HEALTH & LIFESTYLE

వేసవిలో చెరుకు రసం వల్ల ఎన్నో ప్రయోజనాలు..

చాలామంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడతారు. ఇందులో రుచితో పాటు మనం ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఎన్నో ఉన్నాయి.

చెరకు గడ తినడం కష్టం. కానీ, జ్యూస్‌గా చేసుకుని తాగడం చాలా సులభం. చెరుకులో అధిక కేలరీలు ఉంటాయి. కాబట్టి, వేసవికాలంలో బయట ఎండలో తిరిగినప్పుడు కోల్పోయిన ఎనర్జీ చెరకు రసం తాగి తిరిగి పొందవచ్చు.

చెరకులోని నాచురల్ షుగర్‌లో తక్కువ గ్లైసెమిక్‌ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో హెచ్చుతగ్గులను తగ్గిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మితంగా చెరకు రసాన్ని తీసుకోవాలి.

చెరకు రసం చేసే మంచి

చెరకు రసంలో విటమిన్లు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వేసవిలో ఎక్కువగా సంభవించే డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.

శరీరంలో అనవసరమైన నీటిని, వ్యర్థాలను బయటకు పంపే టాక్సిన్లు చెరకు రసంలో ఉంటాయి.

చెరకులో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతం చేసి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

చెరకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.

బాలింతలు చెరకు రసం తాగితే వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుందట.

చర్మం మృదువుగా, మేలైన నిగారింపుతో మెరిసిపోతుంది. అలానే ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి.

చెరకు రసం శరీరంలో చెడు కొవ్వులైన LDL, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది.

గొంతునొప్పి, జలుబు, ఫ్లూ వంటివి చెరకు రసంతో నయం అవుతాయి. నోటి పూతను, దంతక్షయాన్ని తగ్గిస్తుంది.

Show More
Back to top button