GREAT PERSONALITIESTelugu Special Stories

వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి

మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుసంధానం కావడానికి మాతృ భాష వెంకట రామమూర్తి చాలా శక్తివంతమైన మాధ్యమం. భారతదేశంలో ఉన్న భాషలలోఎంతో వైభవోపేతమైన భాష తెలుగు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే నాల్గవ భాష తెలుగు. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 8.11 కోట్ల మంది తెలుగు మాతృభాషగా ఉన్నారు. తెలుగు మాట్లాడే దేశం మాత్రమే కాదు. వాస్తవానికి, ఈ భాష ద్రావిడ భాషా కుటుంబంలో అతిపెద్ద భాష తెలుగును కొన్నిసార్లు “ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని పిలుస్తారు, ఎందుకంటే 16వ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు నికోల్ డి కాంటి, ఇటాలియన్ భాష వలె తెలుగు భాష కూడా అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నారు. ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ 2012లో భాష యొక్క లిపిని ప్రపంచంలోనే 2వ ఉత్తమమైనదిగా ఎంచుకుంది.

గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది.

తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు వెంకట రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు వెంకట రామమూర్తి. గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలివ్వడం మొదలుపెట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా ప్రారంభం కాలేదు.

గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు.

మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో, విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు. 

1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు.

అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.పాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవర ల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది.

తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది.

సవరభాషలో పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు.

మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో “రావు బహదూర్‌” బిరుదు ఇచ్చారు.

భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు.

ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931 లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938 లోను అచ్చువేశారు. 1934 లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ ‘ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది.

“సవర” దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు వెంకట రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని “శబరు”లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు

తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు మరియు వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం. పూర్వం తెలుగులో పాఠ్యాంశాలు అన్నీ గ్రాంధిక బాషలోనే ఉండేవి. 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు పాఠశాలాల ఇన్స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ (J. A. Yates) అనే  బ్రిటీష్ అదికారి ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఉన్న  తేడాలు చూసి ఆవేధన చెందారు. ఆయన అదే విషయాన్ని గిడుగు వారితో చర్చించారు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.

1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు “గిడుగు”. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు.

“దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది.

గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది.

ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి.

గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను.

కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు.

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి..

గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో.. అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంతే కృషి చేశారు. 

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది.

తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా.. ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండ్‌ నుంచి వచ్చి.. ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర.

ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు..? ఒక సారి ఆలోచించండి.

భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి. ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.

పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి. అందుకు భాష కూడా అతీతం కాదు.

ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు. మన పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ.

ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు. మరి మనం ఏం చేస్తున్నాం..?

ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది.

అతి సులభతరమైన ప్రపంచ భాషలలో మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది.

కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం.

ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి.

వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు. పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.

Show More
Back to top button