HEALTH & LIFESTYLE

ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ చేసుకోండిలా..

మానవ శరీరానికి రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలంటే శక్తి కావాలి. అది మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. సగటున ఒక మనిషి రోజుకు 2,500 కేలరీలు తీసుకుంటారు. అయితే.. అందులో ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం అన్నదే ముఖ్యం. తక్కువ శ్రమ చేసేవారు ఎక్కువ కేలరీలు తీసుకుంటే స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి రోజుకు ఎన్ని కేలరీలు అవసరం ఉన్నాయో.. అంతే తీసుకుంటున్నారు. దీన్నే డైట్ అంటారు.

తినే ఆహార పదార్థాల్లో పోషకాలు తెలుసుకొని మితంగా తింటున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండేవారు ఓ నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. తక్కువ తింటే తలతిరగడం, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి, మిగతా సమయాల్లో పండ్లు, ఇతర పోషకాలు ఉండేవాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

Show More
Back to top button