HEALTH & LIFESTYLE

శీతాకాలంలో పిల్లలకు ఈ ఫుడ్ ఎక్కువగా ఇవ్వొద్దు

చలికాలం వచ్చేసింది. సాధారణంగా ఈ కాలంలో చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, దగ్గు, జలుబు, అస్తమాతో పాటుగా చర్మ సంబంధిత సమస్యలు తరుచూ వస్తాయి. కాబట్టి పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పాల ఉత్పత్తులు
 
పాలు, వెన్న, జున్ను, పెరుగు లాంటి పాలు ఉత్పత్తులు పిల్లలకు అధికంగా ఇవ్వకూడదు. ఎందుకంటే పాలులో ఉండేవి జంతు సంబంధిత కొవ్వులు కాబట్టి చలి తీవ్రత పెరిగినప్పుడు నోట్లోని లాలాజలం, శ్లేష్మాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఆహారం మింగడంలో సమస్య ఎదురవుతుంది.

చక్కెర ఎక్కువ ఉండే ఆహారం వద్దు

పిల్లలు ఇష్టపడి తినే క్యాండీస్, కేక్స్, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీం లాంటి తీయటి పదార్థాలు ఇవ్వొద్దు. వీటిలో ఉండే చక్కెర స్థాయిలు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్యను తగ్గిస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

పచ్చళ్లు, పులియబెట్టిన ఆహారాలు వద్దు

నిల్వ ఉండడానికి తయారు చేసే ఆహారపదార్థాల్లో హిస్టమై అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది అలర్జీతో పోరాడే శక్తినిస్తుంది. పదే పదే తీసుకుంటే శీతాకాలంలో అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి గొంతు నొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను మాంసాహారాలు తెచ్చిపెడతాయి. 

Show More
Back to top button