అందరికి వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజం. మారిన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? అంటే ఉందని చెబుతున్నారు నిపుణులు. అవి ఏంటో చూద్దాం. కొన్ని రకాల పండ్లు తినడం వల్ల ముడతలు రాకపోవడమే కాకుండా.. ఉన్నవి పోతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిలో బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకుంటే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులు తయారవుతాయి. బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తాయి. చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.
బ్లాక్, బ్లూ, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక రకాల ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తాయి. విటమిన్-సి ఇందులో లభిస్తుంది. ఇది కొల్లాజెన్‌ను బలపరుస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి. మీరు పాలు, పంచదార కలిపిన టీ తాగుతుంటే, ఇక నుంచి మానేయండి. వెంటనే గ్రీన్ టీ తాగడం ప్రారంభించండి. ఇది బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలు తొలగిస్తుంది. ఇది కాటెచిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ప్రక్రియలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో ముడతలు పోయి చాలా యవ్వనంగా కనిపిస్తారు.