Telugu Opinion SpecialsTelugu Special Stories

రాజకీయవేత్తలకు ఆయుధంగా మారుతున్న సోషల్ మీడియా

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉపయోగించని వారంటూ ఎవరూ లేరు. వార్త పత్రిక, న్యూస్ ఛానల్స్ కంటే వేగంగా సమాచారాన్ని సోషల్ మీడియా అందిస్తుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి సోషల్ మీడియాలో ఖాతా తెరవడానికి వార్త పత్రికలు, టీవీ న్యూస్ ఛానల్స్ లాగా ఎక్కువ పెట్టుబడులు అవసరం లేదు. కేవలం ఒక ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. సులువుగా సోషల్‌ మీడియాలో ఖాతా తెరవవచ్చు. అందులో కావాల్సిన విధంగా పోస్టులు చేయవచ్చు. మన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ప్రపంచంలో ఒకవైపు ఉన్నవారు మరో వైపు ఉన్నవారితో కూడా మాట్లాడే సౌకర్యం సోషల్ మీడియా అందిస్తుంది. ఇందులో ఒక పోస్ట్ చేస్తే చాలు.. ప్రపంచం మొత్తం చూస్తుంది.

అంతేందుకు మీరు ఒక వ్యక్తి సమాచారం తెలుసుకోవాలన్నా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా చాలామంది ఎంతో సమాచారాన్ని అందిపుచ్చుకున్నారు. వివిధ ప్రాంతాల వారి ఆచారాలను, నమ్మకాలను కూడా తెలుసుకుంటున్నారు. అంత గొప్పదైన సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయవేత్తలకు, వ్యాపారులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే..

ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఉపయోగిస్తూ ఉండటంతో.. పలువురు రాజకీయ వేత్తలు దీన్ని ఆసరాగా తీసుకుని వారు కూడా సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తున్నారు. అందులో వారి పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు.. పలువురు సెలబ్రెటీస్‌లతో కూడా తమకు కావాల్సిన విధంగా.. పోస్టులను వారి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయిస్తున్నారు. దీన్ని చూసిన యువత అందులోని నిజాలను గుర్తించలేక గుడ్డిగా నమ్ముతున్నారనే విమర్శలు కూడా తలెత్తాయి.

దీనికితోడు ఏ రాజకీయవేత్తలు వారికి వ్యతిరేకంగా వస్తారో.. వారిని ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగా సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు అయితే.. ఇంకా ఘోరంగా పోస్టులు చేస్తున్నారు.

పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నాలు కూడా చాలానే జరిగాయి. దీనికి తోడు కొత్తగా వచ్చిన ఏఐ.. దీంతో గ్రాఫిక్స్ క్షణాల్లో పనిలా మారింది. దీనివల్ల నిజనిజాలు ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టంగా మారిందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

* ఇలా అయితే మరోసారి స్వాతంత్ర్య పోరాటం చేయాలి..!


పెట్టుబడి లేకుండా కొంతమంది రాజకీయవేత్తలు సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి.. తమ బినామీలతో తమకు నచ్చిన విధంగా పోస్టులను చేస్తున్నారు. తప్పుగా పోస్ట్ షేర్ చేస్తేనే చర్యలు తీసుకునే పోలీసులు రాజకీయవేత్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం బాధకరం. పైగా టీవీ ఛానల్‌లో ప్రసారం అయ్యే అస్లెంబ్లీ సమావేశాల్లో నేతలు అసభ్యకరమైన మాటలు ఉపయోగిస్తూ.. బూతులు మాట్లాడుతున్నారు. వీటిని చూసిన యువత, చిన్నపిల్లలు ప్రభావితం అవుతున్నారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

రాజకీయ నేత అంటే ఎటువంటి భేదాలు లేకుండా ప్రజలను పాలించాలి. కానీ ఇప్పుడు కుల, మత రాజకీయాలు ట్రెండ్‌గా మారింది.

ఇది ఇలాగే కొనసాగితే ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో రాజకీయవేత్తల రాజ్యం ఏర్పడుతుందని.. స్వాతంత్ర్యం వచ్చిన భారత్‌ మరలా.. స్వాతంత్ర్యం కోసం పోరాడే పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు.

Show More
Back to top button