HEALTH & LIFESTYLE

ఎలక్ట్రికల్ కుక్కర్‌లో వండుకుని తింటున్నారా..?

ఎలక్ట్రిక్ కుక్కర్ ఇప్పుడు అందరూ వినియోగిస్తున్నారు. వీటిలో రైస్‌తో పాటు కూరలు వండటానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో వండిన ఆహారం తింటే అనర్థాలు తప్పవంటున్నారు వైద్యులు. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అన్నం వండేటప్పుడు కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయని, ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఆహారంలో పోషకాలన్నీ నశిస్తాయని చెబుతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఉడికించిన ఆహారాన్ని తింటే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.

కీళ్ల నొప్పులు
ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటే, చిన్న వయసులోనే కాళ్లు, కీళ్లు, నడుము నొప్పులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మతిమరుపు
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండే అన్నం తినడం వల్ల మతిమరుపు కూడా రావచ్చు. అల్యూమినియం పాత్రలో వండిన అన్నం తినడం వల్ల మెదడు పనితీరు అనేది మందగిస్తుంది. జ్ఞాపక శక్తి నశిస్తుంది. దీంతో మతిమరుపు అనేది పెరుగుతుంది.

Show More
Back to top button