మారేడుమిల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలానికి చెందిన ఒక గ్రామం. అదే పేరు గల మారేడుమిల్లి మండలానికి పరిపాలన కేంద్రం. ఇది రాజమండ్రి నుండి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది 2022లో చేసిన జిల్లాల విభాగముకు ముందు ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఇదే మండలంలో ఉండేది. మారేడుమిల్లి అత్యంత సుందరమైన వన ప్రదేశాల్లో ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులు జీవన వైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. తూర్పు దిశలో భాగమైన అడవి ప్రాంతం తిరుగులేని భూభాగంతో నిండి ఉంది. ఈ ప్రాంతం వన్యప్రాణులు, ప్రకృతి, ఫైర్ క్యాంపులు, జలపాతాలను కలిగి ఉంటుంది. దీనికి పది కిలోమీటర్ల దూరంలో జలతరంగిని జలపాతాలు ఉన్నాయి. మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరొక చూడదగిన, అద్భుతమైన విహార ప్రదేశం గురించి విహార స్థల్ ప్రకృతి ఒడిలో సేదతీరే ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నాయి. పులులు, అడవి కోళ్ళు, అడవి దున్నలు, నల్ల చిరుతలు, నెమలితో పాటు అనేక రకాల సీతాకోకచిలుకలు ఇక్కడే కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలను ఆకర్షించే ప్రాంతాల్లో జంగిల్ స్టార్ ఒకటి. ఇది వాళ్ళమూరు నదికి సమీపంలో ఉంది. తూర్పు కనుమలకు సమీప అడవుల్లో మూడు వైపుల పొర్లే ప్రవాహాల మధ్య రాత్రిపూట క్యాంపింగ్ అనుభూతిని ఇక్కడే పొందవచ్చు. రామాయణానికి చెందిన వాలి సుగ్రీవులు ఈ ప్రాంతంలోనే పోరాడినట్లు చెబుతారు.
మారేడుమిల్లికి దగ్గరలో 12 కిలోమీటర్ల దూరంలో రంపచోడవరం అనే గ్రామం ఉంది. ఇక్కడే అల్లూరి సీతారామరాజు పూజలు చేసే వాడిని అంటారు. జలపాతాలు ప్రకృతి అందాలకు ఇది కూడా నిలయం. మారేడుమిల్లిని ఏ మాత్రం తీసిపోదు. ఇక్కడ ఉన్న నందవనంలో బొంగులో చికెన్ (బాంబో చికెన్)చాలా ప్రసిద్ధి. ఇక్కడ పాములేరు వాగు కూడా ఉంది. అక్కడే ముసలి క్రొకోడైల్స్ ఉంటాయి. దీనిని (క్రొకోడైల్స్ స్పాట్) అని కూడా అంటారు. అలాగే స్వర్ణదార, అమృతధార అనేవి మారేడుమిల్లిలో చూడదగిన మరికొన్ని జలపాతాలు. మారేడుమిల్లిలో బాంబో చికెన్ ప్రత్యేక వంటకం. ఎదురుగెడ బొంగులో చికెన్ వేసి మంటలో కాలుస్తారు. ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా తయారు చేసే చికెన్ ను తప్పనిసరిగా రుచి చూడాలి. మారేడుమిల్లిలో మన్యం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సమీప తండాల నుంచి గిరిజనులు వన విహారి దగ్గరికి వచ్చి మూడు రోజులపాటు సాంప్రదాయ దుస్తులు ధరించి, సాంస్కృతిక నృత్యాలతో పర్యాటకులను అలరిస్తారు. ఇవన్నీ జాతరను చూడటానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.
మారేడుమిల్లి అత్యంత సుందరమైన వన ప్రదేశాలలో ఒకటి. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులు జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. తూర్పు కనుమలలో భాగమైన ఈ అటవీ ప్రాంతం తిరుగులేని భూభాగంతో నిండి ఉంది. ఈ ప్రాంతం వన్యప్రాణులు, ప్రకృతి, ట్రెక్కింగ్ క్యాంప్‌లు, జలపాతాలను కలిగి ఉంది. ఇది గిరిజన ప్రజల ఆతిథ్యంతో సందర్శకుల హృదయాన్ని గెలుచుకునే ప్రదేశం. ఈ అటవీ ప్రాంతాన్ని తరతరాలుగా గిరిజనులు పరిరక్షిస్తూ వారి జీవితాన్ని ఈ ప్రదేశంతో మమేకం చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతం గోదావరి నది నీటితో నిండి, సెమీ సతత హరిత అడవులని కలిగిఉంది. ఈ అడవిలో కొంత సాహసం చేస్తే, ప్రకృతితో మునిగిపోయే అద్భుతమైన ప్రదేశలు చాల ఉన్నాయి. మారేడుమిల్లి దాని వెదురు చికెన్‌కు ప్రసిద్ది చెందింది.
@ మారేడుమిల్లి పరిసరాల్లో చూడవల్సిన స్థలాలు ఉన్నాయి…
మారేడుమిల్లి లో చూడవలసిన ప్రదేశాలలో టాప్ వన్ లో ఉండేదైతే గుడిసె. తర్వాత జలతరంగిని, అమృత ధార, పాములేరు, దుంపవలస, దుమ్మదురహర, మోతుగూడెం, మోతుగూడెం పవర్ హౌస్, రంప వాటర్ ఫాల్, భూపతి పాలెం రిజర్వాయర్, చావడికోట హిల్ టాప్, ముంతమామిడి వంటి అనేక గిరిజన ప్రదేశాలు చూడవచ్చు.
తూర్పు కనుమల్లో లోతైన సెమీ సతత, హరిత అడవుల్లో రాళ్లపై ప్రవహించే వాగులు, జలపాతాల గిరిజన జీవనశైలి మారేడుమిల్లి ప్రత్యేకతలు. మారేడుమిల్లికి 47 కిలోమీటర్ల దూరంలో ఉండే గుడిసెలో ఇటీవల పుష్ప, ఆచార్య వంటి ఎన్నో సినిమాల షూటింగ్లు జరుపుతున్నాయి. ఐదుఏళ్ల క్రితం గుడిసే ఒక సాధారణ గిరిజన గ్రామం. ఈ గ్రామం వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు. మారేడుమిల్లి అటవీ ప్రాంతం గ్రామానికి ఆనుకుని ఉండడంతో ఈ మేరకు పర్యాటకలు పెరగడంతో ఈ గ్రామం దేశంలోనే ప్రముఖ పర్యటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకీ అక్కడ ఏముందంటే గుడిసెను ఆనుకుని పెద్ద పెద్ద కొండలు పక్క పక్కనే ఉంటాయి. కొండలు అంటే సాధారణంగా ఏటవాలుగా ఉంటాయి. కానీ గుడిసె కొండపై భాగం ఏటవాలుగా కాకుండా నలుచదురంగా… కనీసం 25 ఫుట్బాల్ స్టేడియం పట్నం ఎంత స్థలం సమతలంగా ఉంటుంది. అక్కడక్కడ చిన్నచిన్న గుప్పలు ఉంటాయి. మిగిలిన భాగం అంతా చదురుగానే ఉంటుంది. ఇంత విశాలమైన కొండ ప్రాంతం మరెక్కడ ఉండదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ఒకేవసర ఎయిర్ స్ట్రిప్ గా వినియోగించాలని యోచించిందంటే ఇది ఎంత విశాలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గుడిసెకు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉండే దుంపవలసి జలపాతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
గుడిసె చేరుకున్న తర్వాత చుట్టూ ఎటు చూసినా కనుచూపుమేరా పచ్చగా పరుచుకున్న కొండలు దర్శనమిస్తాయి. వాటి మధ్యలో కొండలు కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామంగా చెప్పుకోవచ్చు. కొండల మీద నుంచి సాగిపోయే మేఘాలు దుప్పటిలో పరుచుకున్న మంచు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. వర్షాకాలంలో వెళ్లడం రోడ్డు పరంగా ఇబ్బంది అయినా ఈ కాలంలో మనల్ని తాకుకుంటూ వెళ్లి మేఘాలు చెక్కిలిగింతలు పెడతాయి. శీతాకాలంలో సాయంత్రం నాలుగు నుంచి ఇక్కడ చీకట్లు కమ్ముకుంటాయి ఉషోదయం వేళ మంచు తెరలు తెరలుగా పరుచుకుంటుంది. అందుకే రాత్రులు ఇక్కడ బస చేసి సూర్యాస్తమయం, ఉషోదయం చూడాలని పర్యటకులు భావిస్తూ ఉంటారు. అటువంటి వారికి పలు ప్రైవేటు పర్యాటక సంస్థలు టెంట్లు ఏర్పాటు చేయడం క్యాంపైర్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది మారేడుమిల్లి, రంపచోడవరం, భద్రాచలంలో దొరుకుతున్నాయి. గుడిసెకు వెళ్లే దారిలో పర్యాటక అందాలు దట్టమైన అడవి ప్రాంతంలో ప్రయాణించడం ఒక అద్భుతం. పట్టపగలే చీకట్లో కమ్ముకున్నట్లు ఉండే అటవీ ప్రాంతం ఇది. ఎగుడు దిగుడు రోడ్లు సన్నని బాటల మీదుగా ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. అమాయక గిరిజనుల భూములు వారి సాంప్రదాయ అలంకరణలు ఆకట్టుకుంటాయి. గుడిసె గ్రామానికి వెళుతుంటే అటవీ సంపద, అలంకరణాలు ఆకట్టుకుంటాయి. దారిలో జాఫ్రా తోటలు వందల ఎకరాల విస్తరించిన కొండ చీపురులు తయారీ చేసే గడ్డి పూరి గుడిసెలు కూడా ఇక్కడ అందాలను రెట్టింపు చేస్తాయి. గుడిసెకు వెళ్లేదారిలో పుష్ప సినిమా తీసిన ఐరన్ బ్రిడ్జి ఉంటుంది. ముఖ్యంగా కొండల్లో వంకలు తిరుగుతూ సాగే పాములేరు నది అందాలు, సెలయేర్లు కన్నుల విందు చేస్తుంది. మారేడుమిల్లి నుంచి గుడిసెకు వెళ్లే రహదారి కొండమీద ఘాట్ రోడ్డు ఉంటుంది. ఒకప్పుడు నడిచి కొండ ఎక్కాల్సి వచ్చేది. ప్రభుత్వం రహదారి నిర్మించడంతో ప్రయాణికుల కష్టాలు చాలా వరకు తీరాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే పర్యటకుల సంఖ్య కూడా పెరిగింది.
ఇక్కడ సుమారు 100 మంది నివాసం ఉంటున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలో గ్రామం విస్తరించి ఉంటుంది. గుడిసె కొండ నుంచి దిగువ వరకు వెళ్లాల్సి ఉంటుంది. మారేడుమిల్లి నుంచి గుడిసె హిల్ స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ఆవుల వైపు కొండ దిగితే ఆ ఊరు వస్తుంది. గుడిసెకు సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే దుంపవలసి జలపాతాన్ని కూడా చూసి తీరాల్సిందే కొండంత నులిపైన బండపై నుంచి జారిపడే జలపాతం అది.
@ మారేడుమిల్లి లో వసతి సౌకర్యం…
మారేడుమిల్లిలో అందాలను చూస్తూ సమయం గడిపేందుకు వీలుగా అనేక రిసార్ట్స్ అందుబాటులో ఉంటాయి. రిసార్ట్స్ లోపల టూరిస్టులకు కావలసిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పరిసరాలలో సాంప్రదాయ పాటలను వింటు నృత్యాలను కూడా చూడవచ్చు. మారేడుమిల్లి రిజర్వేషన్ ప్రాజెక్టు ఎకో టూరిజం ప్రాజెక్టులు టూరిస్టులకు గొప్ప అనుభూతిని అందిస్తాయి. స్థానికంగా చాలా రిసార్ట్స్ లో గదులు అద్దెకు లభిస్తాయి. ఇందులో ఏసీ నాన్ ఏసీ గదులు ఉంటాయి. జంటలకి లేదా చిన్న చిన్న గ్రూపులుగా వచ్చే వారికి చక్కని వసతులు ఉంటాయి. టెంట్, వసతి, రాత్రులు చలిమంట ఇక్కడ ప్రత్యేకతలు. కొన్ని ట్రావెల్ సంస్థలు గైడ్ ను పెట్టి వసతి, భోజనం రవాణా సదుపాయాలు కూడా కల్పిస్తున్నాయి.
@ మారేడుమిల్లికి చేరుకునే మార్గాలు….
విమానం ద్వారా మారేడుమిల్లి చేరుకోవడానికి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అదేవిధంగా ట్రైన్ ద్వారా రావాలనుకున్నవారు రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అన్ని రకాల ట్రైన్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మారేడుమిల్లికి చేరుకోవచ్చు. మారేడుమిల్లికి చేరుకోవడానికి రాజమండ్రి నుంచి కాకుండా భద్రాచలం నుంచి కూడా వెళ్లవచ్చు. ఈ రెండు మార్గాల్లోను ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు ఎంచుకోవచ్చు.
తూర్పు కనుమలలో లోతైన సెమీ సత్తత హరిత అడవిలో అడవుల్లో రాళ్లపై ప్రవహించే వాగులు, జలపాతాలు, విలక్షణ గిరిజన జీవన శైలి మారేడుమిల్లి ప్రత్యేకతలు. వారంతాల్లో సరదాగా పిక్నికులకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ప్రాంతం పర్యటకులను ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలు, వాగులు ప్రవేశింపజేస్తాయి. ఆ చల్లటి నీటి ప్రవాహం కాళ్లకు తగులుతుంటే, ఆ పూల వాసనలు, మట్టివాసనలు ఆహా ఇది తనివి తీరా ఆనందం అంటే. ఆ క్షణంలో బాధలు ఏమి గుర్తుకురావు. ఇక్కడికి హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం
నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఎక్కువగా సందర్శకులు తెల్లవారే సరికి ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు.
ఉరుకుల, పరుగుల జీవితంలో కాస్త మూడ్ చేంజ్ అయ్యేలా కుటుంబంతో టూర్ ప్లాన్ చేసేవాళ్ళు మారేడుమిల్లి వెళ్లడం బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.