కరోనా వల్ల ఎంతో మంది సతమతమయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల కలిగిన ప్రభావాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాము. అయితే, భవిష్యత్తులో ఇలాంటి మరో మహమ్మారులు ఇంకా రానున్నాయని చెబుతున్నారు వైద్యులు. అవే ఊబకాయం, వెన్నుపూస నొప్పి. అదేంటి ఇవి ఎందుకు మహమ్మారులుగా మారుతాయి అని అనుకుంటున్నారా..? దీనికి వైద్యులు చెప్పిన సమాధానం ఏంటంటే.. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి వల్ల శారీరక శ్రమ ఉండడంలేదు.
దీనికి తోడు బద్దకం జత కావడంతో జనరల్ షాపుకు వెళ్లాలన్న బండి మీద వెళ్తున్నారు. దీనివల్ల ఊబకాయం పెరుగుతోంది. 2024లో చూసుకుంటే భారత దేశంలో ప్రతి వందమందిలో 22 మంది ఈ ఊబకాయంతో బాధ పడుతున్నారు. ఈ సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరగనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వెన్నుపూస నొప్పి: ముందు చెప్పుకున్నట్టు ఎక్కువ సమయం కూర్చొని పని చేయడం వల్ల వెన్నుపూసలో కదలిక లేకపోవడంతో బిగుసుకుపోతుంది. దీనికి తోడు ఎలాంటి వ్యాయామం, యోగా చేయకపోతే ఇక భవిష్యత్తులో నడుము నొప్పి రావడం తధ్యం అని వైద్య నిపుణులు అంటున్నారు. మరి భవిష్యత్తును ఆరోగ్యమయం చేయాలంటే ఏం చేయాలో ఒక లుక్ వేద్దామా..?
*ప్రతి రోజు తప్పకుండా 30 నిమిషాల నుంచి గంట వరకు యోగా, వ్యాయామం చేయాలి.
*ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినాలి.
*ఎక్కువ సేపు కూర్చోవడం, నిలబడడం చేయకూడదు.
*శరీర కదలిక చాలా ముఖ్యం.