ప్రస్తుత రోజుల్లో సంగీత ప్రియుల సాధనాల్లో ఇయర్‌ఫోన్స్ ఒకటి. బస్, ట్రైన్, బైక్ ప్రయాణం ఏదైనా ఇయర్‌ఫోన్స్ మాత్రం అందరి చెవుల్లో ఉంటున్నాయి. WHO అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ యూత్ ఇయర్‌ఫోన్స్, బడ్స్ వంటివి వాడి ప్రమాదం బారిన పడుతున్నారని తెలిపింది. ఇయర్‌బడ్స్, ఇయర్‌ఫోన్స్ అయితే చెవికి దగ్గరగా ఎక్కువ సౌండ్‌తో వినిపిస్తాయి. చెవిలో పెట్టి ఉపయోగించాలి కాబట్టి చెవి లోపలి చర్మానికి రాషెస్ అవుతాయి. ఒకరి డివైజ్ మరొకరు వాడడం వల్ల బ్యాక్టీరియా వ్యాపించి, ఇన్ఫెక్షన్ రావొచ్చు.
చెవిలో క్లోకియా అనే ద్రవంతో కూడిన పొర దాని మీద వెంట్రుకలు ఉంటాయి. ఎక్కువ శబ్ధం దగ్గరగా వినడం వల్ల ఆ వైబ్రేషన్స్‌కి అవి ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. క్రమంగా వినికిడి లోపానికి గురవుతారు. ఎక్కువ డెసిబెల్ సౌండ్ చెవి నుండి మెదడుకు సంకేతాలు తీసుకువెళ్లడాన్ని నరాలు నిరోధిస్తాయి. చెవి ఇన్ఫెక్షన్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు, ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్‌లు ఉత్పత్తి చేసే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుకు, దీర్ఘకాలిక వినికిడి సమస్యలు కలిగిస్తాయి.
*మ్యూజిక్ లవర్స్ తెలుసుకోండి.
సౌండ్‌ను డెసిబుల్ (dB)లో కొలుస్తారు. మనం మాట్లాడుకునే సౌండ్ 60 dB మాత్రమే. 80dB మించి పెద్ద శబ్దాలు తరుచుగా వింటే వినికిడి సమస్య వస్తుంది. ఇయర్‌ఫోన్స్ 100dB సౌండ్ విడుదల చేస్తాయి. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, బ్లూటుత్ నుండి నాన్ అయోనైజింగ్ రేడియేషన్ విడుదల అవుతుంది. వైర్‌లెస్ కంటే వైర్ డివైజ్ వాడడం ఉత్తమం.
టిన్నిటస్, NIHL, హైపర్‌కసిస్, చెవి కంటే పెద్ద ఇయర్‌ఫోన్స్ వాడడం వల్ల చెవి కింది దవడ భాగం నొప్పి, మైకం, చెవి ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వైర్ ఇయర్‌ఫోన్స్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కంటే వైర్ హెడ్‌సెట్‌లో తక్కువ సౌండ్‌లో వినడం మంచిది.
ఇయర్‌ఫోన్స్ ఇంకొకరివి వాడాల్సివచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి.ఒకవేళ మీరు ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్, హెడ్‌సెట్ ఏవైనా ఎక్కువ సేపు వాడితే.. ప్రతి 15 నిమిషాలకోసారి వాటిని తీసి కొంచెం బ్రేక్ ఇవ్వాలి.