HEALTH & LIFESTYLE

ఆపిల్ సైడర్ వెనిగర్.. ఉపయోగాలు

చాలా మంది ఆపిల్ సైడర్ వెనిగర్ అనే పదం వినే ఉంటారు. కానీ దీనిలో ఉన్న ఉపయోగాలు చాలా మందికి తెలియదు. దీనిని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైద్యులు వాడమని సలహా ఇస్తున్నారు. అసలు ఏంటి ఆపిల్ సైడర్ వెనిగర్? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… ఆపిల్ సైడర్ వెనిగర్ 10 వేల సంవత్సరాలు ముందు నుంచి ఉన్న ఒకే ఒక్క అద్భుతమైన పానీయంగా చెప్పవచ్చు.ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, సోడియం మరియు ఫ్లోరిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇది అధిక బరువును, చుండ్రును, మొటిమలు, గ్యాస్టిక్, షుగర్‌ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.

* ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్లలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి, భోజనం చేసే అరగంట ముందు తాగితే.. ఉదర కొవ్వు మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.
* అలాగే ఒక గిన్నెలో నీటిని తీసుకుని, 1/4 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్,1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, అరకప్పు నిమ్మకాయ రసం అన్నిటిని కలిపి దానిని మీ జుట్టు కుదుళ్ళకు రాసుకుని ఒక 30 నిమిషాలు ఉన్న తర్వాత తలస్నానం చేయండి.
* చిన్న గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగార్, బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకుని, మొటిమలు ఉన్న చోటా పేస్ట్‌ని రాసుకుని 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీళ్ళతో కడిగేస్తే.. ఫలితం చూసి మీరే ఆశ్చర్యపడతారు.

Show More
Back to top button