HISTORY CULTURE AND LITERATURE

భారతదేశంలోని భయంకరమైన రహస్య కోటలు.. ఇవే?

భారతదేశాన్ని ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది రాజులు పరిపాలించారు. వారి పరిపాలన కాలంలో ఆనాటి రాజులు కట్టించిన కోటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని కోటలకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. మరికొన్ని కోటలకైతే ఎంతో భయంకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మన భారత దేశంలో ఉన్న రహస్య కోటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శనివార్ వాడా కోట

శనివార్ వాడ కోట భయంకరమైన కోటాలలో ఒకటి. ఈ కోట మహారాష్ట్రలోని పూణే నగరంలో ఉంది. పగటివేల ఎంతో అందంగా ఆకర్షించే ఈ కోట రాత్రి వేళలో దెయ్యాలకోట లాగా మారుతుందట. హిందీలో బాజీరావు మస్తానీ అనే సినిమాలో ఈ కోటకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ కోటను అందరూ దెయ్యాలకోట అని. దానికి ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ కోట రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతో మంది రాత్రి సమయంలో వచ్చే వాళ్ళట. అప్పుడు వారికి వింత వింత శబ్దాలు వినిపించేవని చెబుతారు. ఈ కోటకు కాపలాగా ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా రాత్రి 7 దాటితే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు. అసలు ఈ కోటలో ఏముంది? ఏం జరిగింది? అనేది తెలియాలంటే మనం గతంలోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే.

1732 అంటే 289 సంవత్సరాల క్రితం బాజీరావు అనే మహారాజు ఈకోట నిర్మించారు. ఆయన యుద్ధంలో వీరమరణం పొందాక ఈ కోట బాధ్యత తన కొడుకులపై పడింది. ఆయనకి ముగ్గురు కొడుకులు తండ్రి చనిపోయాక కొడుకులపై బాధ్యత పడింది. అందులో పెద్దవాడు రాజు అయ్యాక చంపబడ్డాడు. పెద్దాయన మరణం చూసి రెండోవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలింది చిన్న కొడుకు. అతడు 16 ఏళ్లకే రాజు అయ్యాడు. అన్నలు లేనందున తన చిన్నాన్న, పిన్నులు మచ్చిక చేసుకుని కొన్నాళ్లకి అతడిని బందీని చేసేసారు. సమయం చూసి చిన్నమ్మ ముక్కలు ముక్కలుగా నరికి చంపేసింది. అలాగే ఎంతో నమ్మకస్తులైన సైనికులు కూడా మంటల్లో 

కాలి బూడిద అయిపోయారు. అప్పటినుండి వాళ్ళ ఆత్మఘోషలు ఈ కోటలో  కంపిస్తూ ఉంటాయని చెప్తారు. అందుకే ఈ కోటలో రాత్రివేళ ఎవరైనా వస్తే భయపడుతూ ఉంటారు. గట్టిగ అరుపులు వినిపిస్తుంటాయి. అందుకే ఈ శనివార్  వాడకోట రహస్యమైన కోటలో ఒకటిగా నిలిచింది.

గ్వాలియర్ కోట…

రహస్యకోటలో ఒకటిగా చెప్పుకునేది గ్వాలియర్ కోట. మధ్యప్రదేశ్ కి చెందిన ఈ కోట పదవ శతాబ్దం నుండే ఉనికిలో ఉంది అని అంటారు. దీనిని రాజా సూరజ్ సేన్ ఇంకా అతని వంశం 900 సంవత్సరాలు పాలించారు. ఈ కోట సుమారు 1500 సంవత్సరాలకు పురాతనమైందని అంటారు. సూరజ్  సేన్ రాజా వారికి కుష్టు వ్యాధి ఉండేదట. చాలా చోట్ల చూపించిన కూడా అది నయం కాలేదు. అప్పుడే  గ్వాలియర్ అనే ఋషి ఈ కోటలోని నీళ్ల సాయంతో రాజా  వారికి కుష్టు వ్యాధిని నయం చేశారు. అప్పటినుండి ఆ మహారాజు ఆ కోటకి, ఆ ఊరికి గ్వాలియర్ అనే పేరు పెట్టారు.  అన్ని రాజ్యాలపై ఎలాగైతే దాడులు జరుగుతాయో అలాగే ఈ కోటపై కూడా దాడి జరిగింది. దీన్ని రకరకాలుగా అనేక మంది రాజులు పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్యం సమయంలో ఇక్కడ ఖైదీలకు విచిత్రమైన కఠినమైన శిక్షలు వేసేవారు. ఆ శిక్షలకు తట్టుకోలేక కొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచేవారు. అలాగే కోట కోసం యుద్ధం చేసి చనిపోయిన రాజులు ఆత్మలు ఆ చెరసాలలో చనిపోయిన వారి ఆత్మలు కోటలో తిరుగుతుంటాయని అంటారు. అందుకే భయంకరమైన కోటలలో ఇది కూడా చోటు సంపాదించుకుంది.

రోహతాస్ కోట….

రహస్య కోటలలో ఒకటిగా పేరు సంపాదించుకున్న రోహతాస్ కోట బీహారు రాష్ట్రంలో ఉంది. ఈ కోట మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ టెన్ ప్లేసులలో ఒకటిగా నిలిచింది. అనేక గేట్లు, భూగర్భ స్వరంగాలతో రహస్యంగా ఉంటుంది. ప్రాచీన కాలంనాటి హరిచంద్ర కుమారుడు ఈ కోటను కట్టించాడట. మొదట్లో ఈ కోట హిందూ రాజులదయిన తర్వాత ముస్లిం రాజులు దక్కించుకొని మసీదులు కట్టించారు. ఈ కోటలో ఒక గుహ ఉంది. దానిపై నుండి ఒక పకీరుని పడేశారు. ఒక్కసారి కాదు మూడుసార్లు. అయితే ఈ కోట ఇప్పుడు నిర్మానుషంగా మారిందని, ఈ కోటలోకి వెళ్లేందుకు ప్రజలు భయపడతారని స్థానికులు చెబుతారు. రాత్రి సమయంలో ఈ కోట నుండి వింత శబ్దాలు వినిపిస్తాయట.

తాల్ బెహాత్ కోట….

భయంకరమైన రహస్య కోటలలో తాల్ బెహత్తుకోట ఒకటి. గత 150 సంవత్సరాల నుండి ఈ కోటలో అమ్మాయిల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ కోట ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ లో ఉంది. ఈ కోట ప్రవేశ మార్గంలో ఏడుగురు అమ్మాయిల చిత్రాలు గీయబడి ఉంటాయి ఈ కోటను 1980లో మహారాజా మర్దన్ సింగ్ నిర్మించారు. బ్రిటిష్ వాళ్ళకి విరుద్ధంగా పోరాడేవారు. ఈ తాల్ బెహత కోటని రాజామార్ధన్ సింగ్ తన తండ్రి కోసం కట్టించారట. ఇతిహాసాల ప్రకారం చెప్పుకుంటే అక్షయ తృతీయ రోజున ఆ గ్రామంలోకి అమ్మాయిలు చందా కోసం వచ్చేవాళ్ళు. ఒకరోజు ఎప్పటిలాగే మర్దన్ సింగ్ తండ్రి ప్రహరాజ్ సింగ్ ఉన్నారు. ఆ అమ్మాయిలని చూసి కామ వ్యామోహంతో వాళ్లపై బలవంతం చేశారు. అది తట్టుకోలేని ఆ అమ్మాయిలు కోటపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుండి ఆ కోటలో రాత్రి సమయంలో ఆ ఏడుగురు అమ్మాయిలు కాపాడండి అంటూ అరుస్తుంటారట. వాళ్ళ ఆత్మఘోష ఎప్పుడూ వినిపిస్తుందని స్థానికుల కథనం. ఈ విధంగా ఆకోట కూడా రహస్యకోటలో ఒకటిగా నిలిచింది.

మాల్చ మహల్….

మల్చా మహల్ కోట దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. ఇప్పుడు అడవిలోని ఓ నిర్మానుష ప్రదేశంలో బీడుగా మిగిలిపోయింది ఈ కోట. ఈ మాల్చ మహల్ ను 1325లో ఫిరోజ్ షాన్ తుగ్లక్ కట్టించారు. 1978లో  బేగం విలయత్ ఆ మహల్ మాది అని రైల్వేస్టేషన్లో నిరసనలు చేసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు.  షకీనా, అలీ రాజా . 1978లో ఆ మహల్ ని 

ఆవిడకు ప్రభుత్వం అప్పగించింది.

ఫిరోజ్ షా నిర్మించిన ఆనాటి వసతి గృహం ఇది. చాణక్యపురిలోని ఒక అడవిలో లోతైన ప్రధాన రహదారి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. దీనికి మాల్చ మార్గ్ పేరు ఉండేది. అది క్రమేపి మార్చామహల్ గా మారింది. ఇందులో దౌత్య వేత్తలు వ్యాపారవేత్తలు, రచయితలతో సహా నగరంలోని ప్రముఖులు ఉండేవారు.  ఈ కోట వెలుగులోకి రాకముందే  శతాబ్దాలుగా పాడుబడి బీటలు వారి పోయింది. దీని చివరి సభ్యుడు ప్రిన్స్ అలీ రాజా 2017 లో మరణించారు. అయితే ఆ కోట తమదని రైల్వేస్టేషన్లో తీవ్ర నిరసనలు జరిపిన బేగం విలయత్ కోటను సంపాదించుకున్న తర్వాత మూడు దశాబ్దాల క్రితం తన  వజ్రాలను మింగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ నిర్మానుష ప్రదేశంలో శిథిలావస్థలో నివసిస్తుందని అందుకే ప్రదేశాన్ని హాంటెడ్ వాక్ మొదటి పర్యటనకు అనువైనదిగా మార్చిందని స్థానికులు చెబుతారు. ఆ కోటకు వెళ్లాలంటే ఇప్పటికీ ప్రజలు జంకుతారు. ఆ కోట లోపలికి వెళ్ళకముందే దూరం నుండే నిర్మానుష్య ప్రదేశంలో భయంకరంగా కనిపిస్తుంది. ఆ సమీపంలో తిరగాలంటే కూడా ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతారు. అయితే ఈ కోట గురించి పూర్తి రహస్యాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు రీసెర్చ్ ప్రారంభించారు. అయినప్పటికీ ఆ కోటలోకి వెళ్లేందుకు ధైర్యం  చూపకపోవడం గమనార్హం.

Show More
Back to top button