HEALTH & LIFESTYLE

వర్షాకాలం ఈ వ్యాధులతో జాగ్రత్త..!

జులై – డిసెంబర్ మధ్య కాలంలో వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులతో విష జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ జ్వరాలు నీటి ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. సీజనల్ ఫీవర్, సాధారణ జలుబు, దగ్గు ఈ సమయంలో వస్తాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక జ్వరాలను త్వరగా గుర్తించలేరు. వైరల్‌ ఫీవర్స్ 9 రోజులు ప్రభావం చూపిస్తాయి. ఈ జ్వరాలకు కారణమైన వైరస్‌ దోమల వాహకాలుగా తీసుకువస్తాయి. సాధారణంగా ఈ కాలంలో వచ్చే గొంతు నొప్పికి 90% వైరస్‌లే కారణం. 

విష జ్వరాలు – లక్షణాలు – నిర్ధారణ  

*డెంగ్యూ:  ప్రాణాంతకమైంది డెంగ్యూ వ్యాధి.  డెంగీని ముందుగా గుర్తించి వైద్యం మొదలు పెడితే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ర్యాపిడ్, ఎలీసా పరీక్షలతో డెంగీని నిర్థారించవచ్చు. సాధారణ జ్వరం, డెంగీ జ్వరానికి తేడా ప్లేట్ లెట్స్ కౌంట్, బీపీ తగ్గడం జరుగుతుంది. ప్లేట్ లెట్స్  20వేలకు తగ్గితే.. బాధితుడికి ప్లేట్ లెట్స్ అందించాల్సి ఉంటుంది. 

*మలేరియా: ఒంటినొప్పులు, రోజు మార్చి రోజు జ్వరం రావడం దీని లక్షణం. వైడల్ టెస్ట్ పాజిటివ్ వస్తే మలేరియా వచ్చినట్లు భావించవచ్చు.

*టైఫాయిడ్: తక్కువ టెంపరేచర్‌తో మొదలై తీవ్రంగా జ్వరం రావడం, అతిసారం, కడుపు నొప్పి, అలసట, ఆకలి లేకపోవడం, మలబద్ధకం, చర్మంపై దద్దుర్లు, దగ్గు, చెమట.. టైఫాయిడ్ లక్షణాలు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి ఆహారం షేర్ చేసుకోవద్దు. 

*గొంతునొప్పి తగ్గేందుకు గోరువెచ్చటి నీటిలో కళ్ల ఉప్పు వేసుకొని.. తరుచు పుక్కిట పట్టటం, లేదా మార్కెట్లో లభించే యాంటిసెప్టిక్‌ లోషన్లు నీటిలో కలిపి, పుక్కిట పట్టటం మంచిది. కొద్దిమందికి స్టైష్టోకాకల్‌ వంటి బ్యాక్టీరియా వల్ల గొంతు నొప్పి రావచ్చు. 

*నీళ్లు కలుషితమైతే కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. 

*శరీరం డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా కొబ్బరినీరు ఎక్కువగా తాగాలి.

*వేపఆకు డెంగ్యూ వైరస్‌ వ్యాప్తిని అరికడుతుంది. వేప ఆకులతో స్నానం చేయడం చాలా మంచిది.

*దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలి.

* నిల్వ ఉన్న నీటిపై దోమల మందు చల్లించడం, నీళ్లపై, ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి.

*దోమ తెరలు వాడటం, పూర్తిగా కప్పి ఉండేలా బట్టలు ధరించాలి.

Show More
Back to top button