శీతాకాలంలో ముల్లంగి మంచి ఆహారం. ముల్లంగిని తీసుకుంటే, జీర్ణక్రియ సక్రమంగా జరగటంతో పాటు మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పైల్స్ రోగులకు మలబద్ధకాన్ని నివారించడం చాలా ముఖ్యం. ముల్లంగిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఈజీ మోషన్‌కు సహాకరిస్తుంది. ఎవరైనా పైల్స్‌తో బాధపడుతుంటే, తప్పకుండా ముల్లంగి తీసుకోవడం మంచిది.
దాదాపు ప్రతి నలుగురు వృద్ధుల్లో ముగ్గురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పాయువు, దిగువ పురీషనాళంలో సిరల వాపు పైల్స్‌కు కారణం. మలద్వారంలో దురద లేదా మంట, నొప్పి, పాయువు వద్ద వాపు, రక్తస్రావం, పురీషనాళం నుంచి రక్తస్రావం, స్టూల్ పాస్ చేసేటప్పుడు ఒత్తిడి కలగడం దీని లక్షణాలు. పైల్స్‌లో అంతర్గత, బాహ్య అని రెండు రకాలుగా ఉంటాయి.
మూలశంక నియంత్రణ
ముల్లంగి వినియోగం పైల్స్‌ను నియంత్రించడంలో బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముల్లంగితో పాటు, దీని ఆకులను కూడా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ ముల్లంగిలో రాప్నిన్, గ్లూకోసిలినేట్స్, విటమిన్-సి వంటి మెటాబోలైట్‌లు ఉంటాయి. ఇవి పైల్స్‌తో వచ్చే వాపు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ముల్లంగిలో వోలటైల్ ఆయిల్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి మలద్వారపు వాపును తగ్గిస్తుంది. ముల్లంగిని తింటే పైల్స్‌లో దురద, నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ముల్లంగి ఆకులను ఎండబెట్టి, దానితో పొడి చేయాలి. ఆ పొడిని రోజుకు రెండు చెంచాల చొప్పున 2 సార్లు తీసుకుంటే పైల్స్ నొప్పి తగ్గుదల ఉంటుంది.