Telugu Special Stories

నదిలా మారిన వేశ్య..నిత్యం తన గర్భంలో జన్మిస్తున్న మహావిష్ణువు

పవిత్రమైనటువంటి పరమపావన నది గండకి.. దీనిని నారాయణి అని కూడా అంటారు. నేపాల్ లోని ప్రధాన నదులలో గంటకి ఒకటి శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే సాలగ్రాములు ఈ నది వద్దనే లభిస్తాయి. గండకీ నది గురించి పురాణ గాథలు ఉన్నాయి. ఈ నది గురించి తెలుసుకుంటే అడుగునా కొత్తదనం లాగే కనిపిస్తుంది. అసలు ఈ నదికి గండకీ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

గండకీగా మారిన బృందాదేవి…

పురాణాల ప్రకారం బృందాదేవి అనే మహిళ గండకీ నదిగా మారింది. బృందాదేవి ఎవరు ? ఆమె చరిత్ర ఏంటి ? అసలు ఆమె గండకీ నదిగా ఎలా మారిందో తెలుసుకుందాం.

బృందాదేవి రాక్షస రాజు అసురనేమికి కుమార్తె. ఆమెను అసురనేమి.. రాక్షసుడు అయినటువంటి జలంధరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. బృందాదేవి రాక్షస కుటుంబంలో పుట్టినప్పటికీ ఈమె విష్ణు భక్తురాలు. ఆయన ఆరాధన చేసేది. విష్ణుపట్ల భక్తి భావంతో మెలిగేది. జలంధరుడి ఆకృత్యాలకు బృందాదేవి పాతివ్రత్యం భక్తి భావమే జరంధరుడుని కాపాడుతుండేది. అయితే రాక్షసుడైన జలంధరుడి హింసకాండ పెరిగిపోయింది. ఆకృత్యాలు పెచ్చుమీరాయి. దీంతో జలంధరుడికి బుద్ధి చెప్పాలని శ్రీమహావిష్ణువ,  పరమేశ్వరుడు పూనుకున్నారు.  పరమేశ్వరుడు జలంధరుడుతో యుద్ధానికి దిగాడు.

బృందాదేవి పాతివ్రత్యం మహిమ కారణంగా సాక్షాత్తు శివుడు కూడా జలంధరుడిని ఏమి చేయలేకపోయాడు. ఇది గ్రహించిన శ్రీ మహావిష్ణువు బృందాదేవి పాతివ్రత్యమే జలంధరుడికి రక్షగా ఉందని, నేను వెళ్లి బృందాదేవి ప్రాతిపత్యానికి భంగం కలిగిస్తానని ఆ సమయంలో నీవు జలంధరుడుని అంతమొందించాలని శివుడికి చెబుతాడు. మహా విష్ణువు అనుకున్నదే తడువుగా జలంధరుడు రూపంలో బృందాదేవి చెంతకు చేరుకుంటాడు. అదే సమయంలో పరమేశ్వరుడు జలంధరుడిని అంతమొందిస్తాడు.

అయితే జరిగిన మోసాన్ని బృందాదేవి గ్రహిస్తుంది. శ్రీమహావిష్ణుపై ఆగ్రహంతో ఊగిపోతుంది. కాస్త జాలి లేకుండా, శిలలా ప్రవర్తించి నా భర్త మరణానికి కారణమయ్యయ్యావు కాబట్టి కఠిన పాశానానివి కమ్మని శపిస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు ఆమెను శాంతింపచేస్తాడు. నీవు లక్ష్మీదేవి అంశవు. నీ పాతివృత్యానికి ఎటువంటి కలంకం అంటదు. నీ శరీరం నదీ ప్రవాహంగాను, శిరోజాలు పవిత్రమైన తులసి మొక్కలుగాను మారి అందరి పూజలను అందుకుంటావు అని వరం ఇస్తాడు. ఆ విధంగా బృందాదేవి వెంటనే గండకీ నదిగా మారుతుంది.

మరో కథనం ప్రకారం…

గండకీ నదికి మరో కథనం ఉంది. గండకి అనే ఓ మహిళ వేశ్య. ఆమెతో ఎంతోమంది ధనవంతులు, రాజులు కలిసేవారు. ఆమెతో కలిసిన వారు గొప్ప ధనవంతులు అయ్యే వారట. ఆ కారణంతో ఎంతోమంది ఆమెతో ఒక్కరోజైనా గడపాలని కోరుకునే వారట. అయితే 

గండకి అందరినీ అంగీకరించేది కాదు. కేవలం మంచి ప్రవర్తన కలిగినటువంటి వారితోనే ఆమె సంఘమించేది. అయితే ఆమె ఏ వ్యక్తితో అయితే సంఘమించాలి అనుకుంటుందో ఆ వ్యక్తిని తన భర్తగా భావించేదట. ఆ వ్యక్తి  ఏమి చెప్పినా చేసేదట. ఒక్కరోజు ఆ వ్యక్తిని తన భర్తగా భావిస్తూ ప్రతి పనిని చేసేదట. వేశ్య వృత్తిలో సైతం ఆమె తన నియమాలను అనుసరించేదట. ఆమెతో గడపాలి అనుకునే వారికి ఒకరోజు ముందుగానే ఆమె వారికి మాట ఇచ్చేదట. అయితే ఇదంతా గమనించిన శ్రీమహావిష్ణువు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఆమెతో గడపడం కోసం ఓ సాధారణ వ్యక్తిగా మారి గండకీ వద్దకు వస్తాడు. అయితే ఆయనను అంగీకరించిన గండకి తన భర్తగా భావిస్తుంది. అయితే ఆ వ్యక్తి ముందుగా స్నానం చేసి తనకి రుచికరమైన భోజనం వండి పెట్టాలని చెబుతాడు. అదేవిధంగా ఆ వ్యక్తిని భర్తగా భావించిన 

గండకి తను చెప్పిన ప్రతి పని చేయాలనుకుంటుంది. ముందుగా స్నానం ఆచరించి రుచికరమైన భోజనం వండుతుంది. తర్వాత ఆయనకు స్నానం చేపించడానికి దుస్తులను తీయగా ఆ వ్యక్తి ఒంటినిండా పుండ్లు ఉంటాయి. అయినప్పటికీ గండకి అసహ్యించుకోదు. తనను తన భర్తగా భావించి స్నానం చేపిస్తుంది. ఆ వ్యక్తి చేతుల నిండా పుండ్లు ఉండడంతో భోజనం కూడా తినలేక పోతాడు. అప్పుడు ఆమె తన భర్తగా భావించి తనకు భోజనం తినిపిస్తుంది. అనంతరం ఆమెతో గడిపే సమయం కూడా లేకుండా ఆ వ్యక్తికి జ్వరం వస్తుంది. ఆ రోజంతా అతనికి సేవలు చేస్తూ కూర్చుంటుంది. అదే రోజు రాత్రి ఆ వ్యక్తి మరణిస్తాడు. అప్పటివరకు తన భర్తగా అనుకొన్నది కాబట్టి గండకి అతనితోపాటు తాను కూడా మరణించడానికి సిద్ధమవుతుంది.

సతీసహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. ఆ వ్యక్తి కాలుతున్న కట్టెలపై తాను కూడా పడబోతుంది. అంతలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇదంతా తన లీలగా చెబుతాడు. ఒక వేశ్య అయినటువంటి తనకు శ్రీమహావిష్ణువు దర్శనం కలిగిందని గండకీ ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణ ఇలా అంటాడు. నీవు చేసే వృత్తి నియమ, నిబంధనలతో ఆచరిస్తున్నావు. నీ విధానాన్ని నేను మెచ్చాను. అందుకే నీకు ఇటువంటి పరీక్ష పెట్టాను.   నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువుని గండకి తన కడుపులో జన్మించాలని కోరుతుంది. సరే నీ వరము నేను తీరుస్తాను. వచ్చే జన్మలో నీవు నదిగా జన్మిస్తావు. నేను నీ గర్భంలోనే శిలలుగా ప్రతిరోజు పుడతాను. అని వరం ఇస్తాడు. ఆ విధంగా గండకీ నది వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ గండకీ నదిలో వచ్చే శిలలే సాలగ్రామాలు. నిత్యం శ్రీమహావిష్ణువు గండకి నదిలో పుడుతున్నట్లుగా ఇదొక కథ ప్రాచుర్యంలో ఉంది.

పవిత్ర సాలగ్రామాలు పుట్టేది గండకీ గర్భం నుండే..

గండకి నది గర్భంలోనే పవిత్రమైనటువంటి సాలగ్రామాలు పుడతాయి. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే సాలగ్రామాలుగా హిందూ ప్రజలు భావిస్తారు. వైష్ణవులు సాలగ్రామాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తూ వెండి, కంచు పాత్రల్లో దుప్పి చర్మంతో కప్పి భక్తి భావంతో ఆరాధిస్తారు. ఈ సాలగ్రామ శిలలను “వజ్ర కీట” అనే ఒక జీవి తన పంటితో 

తొలచి అందులో నివసిస్తుందట. ఈ సాలగ్రామాలు నలుపు రంగులో నునుపుగా ఉంటాయి. తాబేలు నోరు తెరిచిననటువంటి రూపంతో కనిపిస్తాయి. దానిలో శ్రీమహావిష్ణువు దర్శనం ఇస్తారు. శ్రీ మహావిష్ణు రూపాలైనటువంటి ప్రతి ఆలయంలో ఈ సాలగ్రామాలు ఉంటాయి. గండకీ నది నుండి వైష్ణవులు, బ్రాహ్మణులు ఎంతో భక్తిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాలగ్రామాలను తీసుకువచ్చి శ్రీమహావిష్ణువు ఆలయాల్లో కొలువు తీర్చి పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొందరు తమ ఇళ్లల్లో కూడా వీటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారు. ఈ సాలగ్రామాల్లో శంకు, చక్రాలు దర్శనమిస్తాయి.

గండకీ నది జన్మస్థానం…

గండకీ నది గంగా నదికి ఉపనది.

హిమాలయాల్లోని నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ముస్తాంగ్ దగ్గర సముద్రమట్టానికి 309 మీటర్ల ఎత్తులో ఉద్భవించిన నది గండకి. భారతదేశంలోని బీహార్లోని పాట్నా సమీపంలో సోనేపూర్ దగ్గర గంగలో కలుస్తుంది.  ఈ నది అడుగడుగునా కొత్తదనమే. ఈ నది గంగా నదిలో సంఘమించే వరకు ఈ నది ఒక్కొక్క పేరును సంతరించుకుంటుంది. ప్రతి మలుపులలో కొత్త నదితో కలవడం అలా కొత్త పేర్లు సొంతం చేసుకోవడం దీని ప్రాముఖ్యత. డిబేట్ సరిహద్దుల్లో ముస్తాంగ్ దగ్గర నూరుజు సర్జు అనే సరస్సులు కలవడంతో ముస్తాంగ్ కోలా అని పిలవబడే ఈ నది అక్కడనుండి వాయువ్యదిశగా ప్రవహించి కట్టువేని వద్ద ముక్తి ధామం వద్ద కలవడం ద్వారా కాళీ గండకీగా పేరుపొందుతుంది. ప్రవాహంలో అత్యంత లోతైన నది కాళీ గండకి. అక్కడ నుండి దక్షిణ దిశగా ప్రవహించి ధవళగిరి, అన్నపూర్ణ శిఖరాలు దాటి గడేశ్వర్, మెక్సికోలీ  దగ్గర కోటి కోలం అన్న పేరుతోను, రుద్రవీణ దగ్గర బడి గార్డ్ అన్న పేరుతోను, హిమాలయ చివరగా 

త్రిసూలి అన్న ప్రాంతం వద్ద గండకీగా స్థిరపడింది. ఇలా ఎన్నో నదులతో కలిసిన తనకు ఇష్టమైనవి మాత్రం ఏడే నదులట. అందుకే దీనిని సప్త గండకీ గా కూడా అంటారు.

గండకీ నది స్థిరత్వం లేకుండా అడ్డదిడ్డంగా ప్రవహిస్తుంది. వేగంగా ప్రవహిస్తుంది. అందుకే దీని నుండి వ్యాపార మార్గాలు కొనసాగించలేరు. కానీ విద్యుత్ తయారీకి మాత్రం ఈ నది నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

గండకీ నది వద్ద పుణ్యతీర్ధాలు..

గండకి నది తీరంలో అనేక పుణ్య తీర్థాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకునే పుణ్యక్షేత్రం ముక్తి ధామ్ ఈ క్షేత్రం ఇటు హిందువులకు అటు బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన క్షేత్రం. శ్రీమహావిష్ణువు బృందాదేవికి ఈ ప్రదేశం వద్ద మోక్షాన్ని ప్రసాదించాయని పురాణ కథలు చెబుతున్నాయి. కావున ఇది ముక్తిదామ్ గా పేరుంది. ఆలయంలోని స్వామిని హిందువులు ముక్తినాథుడుగా కొలుస్తారు. బౌద్ధులు అవలోక్తేశ్వరుడు గా కొలుస్తారు. వైష్ణవులకు ఈ ప్రదేశం అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. మరొకటి వాల్మీ నగర్. వాల్మినగర్ గండకి నది తీర్థ క్షేత్రాలలో చెప్పుకోదగిన ప్రాంతం. ఇది రామాయణ ఇతిహాసంతో ముడిపడిన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదట. ఇక్కడే లవ కుశలు జన్మించారట. సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీరాముడు ఈ ప్రాంతంలోని వదిలి వెళ్ళడంతో ఆమె వాల్మీకి మహర్షి వద్ద ఆశ్రయం పొందిందని పురాణ కథలు చెబుతున్నాయి.

Show More
Back to top button