HEALTH & LIFESTYLE

అకస్మాత్తుగా బరువు పెరిగితే.ఈ సమస్యలు రావచ్చు.!

సాధారణంగా మన బరువు రోజుల్లో పలు గ్రాములు లేదా కేజీ వరకు మారుతూ ఉంటుంది. దీనికి మనం చేసే పని, తినే ఆహారం, శరీరంలో హార్మోన్ల విడుదల లాంటివి ముఖ్య కారణాలు. అయితే, ఉన్నట్టుండి సడెన్‌గా ఒకేసారి ఎక్కువ బరువు పెరిగితే పలు రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. మరి అవి ఏవో ఒకసారి చూద్దామా..? 

గుండె, లివర్, కిడ్నీ సమస్యలు: ఈ సమస్యల వల్ల కూడా వేగంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఈ సమస్యలు తలెత్తినప్పుడు ద్రవం నిలుపుదలకు అవకాశాలు ఉంటాయి. దీనివల్ల శరీర బరువు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎక్కువగా పెరుగుతుందట. 

పీసీఓఎస్: శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్య కలుగుతుంది. దీనివల్ల మన శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోయి.. సడెన్‌గా బరువు పెరుగుతారు. 

హైపో థైరాయిడ్: ప్రస్తుతం చూసుకుంటే చాలా మంది మహిళల్లో థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా శరీరంలో T3,T4,TSH హార్మోన్ల ఉత్పత్తిలో ఏదైనా తేడాలు జరిగితే దాని ప్రభావం థైరాయిడ్ గ్రంథి మీద పడుతుంది. దీనివల్ల ఆ గ్రంథి పనితీరు వేగంగా లేదా నెమ్మదిగా మారుతుంది. ఒకవేళ హార్మోన్లు తక్కువగా విడుదలైతే దాన్నే హైపో థైరాయిడిజం అని అంటారు. దీనివల్ల అవయవాల పని తీరు నెమ్మదిస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా కరగకుండా కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ఈ కారణంగా బరువు వేగంగా పెరుగుతారు.

ఊబకాయం: మారుతున్న జీవనశైలి వల్ల ఎక్కువగా శరీర శ్రమ ఉండటంలేదు. దీనివల్ల శరీరంలో ఎక్కువగా కదలిక ఉండదు. దీంతో శరీర కొవ్వు కరగడానికి సమయం పడుతుంది. దీనికితోడు మితిమీరి తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు జంక్ ఫుడ్ తగ్గించి.. రోజూ వ్యాయామం చేయడం ప్రారంభించండి.

Show More
Back to top button