సాధారణంగా ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో 35 వేల కేజీల ఆహారాన్ని తింటాడు. అంత ఆహారాన్ని అరిగేలా చేసి, మన శరీరానికి శక్తిని అందించేది మన జీర్ణవ్యవస్థ. ఈ వ్యవస్థ 9మీటర్ల పొడవుండే సంక్లిష్టమైన నిర్మాణం. ఇది నోటి నుంచి మొదలై ఆహారనాళం, జీర్ణాశయం, చిన్నపేగు, కాలేయం, క్లోమం, గాల్ బ్లేడర్, పెద్ద పేగు, రెక్టం అనే భాగాలు ఒకదానితో ఒకటి కలుపబడి ఉండే 9 మీటర్ల ఒక పొడవైన మార్గం. మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం నేరుగా ఉపయోగించుకోలేదు. ఆహారాన్ని ‘సింపుల్ ఎలిమేంట్స్’గా మార్చవలసి ఉంటుంది. ఆ పని జీర్ణవ్యవస్థ చేస్తుంది. అసలు జీర్ణాశయంలో ఆహారం ఎలా జీర్ణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం తీసుకునే ఆహారాన్ని బాగా నమిలినపుడు అది నోటిలోని సలైవాతో కలిసి ఆహారంలోని కార్బోహైడ్రేట్లు కొంత వరకు గ్లూకోజ్‌గా మారుతాయి.
బోలస్
నోటిలో మెత్తగా తయారైన ఆహార ముద్దను ‘బోలస్’ అంటారు. ఇది 25 సెం.మీ పొడవుండే ఆహారనాళం నుంచి జీర్ణాశయంలోకి చేరడానికి కొన్ని చలనాలను జరుపుతుంది. వీటినే పెరిస్టాలిక్ చలనాలు అంటారు. జీర్ణాశయం ఒక సంచిలాంటి నిర్మాణం. దీంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, హార్మోన్స్ అనేవి విడుదల అవుతాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ అనేవి చాలా శక్తివంతమైనవి. ఇవి మన చేతిపైన పడితే చేయి కాలిపోతుంది. కానీ, జీర్ణాశయ లోపల గోడల్లో మ్యూకస్‌తో ఏర్పడిన పొర ఉండడం వల్ల మన జీర్ణాశయం సురక్షితంగా ఉంటుంది. ఆహారాన్ని జీర్ణాశయంలోని కండరాలు కదులుతూ ఈ యాసిడ్స్‌తో కలిసేలా చేస్తుంది. యాసిడ్స్ కలిసిన ఈ ఆహారాన్ని ‘కైమ్’ అంటారు. ఈ కైమ్ జీర్ణాశయం కింది భాగంలో ఉన్న ‘పైరోలిక్ స్ప్రింగ్‌టర్’ అనే మార్గం ద్వారా ప్రతి 20సెకన్లకు ఒకసారి కొద్ది కొద్దిగా ‘డియోడినమ్’ అనే అవయవంలోకి పంపుతుంది. ఇలా జీర్ణాశయంలోని ఆహారం ఖాళీ అవ్వడానికి 3నుంచి 5గంటల సమయం పడుతుంది.
జీర్ణ వ్యవస్థ
డియోడినమ్‌లో క్లోమం, బైల్ అనే జీర్ణరసాలు ఆ కైమ్‌తో కలిసి దానిలోని ప్రొటీన్స్-అమీనో యాసిడ్స్, కొవ్వు-ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్- గ్లూకోజ్‌గా మారుస్తాయి. ఆ తర్వాత మిగిలిన కైమ్ చిన్న ప్రేగులోకి ప్రయాణిస్తుంది. అక్కడ ‘వెల్లాయి’ అనే కొన్ని లక్షల వెంట్రుకల వంటివి ఉంటాయి. ఇవి ఆహారంలోని పోషకాలను పీల్చుకుని నేరుగా రక్తంలోకి పంపిస్తాయి. దీని వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. తర్వాత మిగిలిన కైమ్ పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. అక్కడ అందులో మిగిలిన ఫైబర్, నీటిని పూర్తిగా పీల్చుకుని మిగిలిన పదార్థాన్ని రెక్టం అనే ఛాంబర్‌లోకి పంపుతుంది. దీన్నే స్టూల్(మలం) అంటారు. ఇది రెక్టం నుంచి ఆనస్ ద్వారా బయటకి వెళ్లిపోతుంది. ఈ మొత్తం మార్గాన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి మనం తినే ఆహారాన్ని బట్టి 24-72గంటల సమయం పడుతుంది.