HEALTH & LIFESTYLE

పీరియడ్స్ వేళ.. ఇవి పాటించండి..

వైద్యులు ఏం చెబుతున్నారంటే.. సహజంగా ప్రతి ఆడపిల్లకు

యుక్తవయస్సు ప్రారంభమైన తర్వాత మొదటి రుతుక్రమం సంభవిస్తుంది. దీనిని రజస్వల, పీరియడ్స్ అని అంటారు. బాలికలు 12 నుండి 15  సంవత్సరాల వయసు లోపు రుతుచక్రం  సంభవిస్తుంది. బాలికా వయసు నుండి యుక్తవయసులోకి ప్రవేశం పొందగానే పీరియడ్స్ ప్రారంభం సమయం నుండి ఆడపిల్లలకు ఎన్నో నియమ, నిబంధనలు ఉంటాయి. వారి శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అదేవిధంగా మానసికంగా కూడా చాలా మార్పులను వారిలో చూడవచ్చు. అయితే అటువంటి సమయంలో ఆడపిల్లలకు తల్లి దగ్గరగా ఉండి భరోసాను కల్పిస్తూ ఆసరాగా నిలవాలి. ఆ సమయంలో ఆడపిల్లను వివక్షగా చూడకుండా ప్రేమను కురిపించాలి.

పీరియడ్స్ సమయంలో ఆడపిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ తల్లి దగ్గరగా ఉంటూ వారికి తెలియజేయాలి. రుతు క్రమం మానవ శరీరంలో జరిగే ఒక క్లిష్టమైన గర్భస్థ స్థితి. ఆడపిల్లల దగ్గర నుంచి పీరియడ్స్ వచ్చే ప్రతి ఆడవాళ్లు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి.

వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో సహజ నొప్పి

ఆడవాళ్లందరిని వేధించే సమస్య పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి. ఈ నొప్పి ద్వారా వచ్చే బాధ వర్ణనాతీతం. ఒళ్ళు నొప్పులతో పాటు ఈ సమయంలో గర్భసంచి నుండి వచ్చే నొప్పి ఆడవారికి నరకం లాంటిదిగా చెప్పుకోవచ్చు. పురిటి నొప్పులను పోలి ఉండే ఈ నొప్పులతో ప్రతి ఆడపిల్ల పీరియడ్స్ సమయంలో పంటి బిగువన నొప్పిని దాచుకొని భరిస్తుంది. మానసికంగా, శారీరకంగా మహిళలు పీరియడ్స్ సమయంలో చిరాకుగా కోపంగా కనిపిస్తారు. దానికి తోడు కడుపు నొప్పితో తీవ్ర అసహనానికి లోనై కన్నీటి పర్యంతమవుతారు. కొందరు ఈ నొప్పిని భరించలేని మహిళలు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటారు. ఓపికతో నొప్పిని భరించండి కానీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కొద్దిసేపటి వరకు  మాత్రమే నొప్పిని నియంత్రించే ఈ టాబ్లెట్ వల్ల అనేక దుష్ప్రభావాలు కలుపుతాయని గర్భసంచి అనారోగ్యానికి గురవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే నొప్పి నుండి తప్పించుకోవడానికి వైద్యులు ఎటువంటి మార్గాలు చెబుతున్నారో చూద్దాం..

అధిక నీరు తాగడం

పీరియడ్స్ సమయంలో అసహనంతో ఉండే మహిళలు ఏమి తినాలన్నా, తాగాలన్న ఆసక్తి చూపరు. అయితే ఈ సమయంలో మహిళలు మంచినీరు తాగడమే మరచిపోతారని వైద్యులు చెబుతున్నారు. అలాకాకుండా రుతుస్రావం సమయంలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యమని శరీరం ఉత్తమం గా పని చేయడానికి మంచినీరు సహాయపడుతుందని పీరియడ్స్ సమయంలో ఎక్కువ మంచినీరు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో నీరు తాగకపోతే కడుపు ఉబ్బరం, తిమ్మిరి, తలనొప్పి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగినంతగా నీటిని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

పెయిన్ కిల్లర్స్ అస్సలు వద్దు…

ఇబు ప్రోఫెన్ వంటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ సప్లమెంటరీ డ్రగ్స్ మితిమీరిన వినియోగం జీర్ణాశయాంతర సమస్యలు, ఇతర సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది మహిళలు పీరియడ్స్ నొప్పిని భరించలేక ఈ టాబ్లెట్ లని వాడుతున్నారని, ఇవి ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. నొప్పిని తగ్గించడానికి హిట్ థెరపీ సున్నితమైన వ్యాయామం, హోం రెమెడీస్ ప్రయత్నించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. టాబ్లెట్స్ మాత్రం అసలు వేసుకోకూడదని చెబుతున్నారు.

కెఫిన్ పదార్థాలను దూరంగా ఉంచండి…

పీరియడ్స్ సమయంలో చాలామందికి కెఫిన్ పదార్థాలను తీసుకోవాలని కోరికలు పెరుగుతాయి. ఈ సమయంలో ఎక్కువగా కాఫీలు తాగడం,  షుగర్ ఫుడ్స్ తింటూ ఉంటారు. కాఫీ,  డార్క్ చాక్లెట్లు, షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పదార్థాల వల్ల మరింత కోపం పెరుగుతుందని సూచిస్తున్నారు. వీటికి బదులుగా హెర్బల్ టీ లు, ఆరోగ్యకరమైన పండ్లను తినాలని, పండ్ల రసాలను ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.

తగినంత నిద్ర అవసరం…

పీరియడ్స్ సమయంలో తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట, మూడ్ స్వింగ్స్ బాధలు తీవ్రతరమవుతాయని వైద్యులు అంటున్నారు. పీరియడ్స్ సమయంలో మంచి నిద్ర చాలా అవసరమని తగినంత నిద్ర లేకపోతే నీరసంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని మామూలు సమయంలో ఎలా ఉన్నా.. పీరియడ్ సమయంలో మాత్రం కనీసం 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

వాక్సింగ్ కు దూరంగా ఉండాలి…

పీరియడ్స్ సమయంలో వ్యాక్సింగ్ చేయడం వల్ల సున్నితత్వం నొప్పి స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో వ్యాక్సింగుకు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. చాలామంది మహిళలకు వస్త్రధారణ చాలా అవసరం అయితే పీరియడ్స్ సమయంలో వ్యాక్సింగ్ చేయడం వల్ల సున్నితత్వం నొప్పి స్థాయిలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తాయని, అసౌకర్యాన్ని పెంచుతాయని వైద్యులు సూచిస్తున్నారు. పీరియడ్స్ కి ముందు లేదంటే తర్వాత వ్యాక్సింగ్ చేయించడం మంచిదని, పీరియడ్స్ సమయంలో వ్యాక్సింగ్ చేయించకూడదని సూచిస్తున్నారు.

Show More
Back to top button