజనాత్మకత పెరుగుతుంది.

9. రకరాల అంశాలపై రాయాలనే విశ్లేషణా ధోరణి పెరుగుతుంది.

10. అన్ని విషయాల పట్ల అవగాహన పెరిగి , మెదడు ఉత్తేజితం అయ్యి, మనసెప్పుదూ ఖాళీగా ఉండకుండా ఉంటుంది.

11.మనం ఎంత రాయగలం,అసలు మనం రాయాలనుకున్నది అంశాలపై ,లేదా సమాజంలో జరుగుతున్న అంశాలపై మనకెంత అవగాహన ఉందో వ్యాస రచన అనేది తెలుస్తుంది.

12.ఇక చివరిది పేపరు పై పెన్నుపెట్టడం వలన ఒత్తిడి తగ్గి, మనసు రిలాక్స్ అవుతుంది. అందువల్లనే ఇవన్ని అలోచించి జాతీయ వ్యాస దినోత్సవాన్నిజరుపుకుంటున్నాం. ఈ రోజు మీరు చేయాల్సింది ఒక్కటే కాగితం పై కలాన్ని పెట్టి ఎదో ఒక అంశంపై వ్యాసం రాయడమే…

Show More
Back to top button