HEALTH & LIFESTYLE

అలర్ట్: ఈ పదార్థాలు ఫ్రిడ్జ్‌లో వద్దు

ప్రస్తుత రోజుల్లో రిఫ్రిజిరేటర్ల వాడకం సర్వసాధారణమైంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వండిన ఆహార పదార్థాలు పాడవ్వకుండా, కూరగాయలు, ఇతర పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు ఫ్రిజ్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. మిగిలిన ఆహార పదార్థాలు, కూరగాయలు, నీళ్లు, పాలు, పెరుగు వంటివి చెడిపోకుండా ఫ్రిడ్జ్‌లో పెడతారు. కొన్ని కూరగాయలు, ఆహారపదార్థాలు ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు.

అలా పెడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అవేంటో చదవండి. ఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం తేనె. దీనిని ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టద్దు. దానివల్ల తేనె రుచి మారుతుంది. ఒక్కోసారి ఉల్లిపాయలు కోసినవి ఉంచితే ఉల్లిపాయల వాసన ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం ఉంటుంది. అరటిపండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి. అంతేకాదు రిఫ్రిజిరేటర్‌లో కొన్ని పదార్థాలు ఉంచినప్పుడు వాటి రుచి, ఆకృతి చాలా వింతగా మారతాయి.

బ్రెడ్ పాకెట్ ఓపెన్ చేసి, మిగిలినవి ఫ్రిడ్జ్‌లో పెడితే అవి గట్టిగా మారి.. తినడానికి పనిరావు. అలాకాకుండా కవర్ను గట్టిగా కట్టి వంటగదిలో ఉంచాలి.  బంగాళాదుంపలను పెట్టడం వల్ల చక్కెర శాతం పెరుగుతుంది. దీనివల్ల కూరలో రుచి మారుతుంది. ఒలిచిన వెల్లుల్లిని మార్కెట్ల నుంచి అసలు కొనుగోలు చేయకూడదు. అలాగే.. వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే.. వాటిపై మచ్చలు, బూజు త్వరగా ఏర్పడి చెడిపోతాయి.

ఇవి క్యాన్సర్ కారకాలుగా మారి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటితో పాటు అస్సలు పెట్టకూడనవి పువ్వులు. వీటి వాసనలు ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర ఆహార పదార్థాలకు దాని వాసన పడుతుంది. అటువంటి పదార్థాలు తింటే వికారం, వాంతుల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా త్వరగా చెడిపోయే లక్షణాలు ఉన్న అన్నాన్ని ఫ్రెష్‌గానే తినాలి. ఒకవేళ రిఫ్రిజిరేట్ చేయాలనుకుంటే.. 24 గంటలు మించకూడదని తెలుపుతున్నారు.

Show More
Back to top button