HISTORY CULTURE AND LITERATURETelugu Special StoriesUncategorized

సూర్యచంద్ర గ్రహణ ప్రభావం చూపని ఒకే ఒక ఆలయం శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గల పట్టణం. ఈ పట్టణం స్వర్ణముఖి నదిన తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రాచీనమైన పంచభూత లింగములలో ఒకటైన వాయులింగంగా పేరుందిన గొప్ప శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది. మరొకటి ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనంగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు యొక్క పనితనానికి ప్రతీకగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలిగోపురం శ్రీకృష్ణదేవరాయల కాలం నాడు నిర్మించబడింది. బాగా పెద్దగా కనిపించే వెయికాళ్ళా మండపం కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆలయ అలంకారానికి శ్రీకాళహస్తి పుట్టినిల్లు. స్వర్ణముఖి నది తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభు లింగముకు ఎదురుగా ఉన్న దీపము లింగము నుండి వచ్చే గాలికి రుపరుగులాడుతూ ఉంటుంది శ్రీకాళహస్తిని దక్షిణ కాశి అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా పూజలు అందుకుంటారు. అంబత్రేయములలో ఈమె ఒకరు. ఇక్కడ శివలింగం చతురస్రాకారంలో ఉంటుంది.

శ్రీకాళహస్తి స్థల పురాణం…

శ్రీకాళహస్తి బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశమని అక్కడి పండితులు చెబుతున్నారు. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయెడు అయినా తిన్నడు, వేశ్య కన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన ధూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి.

ప్రాచీన కాలంలో కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు కంటి నుంచి నెత్తురు కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. వెంటనే కన్నప్ప స్వామి కంట రక్త కన్నీరుని చూసి చలించిపోయాడు. తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడుమ్ అప్పుడు స్వామి రెండవ కంటి నుంచి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్నును కూడా పీకే స్వామికి అమార్చాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయం చాలా పెద్దది పైకప్పు పై రంగులతో చిత్రీకరించిన అనేకమైన చిత్రాలు ఉన్నాయి. కాశీ క్షేత్రంలాగే ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకారం మంత్రమును, తారక మంత్రము ఉపదేశించి మోక్షం ఇస్తాడని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంగణంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం కూడా ఉంది. ఆది శంకరుడు ఇక్కడ శ్రీ చక్రం స్థాపించారు. శ్రీ క్షేత్రమునకు గల ఇతర నామాలు దక్షిణ కైలాసం అని కూడా అంటారు. అలాగే శివానందమైన నిలయమని కూడా పేర్కొన్నారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుపుతారు. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా కూడా పరిగణిస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే  మొదటిగా గుర్తొచ్చేది రాహు కేతు శాంతి పూజలు. గర్భాలయంలో ఉండే వాయు లింగానికి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహు కేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. అందుకే సూర్యచంద్ర గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యధావిధిగా పూజలు అందుకుంటుంది. ఎందుకంటే ఈ ఆలయం పై గ్రహణం ప్రభావం చూపదు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి  కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహు కేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకే సారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.

లోపల ఆలయం ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని తర్వాత చోలి రాజులు, విజయనగర రాజులచేత నిర్మించబడింది. ఆలయానికి అనుకొని ఉన్న కొండపై రాళ్లపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. సామాన్య శకం 1529 అచ్యుతరాయులు తన పట్టాభిషేకం మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకుని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నాడు. శ్రీ అనగా సాలీడు, కాలా అనగా పాము,  హస్తి అనగా ఏనుగు. పేరుతో శ్రీకాళహస్తిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయంలోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ, అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముకులై ఉంటారు.

ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ, పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. ఆలయ పరిసరాలలో 36 తీర్థాలున్నాయట. సహస్ర లింగాల తీర్థము, హరిహర తీర్థము, భరద్వాజ తీర్థము, మార్కండేయ తీర్థము, మూక తీర్థము, సూర్యచంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. ఇక్కడ పండుగల విషయానికి వస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. శివుడు కాల ప్రియుడు కాబట్టి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే నాయకులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు భక్తులను తమ కౌశలంతో రంజింపచేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నంది పై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది.

Show More
Back to top button