Telugu Special Stories

రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు గురించి మీకు తెలుసా?

రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు 18,1946 లో జరిగింది.దీనిని రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అని కూడా పిలుస్తారు.బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రేటింగ్స్, నాన్ కమిషనర్ అధికారులు మరియు నావికులు ద్వారా ఫిబ్రవరి 18, 1946న బొంబాయి నౌకాశ్రయంలో ఇది ప్రారంభమైంది. అంటే రాయల్ ఇండియన్ నేవీ యొక్క తిరుగుబాటు చాలా త్వరగా బ్రిటిష్ ఇండియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వెయ్యి,రెండువేల మంది నావికులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. కానీ మొదట్లోనే దీనిని బ్రిటిష్ వారు బలవంతంగా అణచివేశారు. *అసలు ఈ తిరుగుబాటు గల కారణాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం* రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు మంచి ఆహారం మరియు వసతిని కోరుతూ అంటే అధికారులకు లోబడి ఉన్న నావికుడికి హోదా కావాలని ఈ సమ్మె ప్రారంభమైంది.

భారతీయ నావికులను బ్రిటిష్ కమాండర్లు చాలా దారుణంగా చూసేవారు. అలాగే నౌకాదళంలో భారతీయులకు మరియు బ్రిటిష్ నావికుల జీతం జీవన పరిస్థితులు మరియు ప్రాథమిక సౌకర్యాలలో అంటే ఆహారం వసతులు ఇచ్చేవాటిలో చాలా తేడాలు ఉండేవి. అందువల్లే ఈ సమ్మె బాంబే హార్బర్ లో ప్రారంభమైంది. ఇక్కడ రేటింగ్ ల బృందం వచ్చింది.తల్వాది యొక్క రేటింగ్స్ ఒక స్థాపన కూడా లేకుండా అంటే ఒక యునియన్ అనేది లేకుండా చేశారు, తమ కనీస అవసరాలకోసం విన్నవించుకోకుండా బ్రిటిష్ వారు కట్టడి చేసి,తమపై కనీస అవసరాలు తీర్చకుండా చేయడం పై సీనియర్ల పై నావికులకు అసంతృప్తి అనేది కలిగింది. ఫలితంగా తిరుగుబాటు చేయాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది.

*కమిటీ ఏర్పాటు* ఫిబ్రవరి 19న నేషనల్ జనరల్ స్ట్రిక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో లీడింగ్ సిగ్నల్ మ్యాన్ లెఫ్టినెట్ ఎంఎస్. ఖాన్ మరియు పిటి ఆఫీసర్ టెలిగ్రాఫిస్ట్ మదన్ సింగ్ వరుసగా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. *ప్రేరణ* అలాగే ఈ నావికులు సుభాష్ చంద్రబోస్ వ్యక్తిత్వం నుండి ప్రేరణ పొందారు. సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకుని బ్రిటిష్ నవికులపై తిరుగుబాటు కు పూనుకున్నారు. అందువల్లే సమ్మె బహిరంగంగా తిరుగుబాటుగా పరిణామం చెందింది.కేవలం ఇక్కడే కాకుండా అనేక నగరాలైన బొంబాయి నాయకులుతో పాటు, కరాచీ, కలకత్తా, పూనా, వైజాగ్, కొచ్చిన్, మద్రాస్ మరియు అండమాన్ దీవుల నుండి నావికులు 66 నౌకలు మరియు తీర సంస్థలు కూడా ఈ సమ్మెకు తమ మద్దతు తెలిపారు. అంటే అన్ని ప్రాంతాల నావికాదళం తిరుగుబాటుకు సిద్దం అయ్యింది.

నావికులు అధికారులకు విధేయత చూపడం లేదు. మరియు వారి పదవులను వదిలి బొంబాయి నగరంలో చాలా ప్రదర్శన నిర్వహించారు. అంటే వారి పదవులకు రాజీనామా చేసి, ఉద్యోగాలను వదిలేసి తమకు న్యాయం జరగాలని కోరుకున్నారు. ముఖ్యంగా బొంబాయి నగరం చాలా ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది నిరసనకారులు ముంబాయి నగరంలోని బ్రిటిష్ నివాసితులు మరియు అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి ఇళ్ళు, బాంబే రెసిడెన్సి లోని మొత్తం మందు గుండు సామాగ్రిని విలువ చేసిన ద్వీపాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. అంటే ఉద్యమ తీవ్రత అంతగా పెరగడానికి కారణం కేవలం బ్రిటిష్ అధికారులు భారతీయుల పట్ల చూపించే నిర్లక్ష్యం కారణమైంది.

అంటే స్వతంత్రం కోసం కొంతమంది ఎలా తిరుగుబాటు చేశారో,అలాగే నావికాదళం కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం జరిగింది. అలాగే ఈ తిరుగుబాటు దారులు బొంబాయి నుండి వచ్చిన రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మరియు కరాచీలోని గూర్కాల నుండి మద్దతు కూడా పొందారు. వారు తమ మద్దతును వారికి తెలిపారు. అయితే వారు సెక్టార్ల పై కాల్పులు జరపడానికి నిరాకరించారు. తాము శాంతియుతంగా పోరాటం సాగించాలని కోరుకున్నారు. ఇదంతా గమనిస్తున్న బ్రిటిష్ దళం తమ సాయుధ దళాలపై ఇక పై ఆధారపడలేమని గ్రహించి, బహిరంగ తిరుగుబాటు చేయడానికి సిద్ధమైంది. అంటే తాము ఈ తిరుగుబాటు దారులను ఏమి చేయలేమని గ్రహించారు.

అలాగే అదే సమయంలో మతపరమైన మార్గాల్లో దేశ విభజన జరుగుతున్నప్పటికీ నావికులు మతం, ప్రాంతాల మధ్య తేడాలు లేకుండా వీరు తమ బలమైన ఐక్యతను ప్రదర్శించారు. వారు మతానికి కానీ ప్రాంతానికి కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా తమ కనీస అవసరాల గురించి పోరాటం చేశారు. అయితే తిరుగుబాటు నాయకత్వం భారత నాయకత్వం నుండి మద్దతును చూడలేకపోయింది. అంటే భారత నాయకత్వం వారికి మద్దతు ఇవ్వలేకపోయింది. అంటే మనం స్వతంత్రానికి దగ్గరగా ఉన్నాం, కాబట్టి ఈ తిరుగుబాటును ప్రమాదంగా భావించారు, కాబట్టి భారతదేశంలో నావికాదళం తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేకపోయింది. కాబట్టి నావికులు ఒంటరి పోరాటం చేశారనే చెప్పవచ్చు,కానీ వీరికి ప్రజల మద్దతు మతం చాలా లభించింది.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మరియు ఐఎన్సి ద్వారా అరుణ ఆసఫ్ అలీ మాత్రమే నావికులకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాల వలన సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యంతో ఈ తిరుగుబాటు ముగిసింది. తిరుగుబాటు దారులు 23 ఫిబ్రవరి 1946న పోలీసులకు లొంగిపోయారు. ఈ తిరుగుబాటులో దాదాపు 8 మంది మరణించారు ఏడు మంది నావికులు మరియు ఒక అధికారి మరణించారు అలాగే తిరుగుబాటు ఫలితంగా 476 మంది నావికులు డిశ్చార్జి అయ్యారు. ఇక్కడ డిశ్చార్జి అంటే పని నుండి తీసివేయబడ్డారు అని అర్ధం.తర్వాత స్వతంత్రానంతరం అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వారిని భారత దేశంలోనూ,మరే దేశాలలోనూ తిరిగి నౌకాదళం లోకి తీసుకోలేదు. కాకపోతే సంతోషం ఏమిటంటే వారిని పట్టించుకోకుండా వదిలీ వేశారు, తప్ప ఖైదు చేయలేదు. మరే ఉద్యోగం వారికి ఇవ్వలేకపోయారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం వారికి కనీసం ఫించన్ కూడా ఇవ్వలేకపోయింది. దాంతో తిరుగుబాటు చేసిన వారంతా వేరే చోటికి వలసలు వెళ్లి బ్రతికారు. తప్ప భారతదేశం వీరికి ఎలాంటి సహాయం చేయలేకపోయింది. కాబట్టే ఈ తిరుగుబాటు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే ఈ తిరుగుబాటుదారులకు ప్రజల మద్దతు చాలా ఉందని పేర్కొనడం గమనార్హం. సమ్మె కారణంగా బొంబాయిలో జరిగిన హింసకాండలో 200 మందికి పైగా పౌరులు మరణించారు. వీరి తిరుగు బతుకు నిజంగానే ప్రజల మద్దతు ఉంది. ఎందుకంటే చాలామంది భారతీయులు వారికి బానిసలుగా వెళ్ళారు, కాబట్టి వారి కుటుంబాలు అందర్నీ పోగు చేసి తమ వారికీ అన్యాయం జరుగుతుందని భావించి, మిగిలిన వారిని కుడగట్టుకుంటూ తిరుగుబాటు చేయాలనీ మద్దతు బయటి నుండి బహిరంగంగా తెలిపారు.

అయితే వీరి డిమాండ్లు చాలా చిన్నవి మరియు సాధారణంగా ఉండేవే అవేంటంటే. తక్షణ ట్రిగ్గర్ మరియు మెరుగైన ఆహారం అంటే మంచి ఆహారం, పని, పరిస్థితులు అంటే కనీస అవసరాలు తమకు మంచి ఆహారం, వసతి, నీళ్ళు,జాతి వివక్ష అనేవి చూపించకుండా, కనీస జీతం ఇవ్వాలనేదే తిరుగుబాటుకు కారణమయ్యింది. వీరిని బ్రిటిష్ వారు చాలా నీచంగా చూసేవారు.పని చేయించుకుని గౌరవం లేకుండా, కనీసం సరైన ఆహారం ఇవ్వకుండా ఒక చిన్న గుడారాలను ఇచ్చి, కేవలం ఎండిపోయిన బన్ను ముక్కలు ఇచ్చి తినమని బలవంతం చేసేవారు. ఇక్కడ ట్రిగ్గర్ అంటే పని చేస్తున్నందుకు కనీస అవసరాలు అనే అర్ధం వస్తుంది. నావికుల భాష వేరుగా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రిగ్గర్ అనే పదాన్ని వాడారు అని చెప్పవచ్చు.తమకోసం,తమ డిమాండ్లను తీర్చాలని అలాగే బ్రిటిష్ అధికారులు చూపించే జాతి వివక్ష లేకుండా చూడాలని,అందరినీ సమానంగా చూడాలని వీరి కోరిక.

అయితే ఈ ఆందోళన తర్వాత జాతీయవాదం మరియు బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం కోసం డిమాండ్ గా మారింది. నిరసన తెలిపిన నావికులు తమకు స్వాతంత్రం కావాలని డిమాండ్ చేశారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ సిబ్బంది మరియు ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్రిటిష్ దళం నుండి భారత సైన్యాన్ని ఉపసంహరించాలని కూడా వీరు కోరారు. అలాగే ఆర్ఐఎన్ ఉద్యోగులకు వారి బ్రిటిష్ సహచరులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని లేదా కనీసం సవరించాలని కోరారు. ఇవన్నీ కేవలం కనీస అవసరాల తప్ప వారికి పెద్దగా డిమాండ్లనేవి లేవు.

*తిరుగుబాటు యొక్క ప్రాముఖ్యత *ఈ సంఘటన బ్రిటిష్ పాలన అంతానికి సాక్ష్యం అవ్వాలనే భారతీయ ప్రజలందరి సంకల్పాన్ని మరింత బలపరిచింది *అలాగే ఈ తిరుగుబాటు యొక్క మరొక విశేషమైన లక్షణం ఏమిటంటే తిరుగుబాటుదారులకు ప్రజల మద్దతు చాలా ఎక్కువగా ఉండేది. *తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు తామిక భారతదేశ అన్ని పట్టుకోలేరని గ్రహించారు. *స్వతంత్ర పోరాటంలో తమ వంతు కృషిగా బ్రిటిష్ వారికి తాము సహకరించేది లేదని తెలియ చెప్పడానికి ఈ రాయల్ ఇండియన్ నేవీ ప్రయత్నించింది. అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇందులో అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా చాలామంది చనిపోయారు. తిరుగుబాటు అనంతరం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వీరికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది అప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిని కూడా మళ్లీ ఉద్యోగాలలోకి తీసుకొలేదు.

స్వాతంత్రం కోశాన్ గాంధీ,నెహ్రు వంటి వారే కాకుండా బ్రిటిష్ కబంధ హస్తాల నుండి కాపాడేందుకు చిన్న నుండి పెద్ద వారి వరకు తమవంతు బాధ్యతగా తిరుగు బాటు చేసి స్వాతంత్ర్యాన్ని తేచి పెట్టారు. వారు చేసిన త్యాగం ,వారు చేసిన తిరుగుబాటు , ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వారితో పోరాడిన త్యాగధనుల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నఈ స్వేచ్చ. ఈ స్వేచ్చను మనం బాధ్యతగా భావించి, ఉపయోగించుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోవద్దు.

కానీ వారి తిరుగుబాటు ఫలితం మనకు స్వతంత్రాన్ని దాదాపుగా తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు. ఇలా స్వతంత్రం కోసం తమ వంతు కృషి చేసిన వారు చాలామంది ఉన్నారు.అలాంటి అమరుల పేర్లు కూడా బయటకు రాకుండా మరుగునపడి పోతారు.పోయారు, అలాంటి వాళ్ళు ఇప్పటికి ఉన్నారో లేదో కానీ వారి వారసులు మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటారు.వారి జన్మధన్యం అయినట్టే. వారి గురించి తెలుసుకున్నందుకు మన జన్మ కూడా ధాన్యం అయినట్టే.. వారందరినీ ఒకసారి తలుచుకుంటూ మన కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఘనంగా నివాళులు ఆర్పిస్తూ.. సెలవ్..

Show More
Back to top button